త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Peddi Sudarshan Reddy | పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుద‌ల‌.. య‌శోదా వైద్యులు ఏమ‌న్నారంటే..?

Peddi Sudarshan Reddy | తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి( Peddi Sudarshan Reddy )కి సికింద్రాబాద్ య‌శోదా ఆస్ప‌త్రి( Yashoda Hospital )లో వెంటిలేట‌ర్‌పై చికిత్స కొన‌సాగుతోంది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం య‌శోదా ఆస్ప‌త్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుద‌ల చేశారు.

S

Telangana | Published On Jul 28, 2026, 7.17 pm IST

Peddi Sudarshan Reddy | పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుద‌ల‌.. య‌శోదా వైద్యులు ఏమ‌న్నారంటే..?
Advertisement

వెంటిలేట‌ర్‌పై కొన‌సాగుతున్న చికిత్స‌
45 నిమిషాల పాటు ఆగిన గుండె
దాంతో తీవ్రంగా దెబ్బ‌తిన్న నాడీ వ్య‌వ‌స్థ‌
మ‌రోసారి న్యూరో అసెస్‌మెంట్
వెల్ల‌డించిన య‌శోదా ఆస్ప‌త్రి వైద్యులు

Peddi Sudarshan Reddy | త్రినేత్ర‌.న్యూస్ : తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి( Peddi Sudarshan Reddy )కి సికింద్రాబాద్ య‌శోదా ఆస్ప‌త్రి( Yashoda Hospital )లో వెంటిలేట‌ర్‌పై చికిత్స కొన‌సాగుతోంది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం య‌శోదా ఆస్ప‌త్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు అడ్వాన్స్‌డ్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నామ‌ని తెలిపారు.

45 నిమిషాల పాటు ఆగిన గుండె స్పందన

పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి ఊపిరితిత్తుల్లో ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌డంతో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై కుప్ప‌కూలిపోయారు. దాంతో బీపీ ప‌డిపోయి, హార్ట్ ఎటాక్‌కు గుర‌య్యారు. వ‌రంగ‌ల్ రోహిణి ఆస్ప‌త్రి వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేయ‌గా, ఆయ‌న‌లో క‌దిలిక వ‌చ్చింది. ప్రాథ‌మిక చికిత్స అనంత‌రం.. మెరుగైన వైద్యం కోసం య‌శోదా ఆస్ప‌త్రికి తీసుకొచ్చారని వైద్యులు పేర్కొన్నారు.

నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం

ప్ర‌స్తుతం య‌శోదాలో పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డికి క్రిటికల్ కేర్, పల్మనాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ విభాగాలకు చెందిన నిపుణుల బృందం చికిత్స అందిస్తోంది. 45 నిమిషాల పాటు గుండె ఆగిపోవడం వల్ల నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారు. ఆయ‌న మెద‌డుకు ఆక్సిజ‌న్ అంద‌డం లేద‌ని ఈఈజీ (EEG), ఎంఆర్‌ఐ (MRI), టీసీడీ (TCD) పరీక్షల్లో తేలింది. దీంతో కొంత న‌ష్టం జరిగినట్లు గుర్తించారు. శబ్దాలకు, స్పర్శకు ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వడం లేదని వైద్యులు పేర్కొన్నారు. బుధ‌వారం ఉద‌యం 72 గంటల న్యూరో అసెస్‌మెంట్ నిర్వహించి మెదడు పనితీరును మరోసారి అంచనా వేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని ఆసుపత్రి యాజమాన్యం స్పష్టం చేసింది.

Advertisement
Advertisement