త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RTC Employees save a girl | 10 రూపాయ‌ల నోటుతో బ‌స్సెక్కిన బాలిక‌.. క‌ద‌లిక‌లు చూసి కాపాడిన డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్‌

RTC Employees save a girl | ఎక్క‌డేం జ‌రిగినా మ‌న‌కెందుకులే అనే భావ‌న చాలా మందిలో క‌నిపిస్తుంటుంది. అదే అడ‌గ‌కుండానే చొర‌వ తీసుకుని చేయందించేవాళ్లు అరుదుగానే ఉంటారు. అదే కోవ‌కు చెందుతారు ఈ ఆర్టీసీ సిబ్బంది జేఎస్ కుమార్‌, శేఖ‌ర్‌.

S

Telangana | Published On Jul 28, 2026, 7.05 pm IST

RTC Employees save a girl | 10 రూపాయ‌ల నోటుతో బ‌స్సెక్కిన బాలిక‌.. క‌ద‌లిక‌లు చూసి కాపాడిన డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్‌
Advertisement

RTC Employees save girl | త్రినేత్ర‌.న్యూస్: నోరు తెరిచి సాయ‌మ‌డిగినా చేయ‌ని రోజులివి. ఎక్క‌డేం జ‌రిగినా మ‌న‌కెందుకులే అనే భావ‌న చాలా మందిలో క‌నిపిస్తుంటుంది. అదే అడ‌గ‌కుండానే చొర‌వ తీసుకుని చేయందించేవాళ్లు అరుదుగానే ఉంటారు. అదే కోవ‌కు చెందుతారు ఈ ఆర్టీసీ సిబ్బంది జేఎస్ కుమార్‌, శేఖ‌ర్‌. 10 రూపాయ‌ల నోటుతో బ‌స్సెక్కిన ఓ బాలిక దీన స్థితిని గ‌మ‌నించి ఆమెను కాపాడి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..

ఓ విద్యార్థిని అనూహ్యంగా పటాన్ చెరువు వద్ద మిధాని డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సు (నెం.218) ఎక్కింది. చేతిలో పది రూపాయల నోటు తప్ప ఆ బాలిక వద్ద ఏమి లేవు. కాళ్లకు చెప్పులు కూడా వేసుకోలేదు. కండక్టర్ టికెట్ అడిగినప్పుడు ఆమె క‌ళ్ల‌ల్లో ఏదో తెలియ‌ని అమాయ‌క‌త్వం క‌నిపించింది. ఇది గ‌మ‌నించిన కండ‌క్ట‌ర్‌కు అనుమానం వచ్చి విషయన్ని డ్రైవర్‌కు చెప్పాడు. బ‌స్సు వెళ్తున్న స‌మ‌యంలోనూ ఇద్దరూ ఆ అమ్మాయిని కనిపెడుతూనే ఉన్నారు.

ఉన్న‌ట్టుండి ఆ బాలిక త‌న‌ పక్కన ఉన్న ఓ ప్యాసింజర్ వద్ద ఫోన్ తీసుకొని ఎవరితోనో మాట్లాడింది. ఇదే విష‌యాన్ని కొంద‌రి ప్ర‌యాణికులకు చెప్ప‌డంతో ఆ అమ్మాయి క‌దులుతున్న‌ బ‌స్సు వెన‌క డోర్ నుంచి దిగేందుకు ప్ర‌య‌త్నించింది. కొంద‌రు అడ్డ‌గించి స‌ముదాయించారు. కండ‌క్ట‌ర్ శేఖ‌ర్‌, డ్రైవ‌ర్ జేఎస్ కుమార్ క‌లుగ‌జేసుకొని స‌ద‌రు బాలిక‌ను సైఫాబాద్ పోలీస్‌స్టేష‌న్‌లో అప్ప‌గించారు. ఆమె మాట్లాడిన ఫోన్ నెంబ‌ర్ ఆధారంగా పటాన్ చెరువులోని తెలంగాణ మైనారిటీ గురుకులం విద్యార్థినిగా గుర్తించారు. త‌ల్లిదండ్రుల‌కు, ఉపాధ్యాయుల‌కు స‌మాచారం అందించి బాలిక‌ను గురుకులంలో అప్ప‌గించ‌నున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

కాగా ఈ మొత్తం ఉదంతంలో ఆర్టీసీ అన్నలు చూపిన చొరవను ప‌లువురు కొనియాడారు. మాన‌వ‌త్వ‌మే మ‌నిషికి అస‌లైన గుర్తింపు అని ప్ర‌శంస‌లు కురిపించారు.

Advertisement
Advertisement