త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

International Tiger Day | దేశంలో పులులు 3,682

International Tiger Day | అడవుల మనుగడ, జీవవైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అత్యంత కీలకమైనదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పులుల సంరక్షణపై అవగాహన కలిగించేందుకు ప్రతి ఏడాది జూలై 29న “అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని” నిర్వహించుకుంటున్నామని మంత్రి సురేఖ అన్నారు.

S

Telangana | Published On Jul 28, 2026, 6.35 pm IST

International Tiger Day | దేశంలో పులులు 3,682
Advertisement
  • రేపు అంత‌ర్జాతీయ పులుల దినోత్స‌వం

International Tiger Day | త్రినేత్ర‌.న్యూస్ : అడవుల మనుగడ, జీవవైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అత్యంత కీలకమైనదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పులుల సంరక్షణపై అవగాహన కలిగించేందుకు ప్రతి ఏడాది జూలై 29న “అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని” నిర్వహించుకుంటున్నామని మంత్రి సురేఖ అన్నారు. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2022 ప్రకారం దేశంలో 3,682 పులులున్నాయని, ప్రపంచంలోని పులుల్లో దాదాపు 75 శాతం భారతదేశంలోనే వుండటం మనకు గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. ఈ సత్ఫలితానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వన్యప్రాణి సంరక్షణ చట్టం (1972), ప్రాజెక్ట్ టైగర్ (1973) తో పాటు పులుల సంరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సంరక్షణ చర్యలకు, అటవీ సిబ్బంది అంకితభావానికి, ప్రజల సహకారానికి నిదర్శనమని మంత్రి సురేఖ పేర్కొన్నారు.

సుస్థిర అభివృద్ధికి పర్యావరణ పరిరక్షణే పునాదిగా నిలుస్తుందని, తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి అన్నారు. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ సహకారంతో రాష్ట్రంలోని కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ల‌లో పులుల సంరక్షణ, వాటి సహజ ఆవాసాల పరిరక్షణ, అక్రమ వేట నిరోధక చర్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షణ, అటవీ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు, మానవ, వన్యప్రాణుల ఘర్షణ నివారణకు తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా కార్యాచరణను అమలు చేస్తున్నదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

మహారాష్ట్ర నుంచి పులులను దశలవారీగా తీసుకువచ్చి, వాటి ఆవాసాలను తీర్చిదిద్దుతూ పులుల సంఖ్యను మరింతగా పెంచేందుకు కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో ‘Tiger Reintroduction’ (టైగర్ రీఇంట్రడక్షన్) కార్యాచరణకు జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. దీంతో రాష్ట్రంలో పులుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జీవవైవిధ్య పరిరక్షణలో ప్రభుత్వానికి కార్యాచరణకు తోడు, స్థానిక ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, అటవీ ప్రాంతాల అభివృద్ధి ప్రజల సహకారంతోనే మరింత ఫలప్రదమవుతుందని మంత్రి సురేఖ ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement