Mega Family | జనవరి 31…మెగా ఫ్యామిలీకి మెమోరబుల్ డే కానుందా?
జనవరి 31న మెగా ఫ్యామిలీ నుంచి గుడ్‌న్యూస్ రాబోతున్నట్లు సమాచారం. రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఆ రోజు కవలలకు జన్మనివ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Entertainment | Published On Jan 27, 2026, 8.18 pm IST
Mega Family | జనవరి 31న మెగా ఫ్యామిలీ నుంచి ఓ గుడ్‌న్యూస్ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మెమోరబుల్ డేగా మెగా ఫ్యామిలీకి ఈ రోజు నిలవబోతున్నట్లు సమాచారం. రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల రెండో సారి తల్లి కాబోతున్నట్లు గత ఏడాది దీపావళికి మెగా ఫ్యామిలీ ప్రకటించింది. ఆమె సీమంతం వేడుక తాలూకు వీడియోను అభిమానులతో పంచుకుంది. రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు ట్విన్స్ పుట్టబోతున్నట్లు వార్తలువినిపిస్తున్నాయి.
మెగా వారసులు...
ఉపాసన డెలివరీ డేట్‌ను డాక్టర్లు నిర్ణయించినట్లు సమాచారం. జనవరి 31న కవలలకు ఉపాసన జన్మనివ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మెగా ఫ్యామిలీ ఇంట ఒకే రోజు ఇద్దరు వారసులు అడుగుపెట్టనున్నట్లు చెబుతోన్నారు. డెలివరీ డేట్‌కు సంబంధించి మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం అఫీషియల్ అప్‌డేట్ రాలేదు. రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు మొతటి సంతానంగా 2023లో కూతురు క్లిన్‌కారా జన్మించింది. ఉపాసన డెలివరీ డేట్ దగ్గరపడటంతో పెద్ది సినిమా షూటింగ్‌కు రామ్‌చరణ్ బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం.
మార్చిలో అనుకున్నారు...
పెద్ది సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ అగ్ర నటుడు శివరాజ్‌కుమార్‌తో పాటు జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా మార్చి 27న పెద్ది సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. షూటింగ్ డిలే కారణంగా ఈ సినిమా వాయిదాపడినట్లు ప్రచారం జరుగుతోంది. మార్చిలో కాకుండా మే నెలలో ఈ మూవీ విడుదల కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పెద్ది తర్వాత సుకుమార్‌తో రామ్‌చరణ్ సినిమా చేయబోతున్నాడు.
సంబంధిత వార్తలు

Ram Charan | బుచ్చిబాబు ఇచ్చిన గిఫ్ట్ – చేతి గాయంపై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మే 18, 2026

Chiranjeevi | ముగ్గురు కలిసి రఫ్ఫాడించేశారు – పెద్ది ట్రైలర్‌పై మెగాస్టార్ రివ్యూ – డైలాగ్ లీక్
మే 16, 2026

Janhvi Kapoor | చెల్లిని రిజెక్ట్ చేసి అక్కకు ఛాన్స్ – పెద్ది హీరోయిన్ సెలెక్షన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా!
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



