Jana Nayakudu Review | జననాయకుడు రివ్యూ – తమిళనాడు సీఎం దళపతి విజయ్ చివరి మూవీ ఎలా ఉందంటే?
తమిళనాడు సీఎం దళపతి విజయ్ హీరోగా నటించిన జననాయగన్ మూవీ గురువారం థియేటర్ల ద్వారా ప్రేక్షకలు ముందుకొచ్చింది. తెలుగుతో పాటు తమిళంలో రిలీజైన ఈ సినిమా ఎలా ఉందంటే?
Entertainment | Published On Jul 23, 2026, 1.19 pm IST
Jana Nayakudu Review | తమిళనాడు ఎన్నికలకు ముందు దళపతి విజయ్ జననాయగన్ సినిమా చేశారు. నటుడిగా ఇదే తన చివరి మూవీ అంటూ ప్రకటించారు. విజయ్ రాజకీయ అరంగేట్రానికి సన్నాహకంగా సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ సెన్సార్ అడ్డంకుల కారణంగా వాయిదా పడిన ఈ సినిమా దళపతి విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత థియేటర్లలోకి వచ్చింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. మమితా బైజు కీలక పాత్ర పోషించింది. బాలకృష్ణ భగవంత్ కేసరికి రీమేక్‌గా రూపొందిన ఈ మూవీకి హెచ్ వినోథ్ దర్శకత్వం వహించారు. విజయ్ పొలిటికల్ ఐడియాలజీతో రూపొందిన ఈ మూవీ ఎలా ఉందంటే?
టీవీకే పోరాటం....
దళపతి వెట్రి కొండన్ (దళపతి విజయ్) ఓ పోలీస్ ఆఫీసర్. పై అధికారిని చంపిన కేసులో జైలు శిక్షను అనుభవిస్తుంటాడు.దళపతికి వ్యతిరేకంగా అతడి తల్లి తప్పుడు సాక్ష్యం చెబుతుంది. దళపతిని జైలు నుంచి విడిపించడానికి సాయం చేసిన జైలర్ (గౌతమ్ మీనన్) చనిపోతాడు. అతడి కూతురు విజ్జీ (మమితా బైజు) బాధ్యతను దళపతి చేపడతాడు. జైలర్ కోరిక మేరకు విజ్జీని ఆర్మీలో జాయిన్ చేయాలని అనుకున్నాడు. కానీ విజ్జీ కొన్ని మానసిక సమస్యలతో బాధపడుతుంది. అదే టైమ్‌లో విజ్జీని చంపేందుకు కొంత మంది ప్రయత్నిస్తారు. వారి వెనుక జాన్ హిమ్మర్ (బాబీ డియోల్) అనే వ్యక్తి ఉన్నాడని దళపతికి తెలుస్తుంది. అసలు హిమ్మర్ ఎవరు? దళపతి చేతిలో చనిపోయిన ఆమ్రిష్ పుజారికి (బాడీ డియోల్)అతడికి ఉన్న సంబంధమేమిటి? పోలీస్‌గా ఉన్న దళపతి రాజకీయ నాయకుడు రోజా రంగస్వామి(ప్రకాష్ రాజ్) అవినీతిని ఎలా ఎదురించాడు? తమిళనాడులో మతకల్లోలాలను సృష్టించాలని అనుకున్న హిమ్మర్ కుట్రలను కయల్(పూజా హెగ్డే) అనే జర్నలిస్ట్‌తో కలిసి దళపతి ఎలా ఎదుర్కొన్నాడు? విజ్జీలోని భయలు తొలగిపోయాయా? లేదా? అన్నదే ఈ మూవీ కథ...
పొలిటికల్ ఎంట్రీ....
తమిళనాడు సీఎం దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు తీసిన మూవీ జననాయగన్. అతడి రాజకీయ అరంగేట్రానికి గ్రాండ్ సెలబ్రేషన్‌లా, అతడి పొలిటికల్ ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్లలనే ఉద్దేశంతో రూపొందించిన సినిమా ఇది. కానీ సెన్సార్ అడ్డంకుల కారణంగా సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ ఏడు నెలల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఫ్రేమ్ టూ ఫ్రేమ్....
బాలకృష్ణ హీరోగా నేషనల్ అవార్డును గెలుచుకున్న తెలుగు మూవీ భగవంత్ కేసరి ఆధారంగా జననాయగన్ రూపొందింది. భగవంత్ కేసరిలో చర్చించిన మహిళా సాధికారత, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, మహిళ వివక్ష అనే అంశాలను తమిళ రీమేక్‌లో ఫ్రేమ్ టూ ఫ్రేమ్ దించేశారు. తెలుగు ఒరిజినల్ సినిమా చూసిన వారిని ఆ సన్నివేశాలు మెప్పించడం చాలా కష్టం. ఆ ఎమోషన్లు కూడా ఆర్టీఫీషియల్‌గా ఉన్నాయి.
మిగిలిన విలన్ ట్రాక్ మొత్తం చాలా మార్చేశారు డైరెక్టర్ హెచ్ వినోథ్. ఆ మార్పులు చేర్పులు జననాయగన్‌కు మైనస్‌గా మారాయి. విజయ్ ఎలివేషన్లు, యాక్షన్ సీక్వెన్లుతో పాటు ఆయన పొలిటికల్ ఇమేజ్, మైలేజీతో నింపేశారు. అవన్నీ కావాలనే కథలో బలవంతంగా ఇరికించినట్లుగా అనిపిస్తాయి.
