Valathu Vashathe Kallan Review | దృశ్యం డైరెక్టర్ లేటెస్ట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉంది? – ట్విస్ట్‌లతో మైండ్‌బ్లాక్ చేసిందా?
జోజు జార్జ్, బిజు మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళం క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇటీవల రిలీజైంది. దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందంటే?
Entertainment | Published On Apr 5, 2026, 6.09 pm IST
Valathu Vashathe Kallan Review | దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ వలతు వశత్తే కల్లన్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జోజు జార్జ్, బిజు మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎలా ఉంది? దృశ్యం మాదిరిగానే ట్విస్ట్‌లు, టర్న్‌లతో ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?
ఆంటోనీ వర్సెస్ సామ్....
ఆంటోనీ జేవియర్ (బిజు మీనన్) ఓ పోలీస్ ఆఫీసర్. భార్య చనిపోవడంతో కొడుకు ఫిలిప్‌ను (కేఆర్ గోకుల్) కష్టపడి పెంచి పెద్ద చేస్తాడు. కానీ ఫిలిప్ చెడు సావాసాలకు అలవాటుపడతాడు. డ్రగ్ అడిక్ట్‌గా మారతాడు. తండ్రి ఆంటోనీని ద్వేషిస్తుంటాడు ఫిలిఫ్. రాజీవ్ అనే యువకుడు తనను లైంగికంగా వేధించాడంటూ తల్లితో కలిసి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి ఓ యువతి వస్తుంది. రాజీవ్ గొప్పింటి యువకుడు కావడంతో ఈ కేసులో అతడినే సపోర్ట్ చేస్తాడు ఆంటోనీ. ఆ అమ్మాయిదే తప్పు అని వాదించి కంప్లైంట్ తీసుకోవడానికి నిరాకరిస్తాడు. ఆంటోనీ మాటలు భరించలేక పోలీస్ స్టేషన్ ముందే ఆ యువతి ఆత్మహత్య చేసుకుంటుంది. ఐరీన్ (వ్యశ్నవీ రాజ్) అనే సోషల్ యాక్టివిస్ట్ ఈ కేసులో నిజానిజాలు వెలికితీసే ప్రయత్నాలు చేస్తుంది. ఆంటోనీకి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించే పనిలో ఉంటుంది. అనుకోకుండా ఓ రోజు ఐరీన్ కనిపించకుండా పోతుంది. తన కూతురు అదృశ్యమైందని ఐరీన్ తండ్రి సామ్యూల్ జోసెఫ్ అలియాస్ సామ్ (జోజు జార్జ్) పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు. అడవిలో ఐరీన్ డెడ్‌బాడీ దొరుకుంది. ఆమెను దారుణంగా హింసించి చంపారని పోస్ట్‌మార్టంలో బయటపడుతుంది. ఐరీన్ చనిపోయేరోజు చివరగా ఆంటోనీనే కలిసిందనే నిజాన్ని సామ్ బయటపెడతాడు. ఆంటోనీకి అవినీతి పనులన్నీ ఒక్కొక్కటిగా ఆధారాలతో నిరూపిస్తాడు. రాజీవ్‌ను చంపడమే కాకుండా ఆంటోనీ కొడుకు ఫిలిప్‌ను కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? ఆంటోనీ స్టేషన్‌లోనే సామ్ ఎలా చనిపోయాడు? ఫిలిప్‌ను కిడ్నాప్ చేసిన సామ్ ఎక్కడ దాచిపెట్టాడు? కొడుకును ఆంటోనీ కాపాడుకున్నాడా? ఐరీన్ చావుకు ఆంటోనీకి నిజంగానే సంబంధం ఉందా? కొడుకు గురించి ఆంటోనీకి ఎలాంటి షాకింగ్ నిజాలు తెలిశాయి అన్నదే ఈ మూవీ కథ.
దృశ్యం కల్ట్ క్లాసిక్...
దృశ్యం క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్ సినిమాల్లో ఓ కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఈ జానర్‌కు ఓ బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. దృశ్యం స్ఫూర్తితో వందలాది క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాను ఏదీ బీట్ చేయలేదు. చివరకు దృశ్యం సినిమా తీసిన జీతూ జోసెఫ్ సైతం ఆ స్థాయి సినిమా మళ్లీ చేయలేకపోయారంటే ఈ సినిమా చూపించిన ఇంపాక్ట్ అలాంటిది.
