Meghamsh Srihari | మిస్టరీ డెత్ కేసుతో శ్రీహరి కొడుకు మూవీ – ట్రెండింగ్‌లో ఆస్మాన్ టీజర్
శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటించిన ఆస్మాన్ టీజర్ ట్రెండింగ్ అవుతోంది. ఇరవై నాలుగు గంటల్లోనే రెండు మిలియన్లకుపైగా వ్యూస్‌ను దక్కించుకుంది. ఆస్మాన్ మూవీకిలో రాయంచ హీరోయిన్‌గా నటించింది. రామ్ నందన్ దర్శకత్వం వహించాడు.
Entertainment | Published On Sep 17, 2026, 6.54 pm IST
Meghamsh Srihari | దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీతో త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మేఘాంశ్ శ్రీహరి హీరోగా తెలుగులో ఆస్మాన్ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. రామ్ నందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాయంచ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఆస్మాన్ టీజర్...
మేఘాంశ్ పుట్టినరోజు సందర్భంగా ఆస్మాన్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఒక్క రోజులోనే రెండు మిలియన్లకుపైగా వ్యూస్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మర్డర్ మిస్టరీ, థ్రిల్లర్ అంశాలతో ఆస్మాన్ టీజర్ ఆసక్తికరంగా సాగింది. "మీరు ఇప్పుడు గొంగలి పురుగు దశలో ఉన్నారు.. అది దాటి సీతాకోక చిలుక దశలోకి మారాలి.. దానికి మార్గం నేనే.. మీరందరూ కూడా కనిపించే చీకట్లో ఉన్నారు.. అదే నిజం’ అంటూ టీజర్‌లోని డైలాగ్స్ ఉత్కంఠను రేకెత్తిస్తోన్నాయి. యాక్షన్ సన్నివేశాలతో మేఘాంశ్ ఆకట్టుకున్నారు.
శివాత్మిక గెస్ట్...
ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్‌కు మంచు మనోజ్‌తో పాటు హీరోయిన్ శివాత్మిక గెస్ట్‌లుగా హాజరయ్యారు. శ్రీహరి మమ్మల్ని ఎత్తుకుని పెంచారు. నేను మేఘాంశ్‌ని ఎత్తుకున్నాను. సినిమా ఉన్నంత కాలం రియల్ స్టార్ శ్రీహరి ఉంటారు. మేఘాంశ్‌ని నేను ఎలా చూడాలని అనుకున్నానో టీజర్‌లో అలా కనిపించాడు అని మంచు మనోజ్ అన్నారు. . మేఘాంశ్ స్కూల్‌లో నా సీనియర్ అని, ఈ సినిమాతో అతడికి హీరోగా పెద్ద హిట్టు దక్కాలని శివాత్మిక చెప్పింది.
బురారీ మర్డర్ కేసు...
టీజర్‌లోని సీన్స్, డైలాగ్స్ చూస్తుంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బురారీ మర్డర్ కేసు ఆధారంగా ఆస్మాన్ మూవీ రూపొందుతోన్నట్లు కనిపిస్తోంది. 2018లో ఢిల్లీలోని బురారీలో ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. మూఢనమ్మకాలతోనే వారంతా కళ్లకు గంతలు, చేతులు వెనక్కి కట్టుకొని చనిపోయారు. ఆ ఘటనను పోలి ఆస్మాన్ టీజర్‌లో కొన్ని సన్నివేశాలు కనిపిస్తున్నాయి. మేకర్స్ మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వలేదు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Payal Rajput | బోల్డ్ ఫొటోలతో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ రచ్చ – అవకాశాల కోసమేనా?
సెప్టెంబర్ 17, 2026

Ranabaali | రణబాలి షూటింగ్ కంప్లీట్ -పెళ్లి ఫొటోతో విరోష్ జోడీ సర్ప్రైజ్
సెప్టెంబర్ 17, 2026

Sobhita Dhulipala | పదహారేళ్లకే ఇళ్లు వదిలిపెట్టి వెళ్లిపోయా – టాలీవుడ్‌పై శోభిత ధూళిపాళ కామెంట్స్ వైరల్
సెప్టెంబర్ 17, 2026
తాజావార్తలు
- ●Vaishnavi's Husband Murdered | యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య.. కత్తితో నరికి చంపిన దుండగులు
- ●Section 22A Land Issues Telangana | రెవెన్యూ వ్యవస్థపై సీఎం రేవంత్ ప్రసంగం చరిత్రాత్మకం
- ●TG Police Jobs | తెలంగాణ పోలీస్ ఉద్యోగాల రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్..!
- ●Gajjela Kantham | వందల ఎకరాలే ఉంటే నువ్వు, నీ చెల్లె అమెరికా పోయేటోళ్లా?
- ●Errabelli Dayakar Rao | అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి అబద్ధాలకు తెరలేపిండు : ఎర్రబెల్లి దయాకర్‌రావు
- ●Malka Komaraiah - AVN Reddy | ప్రమోషన్లు ఎప్పుడిస్తారు? స్కూల్ అసిస్టెంట్లకు న్యాయం చేయండి

Vaishnavi's Husband Murdered | యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య.. కత్తితో నరికి చంపిన దుండగులు

Section 22A Land Issues Telangana | రెవెన్యూ వ్యవస్థపై సీఎం రేవంత్ ప్రసంగం చరిత్రాత్మకం

TG Police Jobs | తెలంగాణ పోలీస్ ఉద్యోగాల రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్..!

Gajjela Kantham | వందల ఎకరాలే ఉంటే నువ్వు, నీ చెల్లె అమెరికా పోయేటోళ్లా?



