Vishnu Priya | యాంకర్ విష్ణుప్రియతో రెండో పెళ్లి – క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ సీనియర్ హీరో జేడీ చక్రవర్తిని యాంకర్ విష్ణుప్రియ పెళ్లి చేసుకోబోతున్నట్లు గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ పెళ్లి పుకార్లపై జేడీ చక్రవర్తి రియాక్ట్ అయ్యారు.
Entertainment | Published On Apr 27, 2026, 12.20 pm IST
Vishnu Priya | ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ వివాదం కారణంగా ఇటీవల వార్తల్లో నిలిచింది యాంకర్ విష్ణుప్రియ. సోషల్ మీడియాలో అసభ్యకర ఫొటోలు పోస్ట్ చేస్తుందంటూ ఆమెపై పోలీస్ కేసు నమోదు అయ్యింది. బోల్డ్ ఫొటోలు, వీడియోల ద్వారా డబ్బులు సంపాదిస్తుందంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ పోలీస్ కేసు, వివాదాలు విష్ణుప్రియకు ప్లస్ అయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె సబ్‌స్క్రైబర్లు రెట్టింపు అయ్యారు.
పెళ్లి రూమర్లు...
ఈ వివాదం సమసిపోకముందే విష్ణుప్రియ పెళ్లి అంటూ టాలీవుడ్‌లో కొత్త రూమర్లు మొదలయ్యాయి. టాలీవుడ్ సీనియర్ జేడీ చక్రవర్తితో విష్ణుప్రియ త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విష్ణుప్రియను ఈ టాలీవుడ్ హీరో రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని అంటున్నారు. జేడీ చక్రవర్తి అంటే తనకు ఇష్టమని ఓ టీవీ షోలో విష్ణుప్రియ చెప్పింది. జేడీ చక్రవర్తి ఇంట్లోవాళ్లు ఒప్పుకుంటే అతడిని పెళ్లి చేసుకుంటానని సరదాగా కామెంట్స్ చేసింది. అప్పటి నుంచే ఈ పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ పెళ్లి పుకార్లపై గాయపడ్డ సింహం ప్రమోషన్స్‌లో జేడీ చక్రవర్తి రియాక్ట్ అయ్యారు.
గురుశిష్యుల బంధం...
విష్ణుప్రియతో తనకు ఎఫైర్ ఉందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని జేడీ చక్రవర్తి అన్నారు. "విష్ణుప్రియను నేను స్టూడెంట్‌గానే భావిస్తా. తాను కూడా నన్ను గురువుగారు అని పిలుస్తుంది. మా ఇద్దరి మధ్య గురుశిష్యుల బంధం తప్ప మరోటి లేదు. పెళ్లి వార్తలన్నీ అబద్దమే. తనను కలిసే చాలా ఏళ్లు అవుతుంది. ఈ రూమర్లు ఎలా వచ్చాయో కూడా అర్థం కావడం లేదు" అని అంటూ పెళ్లి వార్తలకు జేడీ చక్రవర్తి పుల్‌స్టాప్ పెట్టారు.
గాయపడ్డ సింహం మూవీలో జేడీ చక్రవర్తి ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఈ మూవీ మే 1న రిలీజ్ కాబోతుంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



