Dridam Review | క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్ బ్లాక్ – దృశ్యం డైరెక్టర్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
మలయాళం క్రైమ్ ఇన్వెస్టిగేట్ థ్రిల్లర్ మూవీ ధృడం జియో హాట్‌స్టార్‌లో ఇటీవల రిలీజైంది. దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ ప్రజెంటర్‌గా వ్యవహరించిన ఈ సినిమాలో షేన్ నిగమ్ హీరోగా నటించాడు. ఈ మలయాళం మూవీ ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?
Entertainment | Published On Jun 13, 2026, 10.04 am IST
Dridam Review | దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ (Jeethu Joseph) ప్రజెంటర్‌గా రూపొందిన మలయాళం (Malayalam) క్రైమ్ ఇన్వెస్టిగేట్ థ్రిల్లర్ మూవీ ధృడం జియో హాట్‌స్టార్‌లో(JioHotstar) స్ట్రీమింగ్ అవుతోంది. షేన్ నిగమ్ హీరోగా నటించిన ఈ సినిమాకు మార్టిన్ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
విజయ్ అన్వేషణ....
కేరళలోని ఓ హిల్ స్టేషన్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విజయ్ రాధాకృష్ణన్ (షేన్ నిగమ్) కొత్తగా డ్యూటీలో చేరతాడు. ఆ ఏరియాలో క్రైమ్ రేటు చాలా తక్కువగా ఉంటుంది. ఫస్ట్ పోస్టింగ్ కావడంతో తన జాబ్‌ను ప్రశాంతంగా చేసుకోవచ్చని విజయ్ అనుకుంటాడు. ఆ పోలీస్ స్టేషన్‌లోని కానిస్టేబుల్స్ అందరూ సీనియర్స్ అయినా విజయ్‌తో ఫ్రెండ్లీగా ఉంటారు. విజయ్ జాబ్‌లో చేరిన కొద్ది రోజులకే ఆ ఏరియాలో మూడు గుర్తు తెలియని డెడ్‌బాడీలు దొరుకుతాయి. ఓ ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం జరుగుతుంది. ఈ నేరాలకు సంబంధించి చిన్న క్లూ కూడా లభించకపోవడంతో ఉన్నతాధికారుల నుంచి విజయ్‌పైఒత్తిడి పెరుగుతుంది. ఆ డెబ్‌బాడీలు కూలీలుగా పనిచేసే పాత క్రిమినల్స్‌వనే నిజం బయటపడుతుంది. వాళ్లే బ్యాంకు రాబరీ చేశారని కూడా విజయ్ కనిపెడతాడు. ఆ క్రిమినల్స్‌ను హత్య చేసింది ఎవరు? అసలైన హంతకులను విజయ్ ఎలా పట్టుకున్నాడు? అతడి పోలీస్ స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్స్ విజయ్‌ని చంపాలని ఎందుకు అనుకున్నారు? విజయ్‌ని ఇష్టపడిన అమ్మాయికి ఈ మర్డర్స్‌తో సంబంధం ఉందా? అన్నదే ఈ మూవీ కథ.
సైడ్ ట్రాక్స్ లేకుండా
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించడంలో మలయాళ దర్శకులు సిద్ధహస్తులు. మలయాళంలో ఈ జానర్‌లో వచ్చిన ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పించాయి. ధృడం ఖచ్చితంగా ఈ లిస్ట్‌లో చేరే సినిమానే.
ధృడం ప్యూర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. ఇందులో హీరోయిజం, పాటలు, లవ్‌స్టోరీ, కామెడీ లాంటి కమర్షియల్ హంగులేవి కనిపించవు. ఎలాంటి సైడ్ ట్రాక్స్ లేకుండా కేవలం తాను అనుకున్న కథను మాత్రమే రెండు గంటల ఏడు నిమిషాలు స్క్రీన్‌పై డైరెక్టర్ చూపించాడు.
పోలీస్ వ్యవస్థ పనితీరు...
పోలీస్ వ్యవస్థ పనితీరు ఎలా ఉంటుంది? మర్డర్స్, రాబరీ లాంటి పెద్ద క్రైమ్ కేసులను సాల్వ్ చేసే క్రమంలో పోలీసులు పడే సంఘర్షణతో పాటు ఉన్నతాధికారుల ఒత్తిడి ఏ విధంగా ఉంటుందన్నది రియలిస్టిక్‌గా చూపించాడు. కొన్ని సార్లు బాగా నమ్మిన వాళ్లే ఎలా మోసం చేస్తారనే మెసేజ్ ఇచ్చారు.
మైండ్‌బ్లాక్....
ధృడం క్లైమాక్స్ మాత్రం అదిరిపోతుంది. కేవలం ఈ ట్విస్ట్‌ను మాత్రమే నమ్ముకొని దర్శకుడు సినిమాను తెరకెక్కించారు. అసలు కిల్లర్ ఎవరన్నది రివీలయ్యే ఎపిసోడ్ గూస్‌బంప్స్ ఫీలింగ్‌ను కలిగిస్తుంది. అరే భలే రాశాడే డైరెక్టర్...అని ఆడియెన్స్ అనుకునేలా చేస్తుంది.
ఒక్క క్లైమాక్స్ కోసం మిగిలిన కథను మొత్తం సాగదీశాడు. మర్డర్స్, రాబరీ కేసులను విజయ్ అండ్ టీమ్ ఇన్వెస్టిగేట్ చేసే సీన్లలో ఆసక్తి లోపించింది. కథ ముందుకు కదలక అక్కడే తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌గా రాసుకుంటే బాగుండేది. హిల్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్ సినిమాకు బాగా సెట్టయ్యింది.
నిజమైన పోలీస్...
ఎస్ఐ విజయ్‌గా షేన్ నిగమ్ నటన బాగుంది. బాడీలాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు డైరెక్టర్. నిజంగానే పోలీస్ ఆఫీసర్‌లా హీరో పాత్రను చూపించాడు. కానిస్టేబుల్ పాత్రల్లో కనిపించిన వారి నటన సహజంగా ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కథకు అడ్డుగా ఉంటుందని దర్శకుడు అనుకున్నట్లున్నాడు. అందుకే పెట్టలేదు.
క్రైమ్ థ్రిల్లర్ లవర్స్‌ను మెప్పించే సినిమా ఇది. క్లైమాక్స్ మాత్రం గుర్తుండిపోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Malayalam OTT | ఓటీటీలోకి మోహన్‌లాల్ మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ – తెలుగులో రిలీజ్
జూన్ 13, 2026

