త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jason Sanjay | నేను ల‌వ్ ఫెయిల్యూర్‌నే – బ్రేక‌ప్‌పై ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు కామెంట్స్‌

త‌న ల‌వ్ బ్రేక‌ప్ స్టోరీపై త‌మిళ‌నాడు సీఎం త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశాడు. కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమించిన‌ట్లు చెప్పాడు. మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా ఏడాదిన్న‌ర త‌ర్వాత ఇద్ద‌రం బ్రేక‌ప్ చెప్పుకున్నామ‌ని అన్నాడు. ఆ బ్రేక‌ప్ బాధ నుంచి కోలుకోవ‌డం చాలా క‌ష్ట‌మైంద‌ని జాస‌న్ సంజ‌య్ అన్నాడు.

N

Entertainment | Published On Oct 6, 2026, 7.58 pm IST

Jason Sanjay | నేను ల‌వ్ ఫెయిల్యూర్‌నే – బ్రేక‌ప్‌పై ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు కామెంట్స్‌
Advertisement

Jason Sanjay |  త‌మిళ‌నాడు సీఎం ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ సిగ్మా మూవీతో ద‌ర్శ‌కుడిగా మారాడు. ఇటీవ‌లే తెలుగుతో పాటు త‌మిళ భాష‌ల్లో ఈ సినిమా రిలీజైంది. సందీప్ కిష‌న్ హీరోగా న‌టించిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. జాస‌న్ సంజ‌య్ క‌థ‌, స్క్రీన్‌ప్లేతో పాటు టేకింగ్‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నెగెటివ్ టాక్‌తో సంబంధం లేకుండా త‌మిళ వెర్ష‌న్ మంచి వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. సిగ్మా ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్న జాస‌న్ సంజ‌య్ త‌న ల‌వ్ బ్రేక‌ప్ స్టోరీపై ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశాడు. తాను ల‌వ్ ఫెయిల్యూర్‌నేన‌ని చెప్పాడు.

న‌మ్మ‌కంలేని బంధం...

"కాలేజీలో చ‌దువుకునే రోజుల్లో ఓ అమ్మాయితో ప్రేమ‌లో ప‌డ్డాను. ఏడాదిన్న‌ర పాటు ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా మా రిలేష‌న్ సాఫీగా సాగింది. ఆ త‌ర్వాతే మ‌న‌స్ప‌ర్థ‌లు మొద‌ల‌య్యాయి. న‌మ్మ‌కంలేని బంధాన్ని కొన‌సాగించ‌డం కంటే విడిపోవ‌డ‌మే మంచిద‌ని నిర్ణ‌యించుకున్నాం. ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే బ్రేక‌ప్ చెప్పుకున్నాం" అని అన్నాడు.

బ్రేక‌ప్ సాంగ్స్‌...

విఫ‌ల ప్రేమ తాలూకు బాధ నుంచి కోలుకోవ‌డం అంత ఈజీ కాద‌ని జాస‌న్ సంజ‌య్ అన్నారు." ఆ టైమ్‌లో సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటూ ఎక్కువ టైమ్ బ్రేక‌ప్ సాంగ్స్ వింటూ గ‌డిపేవాణ్ణి. ల‌వ్‌లో ఫెయిలైన త‌ర్వాతే ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేయ‌డానికి విదేశాల‌కు వెళ్లిపోయా. సినిమాల‌పై సీరియ‌స్‌గా దృష్టిసారిస్తూ ల‌వ్ ఫెయిల్యూర్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డాను" అని జాస‌న్ సంజ‌య్ చెప్పారు. ఆ అమ్మాయి ఎవ‌ర‌న్న‌ది మాత్రం రివీల్ చేయ‌లేదు. అత‌డి కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి. జాస‌న్ సంజ‌య్ 2018 నుండి 2020 వరకు కెనడాలోని టొరంటో ఫిల్మ్ స్కూల్‌‌లో... ఆ తర్వాత 2020 నుండి 2022 వరకు లండన్‌లోని సెంట్రల్ ఫిల్మ్ స్కూల్‌లో ఫిల్మ్ మేకింగ్ కోర్సులు పూర్తి చేశారు. ఆ అనుభ‌వంతోనే సిగ్మా మూవీని తెర‌కెక్కించారు.

 

 

Advertisement
Advertisement