Shivani Rajashekar | స్టార్ హీరో కొడుకుతో రాజశేఖర్ కూతురు రొమాన్స్ – నాలుగేళ్ల తర్వాత కోలీవుడ్‌లో ఛాన్స్
రాజశేఖర్, జీవితల తనయ శివానీ నాలుగేళ్ల తర్వాత హీరోయిన్‌గా తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. విజయ్ కాంత్ కొడుకుకు జోడీగా ఓ సినిమా చేస్తోంది. వానవేదికపై పేరుతో రొమాంటిక్ యాక్షన్ లవ్‌స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
Shivani Rajashekar | అచ్చ తెలుగు అమ్మాయిలు కోలీవుడ్‌లో హీరోయిన్లుగా అదరగొడుతోన్నారు. ఐశ్వర్య రాజేష్, సాన్వీ మేఘన, కయల్ ఆనంది పలు సినిమాలతో తమిళ ప్రేక్షకులను మెప్పించారు. వీరి బాటలోనే శివానీ నగరం, వైష్ణవి చైతన్య అడుగులు వేయబోతున్నారు. ఈ ఏడాది కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రాజశేఖర్, జీవితల తనయ శివాజీ కూడా మాతృభాష తెలుగు కంటే తమిళంపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతోంది.
తెలుగులో...
తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన అద్భుతం సినిమాతో శివానీ రాజశేఖర్ హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత తెలుగులో జిలేబీ, కోటబొమ్మాలి పీఎస్‌తో పాటు విద్యావాసుల అహం అనే సినిమాలు చేసింది. ఈ సినిమాలు శివానీకి మంచి పేరు తెచ్చిపెట్టిన సక్సెస్ మాత్రం రాలేదు. 2022లో వచ్చిన అన్భరివు సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నెంజుకు నీది అనే సినిమా చేసింది. ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్‌ను తెచ్చుకోవడమే కాకుండా శివానీకి హీరోయిన్‌గా మంచి పేరు తీసుకొచ్చాయి.
కోలీవుడ్‌లోకి రీఎంట్రీ...
నాలుగేళ్ల తర్వాత శివానీ కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. స్టార్ హీరో కొడుకుతో రొమాన్స్ చేయబోతుంది. దివంగత తమిళ అగ్ర హీరో విజయ్ కాంత్ తనయుడు షణ్ముగ పాండియన్ హీరోగా తమిళంలో వానవేదికపై పేరుతో ఓ రొమాంటిక్ యాక్షన్ డ్రామా మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శివానీ నటించబోతున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ తమిళ మూవీలో శివానీ పల్లెటూరి అమ్మాయిగా డీ గ్లామర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. రా అండ్ రస్టిక్‌గా ఆమె క్యారెక్టర్ సాగుతుందని అంటున్నారు.
వానవేదికై సినిమాకు తిరు దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో గోపీచంద్‌తో చాణక్య అనే సినిమా చేశాడు తిరు. తమిళంలో నాన్ సింగప్పు మణితాన్, మిస్టర్ చంద్రమౌళితో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు.
Welcome on board #shivani_rajashekar#Vaanavedikai
Starring @ShanmugaPandian
Directed by @dir_thiru
Produced by @lksudhish MPA @SamcsMusic Musical 🎸#CaptainCineCreations @captaincine2025
@mailavvi @rajkamal.art @jiva_karunya95@MpAnand_Pro pic.twitter.com/9eVBnJLpem— Captain MP Anand (@MpAnand_PRO) July 24, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tamannaah | హీరోయిన్లను గ్లామర్ డాల్స్‌లా చూస్తారు – సౌత్ ఇండస్ట్రీపై తమన్నా కామెంట్లు
జులై 25, 2026

Dhruv Vikram | అనుపమ పరమేశ్వరన్ సినిమా నుంచి తప్పుకున్న ధృవ్ విక్రమ్ – ఛాంబర్లో కంప్లైంట్
జులై 24, 2026

Naga Durga | ఓటీటీలోకి నాగదుర్గ తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ – ప్రియురాలి కోసం అప్పులపాలైన ప్రేమికుడి కథ
జులై 24, 2026
తాజావార్తలు
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!