Malayalam OTT | ఓటీటీలోకి మలయాళం క్రైమ్ ఇన్వెస్టిగేట్ థ్రిల్లర్ మూవీ – దృశ్యంకు మించిన ట్విస్ట్‌లతో
జూన్ 2, 2026

Crime Thriller OTT | ఓటీటీలోకి ట్విస్ట్‌లతో సాగే తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ – ఒకే రోజు మూడు ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్
మే 10, 2026
తాజావార్తలు
- ●Smrithi Irani | కేంద్ర మాజీ మంత్రికి షాక్.. ఓటర్ల జాబితాలో పేరు గల్లంతు..
- ●Bomb Threat | ఆ విమానం ఏ క్షణమైన పేలిపోవచ్చు.. శంషాబద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
- ●Telegram | స్మార్ట్‌వాచ్‌లోనూ టెలిగ్రామ్.. ఏఐ గార్డియన్ బాట్స్‌తో కొత్త అప్డేట్..
- ●Abhishek Banerjeee | అభిషేక్ బెనర్జీ నివాసంలో ఆకస్మిక సోదాలు.. భారీగా మోహరించిన పోలీసులు
- ●Driving | కారు, బైక్ నడపడం వచ్చా?.. ఇలా చేస్తే మీకు నెలకు రూ.లక్ష జీతం వచ్చినట్టే..
- ●Rain Alert | నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ..

Smrithi Irani | కేంద్ర మాజీ మంత్రికి షాక్.. ఓటర్ల జాబితాలో పేరు గల్లంతు..

Bomb Threat | ఆ విమానం ఏ క్షణమైన పేలిపోవచ్చు.. శంషాబద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

Telegram | స్మార్ట్‌వాచ్‌లోనూ టెలిగ్రామ్.. ఏఐ గార్డియన్ బాట్స్‌తో కొత్త అప్డేట్..

Abhishek Banerjeee | అభిషేక్ బెనర్జీ నివాసంలో ఆకస్మిక సోదాలు.. భారీగా మోహరించిన పోలీసులు