దృశ్యం మూవీ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కెరీర్‌కు ప్లస్‌తో పాటు మైనస్‌గా మారింది. అతడు ఏ సినిమా చేసిన దృశ్యంతో కంపేర్ చేయడం కామన్‌గా మారింది. వలతు వశత్తే కల్లన్ విషయంలో అదే జరిగింది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇటీవలే థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాలోనూ దృశ్యం ఛాయలు కనిపిస్తాయి.
అవినీతిపరుడైన పోలీస్ ఆఫీసర్... హ్యాకింగ్‌లో నిష్టాతుడైన ఓ కామన్ మ్యాన్...ఒకరిపై మరొకరు వేసే ఎత్తులతో చివరి వరకు థ్రిల్లింగ్‌గా ఈ సినిమాను నడిపించారు.
ఎమోషనల్ క్లైమాక్స్...
ఆంటోనీ అవినీతి పనులు, కొడుకు ఫిలిప్‌తో అతడి గొడవలతో ఈ సినిమా మొదలవుతుంది. కూతురితో శామ్యూల్ అనుబంధం...ఐరీన్ కనిపించకుండా పోవడం వంటి అంశాలతో కథను ముందుకు నడిపించారు. రాజీవ్‌ను చంపిన సామ్...నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయే సీన్‌తో ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. సెకండాఫ్‌లో తన కొడుకును కాపాడుకోవడం కోసం ఆంటోనీ చేసే ప్రయత్నాలు...పోలీస్ స్టేషన్‌లోనే సామ్ చనిపోవడం...అతడు ఇచ్చిన ఒక్కో క్లూస్ ఛేదించే సీన్స్‌తో ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఎమోషనల్ క్లైమాక్స్‌తో సినిమా ఎండ్ చేసిన తీరు ఆకట్టుకుంది.
మంచి మెసేజ్...
కేవలం క్రైమ్ థ్రిల్లర్ అంశాలకే పరిమితం కాకుండా పిల్లలు చెడుదారులు పట్టడానికి తల్లిదండ్రుల పెంపకం, వారి వ్యక్తిత్వం కూడా కొన్నిసార్లు కారణమవుతాయనే మెసేజ్‌ను ఇచ్చారు. పోలీస్ వ్యవస్థలో పై అధికారుల ఒత్తిడులు ఎలా ఉంటాయి? ఇష్టం లేకపోయినా కొన్ని పనులు ఎలా చేయాల్సివస్తుందన్నది వలతు వశత్తే కల్లన్‌లో చూపించారు. ఈ సినిమా రన్‌టైమ్ తక్కువే.
వలతు వశత్తే కల్లన్ కాన్సెప్ట్ బాగున్నా స్క్రీన్‌ప్లే కన్ఫ్యూజింగ్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్ లాజిక్‌లెస్‌గా సాగుతుంది.
పోటాపోటీ నటన...
కూతురి మరణానికి ప్రతీకారం తీర్చుకునే తండ్రి పాత్రలో జోజు జార్జ్, అవినీతిపరుడైన పోలీస్‌గా బిజు మీనన్ ఇద్దరూ పోటాపోటీ నటనను కనబరిచారు. తమ అనుభవంతో పాత్రలకు ప్రాణం పోశారు.
జీతూ జోసెఫ్ సినిమాల్లో ఉండే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్‌లు, టర్న్‌లు ఈ సినిమాలో లేవు. దృశ్యంతో కంపేర్ చేసి ఈ సినిమాను చూస్తే మాత్రం డిసపాయింట్ కావడం ఖాయం. బీజు మీనన్, జోజూ జార్జ్ యాక్టింగ్ కోసం ఈ సినిమాను చూడొచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Malayalam OTT | తెలుగులో రిలీజైన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ – పోలీస్‌పై కామన్ మ్యాన్ రివేంజ్
ఏప్రిల్ 18, 2026

Mohan Lal | ఓటీటీలో పెద్ద హిట్ – థియేటర్లలో ఎపిక్ డిజాస్టర్ – మోహన్‌లాల్ మూవీకి షాకింగ్ కలెక్షన్స్
ఏప్రిల్ 14, 2026

Dacoit Review | డెకాయిట్ రివ్యూ – అడివి శేష్, మృణాల్ ఠాకూర్ లవ్‌స్టోరీ ఎలా ఉందంటే?
ఏప్రిల్ 10, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



