Tanneru Venkatesham | రైతు భరోసా ఇచ్చారు.. మరి నీళ్లు ఇవ్వకుంటే ఏం లాభం..? : తన్నీరు వెంకటేశం
Tanneru Venkatesham | రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ రైతులకు రైతు భరోసా వేసింది ప్రభుత్వం.. మరి నీళ్లు ఇవ్వకుంటే ఏం లాభం అని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ తన్నీరు వెంకటేశం ప్రశ్నించారు.
Tanneru Venkatesham | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ రైతులకు రైతు భరోసా వేసింది ప్రభుత్వం.. మరి నీళ్లు ఇవ్వకుంటే ఏం లాభం అని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ తన్నీరు వెంకటేశం ప్రశ్నించారు. కన్నెపల్లి పంపు నుంచి నీళ్లు ఎత్తిపోయకపోవడంపై ఆయన తీవ్రంగా స్పందించారు.
ఇంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రభుత్వం రైతుబంధు వేసింది. దేనికి అది. రైతులు నాట్లు వేసుకోవడానికి, పొలాలు చేసుకోవడానికే కదా.. మరి ఏం లాభం. ఈ నీళ్లు నల్లగొండ జిల్లాలోని హుజుర్ నగర్ నియోజకవర్గం వరకు ఉపయోగపడుతాయి. లింక్ ఉన్నది.. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్‌కు నీళ్లు వస్తాయి.. మల్లన్న సాగర్ గుండెకాయ లాంటిది. కరువు వచ్చినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగపడుతది. దిస్ ఈజ్ లింక్ వన్. ఫుల్ వరదలు వచ్చినప్పుడు అది లింక్ త్రీ డైరెక్ట్‌గా మిడ్ మానేరు. లింక్ వన్, లింక్ టు నడపాల్సిన అవసరమే లేదు. ఒకవేళ సింపుల్‌గా ఎస్సారెస్పీ నుంచి వరద వచ్చిందనుకోండి.. సర్‌ప్లస్ అయిందనుకోండి.. లింక్ వన్, లింక్ టు నడపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లింక్ టు, లింక్ త్రీ ప్రాబ్లం ఉంది కాబట్టి లింక్ వన్ నడపాలి అది మేం ఇంజినీర్లుగా కోరుతున్నాం. బేషజాలకు పోకుండా ప్రజల కోసం, రైతుల కోసం నీళ్లు ఇవ్వాలి అని వెంకటేశం కోరారు.
నీళ్లు ఇస్తే కూడా హ్యాట్సాఫ్
బేషజాలకు పోకుండా ముఖ్యమంత్రి సమస్యను పరిష్కారిస్తాడన్న నమ్మకం ఉంది. కాకపోతే ప్రజలు స్పందిస్తారు.. ఏ విధంగానైనా ముఖ్యమంత్రినే బాధ్యత వహించాల్సి వస్తది. రైతులు ఏమైనా చేయగలరు. కాబట్టి వాళ్ల యొక్క ఆకలి బాధ, కన్నీళ్ల బాధ ఉండొద్దని ఇవన్నీ మనం చేసేది. ఇంజినీర్లుగా, ఉద్యమకారులుగా బాధతో చెబుతున్నాం. మేం ఏ పార్టీకి మద్దతు కాదు. మా ఇంట్రెస్ట్ ప్రజలు, రైతులు. మా ఇంట్రెస్ట్ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం. అందులో సందేహం లేదు. ఒక వేళ ఏదైనా ఉంటే కచ్చితంగా విమర్శిస్తాం. మంచి పని చేస్తే కచ్చితంగా మద్దతు ఇస్తాం. రైతుబంధు ఇచ్చినందుకు ప్రభుత్వానికి హ్యాట్సాఫ్. నీళ్లు ఇస్తే కూడా హ్యాట్సాఫ్ అని ఆయన పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

KTR | అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య మనువడికి కేటీఆర్ ప్రత్యేక లాకెట్ బహుకరణ
జులై 13, 2026

CM Revanth Reddy Delhi Tour | రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఆ లిస్ట్ రెడీ అయినట్టేనా?
జులై 13, 2026

Tanneru Venkatesham | నీళ్లను ఒడిసి పట్టండి.. తాగునీటికే 40 టీఎంసీలు అవసరం : తన్నీరు వెంకటేశం
జులై 13, 2026
తాజావార్తలు
- ●KTR | అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య మనువడికి కేటీఆర్ ప్రత్యేక లాకెట్ బహుకరణ
- ●CM Revanth Reddy Delhi Tour | రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఆ లిస్ట్ రెడీ అయినట్టేనా?
- ●Bhagyashri Borse | సమంత మా అందరికి ఓ దారి చూపించింది - భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్...
- ●Tanneru Venkatesham | నీళ్లను ఒడిసి పట్టండి.. తాగునీటికే 40 టీఎంసీలు అవసరం : తన్నీరు వెంకటేశం
- ●Revanth Reddy | చంద్రబాబుకు రేవంత్ 'గురుదక్షిణ'.. సుప్రీంకోర్టులో బట్టబయలైన కుట్ర
- ●OU 85th Convocation | స్నాతకోత్సవం ఒక్క వేడుకే కాదు.. విద్యార్థుల విజయాల ఉత్సవం కూడా

KTR | అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య మనువడికి కేటీఆర్ ప్రత్యేక లాకెట్ బహుకరణ

CM Revanth Reddy Delhi Tour | రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఆ లిస్ట్ రెడీ అయినట్టేనా?

Bhagyashri Borse | సమంత మా అందరికి ఓ దారి చూపించింది - భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్...

Tanneru Venkatesham | నీళ్లను ఒడిసి పట్టండి.. తాగునీటికే 40 టీఎంసీలు అవసరం : తన్నీరు వెంకటేశం