పొలిటికల్ డైలాగ్స్....
కులాలు, మతాలను అడ్డుపెట్టుకొని కొన్ని పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని, ప్రజలే ఓటు వేయడానికి ధైర్యంగా ముందుకొచ్చి సొసైటీలో మార్పును తీసుకురావాలంటూ డైలాగ్స్ చెప్పించారు. ఒకప్పుడు గ్యాంగ్‌స్టర్లు రౌడీలుగా ఉన్న వాళ్లే ఇప్పుడు పొలిటికల్ లీడర్లు అయ్యారంటూ, రెండు పార్టీలు ఒకదాని తర్వాత మరొకటి ఆధికారాలను చేపడుతూ తమిళనాడు ప్రజలను మోసం చేశాయంటూ చెప్పించారు. ఏకంగా విజయ్ టీవీకే పార్టీ పేరునే ఈ సినిమాలో అతడి క్యారెక్టర్ పేరుగా పెట్టారు. ఎన్నికల ముందు విజయ్ రాజకీయ జర్నీకి ప్లస్సయ్యేలా ఆ సీన్లు, డైలాగ్స్ ఉండేలా చూసుకున్నారు. కానీ ఎన్నికల తర్వాత సినిమా రావడంతో ఇప్పుడు ఆ సీన్లతో కనెక్ట్ కావడం కష్టమే.
ప్రెడిక్టబుల్....
విజయ్‌కి సినిమాలో బాషా రేంజ్ ఫ్లాష్‌బ్యాక్ ఉన్నట్లుగా సస్పెన్స్ మెయింటేన్ చేశారు. కానీ ఆ ఎపిసోడ్ పూర్తిగా తేలిపోయింది. రిమోట్ కంట్రోల్ గన్స్, ప్రతి ఒక్కరి చేతులో ఆయుధం ఉండేలా చేసి దేశాన్ని తన కంట్రోల్‌లో పెట్టుకోవాలని ప్రయత్నించడం....హీరోతో అతడికి ఓ గతం ఉందంటూ కథను లింక్ చేశారు. విలన్ పవర్‌ఫుల్ అన్నట్లుగా చూపించడానికి ఆరంభంలో వచ్చే రెండు యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టారు.అవన్నీ రొటీన్ వ్యవహారంలానే ఉంటాయి. హీరో కాబట్టి రోబోలతో ఫైట్ చేసినా గెలుస్తాడు అన్నట్లుగా చూపించి ప్రెడిక్టబుల్‌గా సినిమాను ఎండ్ చేశారు.
హీరోయిన్‌కు తక్కువ...
విజయ్‌ని ఫ్యాన్స్ ఎలా చూడాలని కోరుకుంటారో ఆ కమర్షియల్ హంగులన్నీ ఉండేలా డైరెక్టర్ జాగ్రత్తపడ్డారు. ఫైట్లు డ్యాన్స్‌లతో అదరగొట్టాడు. విజయ్‌పై వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటాయి. పూజా హెగ్డే హీరోయిన్‌కి తక్కువ....క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కు ఎక్కువ అన్నట్లుగా ఉంటుంది. శ్రీలీలతో కంపేర్ చేస్తే మమితా బైజు బాగానే చేసింది. బాబీడియోల్, ప్రకాష్ రాజ్ విలనిజం రొటీన్‌గా ఉంది. చివరలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లు నెల్సన్, అట్లీ, లోకేష్ కనగరాజ్ కనిపించే సీన్ బాగుంది. సాంకేతిక విభాగాల్లో బాగుంది అని చెప్పుకునేంతలా ఏదీ లేదు. అనిరుధ్ మ్యూజిక్ బిగ్గెస్ట్ మైనస్. దళపతి కచేరీ పాట మినిహా మిగిలిన పాటలేవి ఆకట్టుకోవు.
జననాయగన్ కష్టమే...
జననాయగన్... అడుగుడుగునా హీరోకు ఎలివేషన్లు ఇచ్చే క్యారెక్టర్లు...కండలు తిరిగిన బాడీ బిల్డర్ల సైతం కథానాయకుడి ఒక్క పంచ్‌తోనే నేలకొరిగిపోవడం, ఎన్ని ఎత్తులు వేసిన గెలవని విలన్లతో చాలా రొటీన్‌గా సాగింది. కేవలం విజయ్ ఇమేజ్‌ను మాత్రమే నమ్ముకొన్ని తీసిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించడం కష్టమే.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jonita Gandhi | మ్యూజిక్ డైరెక్టర్‌తో బ్రేకప్ – పుకార్లకు ఫొటోతో పుల్‌స్టాప్ పెట్టిన సింగర్
నవంబర్ 26, 2026

Rashmika Mandanna | బయోపిక్ కోసం సంగీత పాఠాలు – నేషనల్ క్రష్ డెడికేషన్ అట్లుంటది మరి!
నవంబర్ 24, 2026

Anirudh Kavya Maran Reception | అంగరంగ వైభవంగా అనిరుధ్, కావ్య మారన్ రిసెప్షన్
నవంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



