త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | చంపుతామంటూ బెదిరింపులు – శేఖ‌ర్ మాస్ట‌ర్‌పై జానీ మాస్ట‌ర్ భార్య కంప్లైంట్‌

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌క‌పోతే త‌న‌ను చంపేస్తామంటూ కొంద‌రు బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని జానీ మాస్ట‌ర్ భార్య సుమ‌ల‌త దేవి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశంలో త‌న‌పై శేఖ‌ర్, ర‌ఘు మాస్ట‌ర్ అనుచులు త‌న‌పై దాడి చేశార‌ని కంప్లైంట్‌లో పేర్కొన్న‌ది.

N

Entertainment | Published On Sep 24, 2026, 5.34 pm IST

Tollywood | చంపుతామంటూ బెదిరింపులు – శేఖ‌ర్ మాస్ట‌ర్‌పై జానీ మాస్ట‌ర్ భార్య కంప్లైంట్‌
Advertisement

Tollywood |  టాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్స్ శేఖ‌ర్‌, ర‌ఘు మాస్ట‌ర్‌ల‌పై జానీ మాస్ట‌ర్ భార్య సుమ‌ల‌త దేవి పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చారు. చంపుతానంటూ కొంద‌రు బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని, త‌న‌తో పాటు త‌న కుటుంబ‌స‌భ్యుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఈ ఫిర్యాదులో పేర్కొన్న‌ది.తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) గ‌త కొద్ది రోజులుగా గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఈ అసోసియేష‌న్‌కు సుమ‌ల‌త దేవి ప్రెసిడెంట్‌గా కొన‌సాగుతోన్నారు. ఆమెపై అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తూ ఇటీవ‌లే కొంద‌రు స‌భ్యులు త‌మ ప‌ద‌వీకి రాజీనామా చేశారు. అవినీతిని ప్ర‌శ్నించినందుకే వారు రాజీనామా చేశారంటూ సుమ‌ల‌త దేవి ఆరోపించారు. సుమ‌ల‌త దేవితో పాటు ఆమె కార్య‌వ‌ర్గాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఇటీవ‌ల‌ తెలుగు ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ప్ర‌క‌టించింది.

జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశం...

ఈ నేప‌థ్యంలో తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో ఇందిరాన‌గ‌ర్‌లోని రాఘ‌వ గెస్ట్ హౌజ్‌లో జ‌రిగింది. తోపులాట, కేకలు, ఆరోప‌ణ‌ల కార‌ణంగా ఈ స‌మావేశంలో ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్నాయి. కొందరు వ్యక్తులు భౌతిక దాడికి పాల్పడ్డారని, తనను చంపుతామని బెదిరించారని ఆరోపిస్తూ సుమ‌ల‌త దేవి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.సమావేశాన్ని అడ్డుకోవడంతో పాటు అసోసియేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన రికార్డులను అక్రమంగా తీసుకెళ్లేందుకు కొందరు ముందస్తు ప్రణాళికతో త‌న‌పై దాడుల‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోపించింది.

రికార్డులు తీసుకెళ్లేందుకు యత్నం

మినిట్స్ బుక్, అజెండా పత్రాలు, ఇతర ముఖ్యమైన అసోసియేషన్ రికార్డులను కొందరు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా తాను అడ్డుకున్నానని ఆమె తెలిపారు. ఈ క్రమంలో కొందరు మహిళలు, ఇతర వ్యక్తులు తనను చుట్టుముట్టి దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతో పాటు అడ్డుకునేందుకు ప్రయత్నించిన అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు ఎం. రాములు, సమిలి అనే మహిళపై కూడా దాడి చేసి గాయపరిచినట్లు చెప్పారు.

ఆరోప‌ణ‌లు...

రఘు మాస్టర్ తరఫున ఉన్న కొందరు లేడీ డ్యాన్సర్లు తనపై పథకం ప్రకారమే మూకుమ్మడిగా దాడి చేశారని, తనను తీవ్రంగా కొట్టి అసభ్య పదజాలంతో దూషించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సుమ‌ల‌త‌దేవి పేర్కొన్నారు. శేఖర్ , రఘు , భాను మాస్ట‌ర్‌తో పాటు మ‌రికొంద‌రు మ‌రో అసోసియేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తూ ప్రస్తుత అసోసియేషన్‌లో విభేదాలు సృష్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ పరిణామాల వెనుక ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని ప్రోత్సాహం, పాత్ర ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తూ, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.

పదవికి రాజీనామా

తాను అధ్యక్ష పదవికి రాజీనామా చేయకపోతే చంపేస్తామని కొందరు తీవ్రంగా బెదిరించినట్లు సుమలతా దేవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.

 

Advertisement
Advertisement