త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tanneru Venkatesham | నీళ్ల‌ను ఒడిసి ప‌ట్టండి.. తాగునీటికే 40 టీఎంసీలు అవ‌స‌రం : త‌న్నీరు వెంక‌టేశం

Tanneru Venkatesham | తెలంగాణ‌లో ఇప్ప‌టికే.. మ‌రి ముఖ్యంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో తాగునీటి స‌మ‌స్య ఉంది.. ఈ స‌మ‌స్య‌ను నివారించాలంటే గోదావ‌రి జ‌లాల‌ను ఒడిసి ప‌ట్టాల‌ని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల అసోసియేష‌న్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ త‌న్నీరు వెంక‌టేశం సూచించారు. తాగునీటి అవ‌స‌రాల‌కే 40 టీఎంసీల నీరు అవ‌స‌రం ప‌డుతుంద‌ని, ఈ స‌మ‌స్య‌ను దృష్టిలో ఉంచుకోవాల‌ని ప్ర‌భుత్వానికి సూచ‌న చేశారు.

S

Telangana | Published On Jul 13, 2026, 7.26 pm IST

Tanneru Venkatesham | నీళ్ల‌ను ఒడిసి ప‌ట్టండి.. తాగునీటికే 40 టీఎంసీలు అవ‌స‌రం : త‌న్నీరు వెంక‌టేశం
Advertisement

Tanneru Venkatesham | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌లో ఇప్ప‌టికే.. మ‌రి ముఖ్యంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో తాగునీటి స‌మ‌స్య ఉంది.. ఈ స‌మ‌స్య‌ను నివారించాలంటే గోదావ‌రి జ‌లాల‌ను ఒడిసి ప‌ట్టాల‌ని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల అసోసియేష‌న్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ త‌న్నీరు వెంక‌టేశం సూచించారు. తాగునీటి అవ‌స‌రాల‌కే 40 టీఎంసీల నీరు అవ‌స‌రం ప‌డుతుంద‌ని, ఈ స‌మ‌స్య‌ను దృష్టిలో ఉంచుకోవాల‌ని ప్ర‌భుత్వానికి సూచ‌న చేశారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై ప్ర‌భుత్వం చేసిన వ్యాఖ్య‌ల‌పై త‌న్నీరు వెంక‌టేశం తీవ్రంగా స్పందించారు.

మ‌న‌కు ముఖ్యంగా డ్రింకింగ్ వాట‌ర్ ప్రాబ్లం. ఎల్లంప‌ల్లి నుంచి హైద‌రాబాద్‌కు డ్రింకింగ్ వాట‌ర్ వ‌స్తుంది. 10 టీఎంసీలు వాడుకుంటున్నాం. ఇప్పుడు మిడ్ మానేరు అండ్ ఎల్లంప‌ల్లి డెడ్ స్టోరేజీకి వ‌స్తుంది. అక్క‌డ రామ‌గుండం ఎరువుల ఫ్యాక్ట‌రీ ఉంది. కాబ‌ట్టి త‌ప్ప‌నిస‌రిగా నీళ్ల‌ను నింపుకోవాలి. క్లియ‌ర్‌గా చెప్తున్నాం.. ఏందంటే సీడ‌బ్ల్యూసీ వాళ్లే ఆ ఒక్క లోకేష‌న్‌లోనే ఈ జూన్‌లో 50 టీఎంసీలు, త‌ర్వాత 300 టీఎంసీలు ఈ జూలైలో, త‌ర్వాత ఆగ‌స్టులో 600 టీఎంసీలు అంటే 1600 టీఎంసీలు ఆలోకేష‌న్ నుంచే వ‌స్తున్నాయ‌ని చెప్పారు. కాబ‌ట్టి ద‌య‌చేసి దాన్ని ఉప‌యోగించుకోవాలి. మూడు టీఎంసీలు కాక‌పోయినా.. రెండు టీఎంసీలు అయినా మీరు అంటున్న‌ట్టు ట్ర‌య‌ల్ ర‌న్ చేయండి. ఎన్డీఎస్ఏ, ఇక్క‌డి ఇంజినీర్ల స‌ల‌హా తీసుకోండి. ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను కూడా ఆహ్వానించి చ‌ర్చ పెట్టండి. స్పందించాల్సింది ఈ 10, 15 రోజులే అని వెంక‌టేశం పేర్కొన్నారు.

డైంజ‌ర్ సిచువేష‌న్ ఉంది..

రేపు హైద‌రాబాద్‌కు నీళ్లు రాకుండా ఉంటే.. ఇప్ప‌టికే కూక‌ట్‌ప‌ల్లి ఏరియాలో ట్యాంక‌ర్లు తిరుగుతున్నాయి. వాట‌ర్ లెవ‌ల్స్ ప‌డిపోయాయి. తాగునీటి అవ‌స‌రాల కోసం గ‌త ప్ర‌భుత్వం దాదాపు 40 టీఎంసీలు కేటాయించింది. అన్ని రిజ‌ర్వాయ‌ర్లు ఈ లెవ‌ల్ మెయింటెన్ చేయాలి. ఇప్పుడు ఆ లెవ‌ల్ లేవు. అలార్మింగ్, డైంజ‌ర్ సిచువేష‌న్ ఉంది. సాగునీరు కూడా అవ‌స‌ర‌మే. టాప్ ప్ర‌యార్టీ తాగునీరు. హైద‌రాబాద్‌కు డ్రింకింగ్ వాట‌ర్ ఇంపార్టెంట్. అందుకనే అన్ని స్టోరేజీలు, అన్ని రిజ‌ర్వాయ‌ర్ల‌లో మినిమం వాట‌ర్ వ‌చ్చేట‌ట్టు పంపు చేయాల‌ని, లిఫ్ట్ చేసి తాగునీరు ఇచ్చాక‌ సాగునీరు ఇవ్వండి అని సూచించారు.

Advertisement
Advertisement