Tanneru Venkatesham | నీళ్లు కిందకు పోతున్నాయి.. పట్టిసీమ వద్ద 24 పంపులు నడుస్తున్నాయి : తన్నీరు వెంకటేశం
Tanneru Venkatesham | తెలంగాణ ప్రభుత్వం నీళ్లను ఎత్తిపోయకపోవడం వల్ల నీళ్లు కిందకు వృధాగా పోతున్నాయని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల అసోసియేషన్ సెక్రటరీ తన్నీరు వెంకటేశం తెలిపారు. మనం వదిలిపెట్టిన నీటిని మన ఆంధ్రా సోదరులు పట్టిసీమ వద్ద 24 పంపులు నడిపిస్తూ నీటిని ఎత్తిపోస్తున్నారని పేర్కొన్నారు.
Tanneru Venkatesham | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం నీళ్లను ఎత్తిపోయకపోవడం వల్ల నీళ్లు కిందకు వృధాగా పోతున్నాయని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల అసోసియేషన్ సెక్రటరీ తన్నీరు వెంకటేశం తెలిపారు. మనం వదిలిపెట్టిన నీటిని మన ఆంధ్రా సోదరులు పట్టిసీమ వద్ద 24 పంపులు నడిపిస్తూ నీటిని ఎత్తిపోస్తున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చర్చ సందర్భంగా ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో తన్నీరు వెంకటేశం ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై 2019 తర్వాత 2026లో చర్చ ఉంది. ఇది వాస్తవమా కాదా..? ఇప్పటి వరకు ఏ ఇంజినీర్లు, ఏ పార్టీలు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే తెలంగాణలో సఫిషియంట్ వానలు ఉన్నాయి. అదే ప్రాంతం నుంచి గోదావరిలో 10 నుంచి 30 లక్షల క్యూసెక్కుల వరద పోయింది. ఇప్పుడు ఎందుకు మాట్లాడినం అంటే.. మేం తెలంగాణ ఉద్యమంలో పని చేసినం. రాష్ట్రాన్ని సాధించాం.. మాకు ఉంటది కదా బాధ. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలి. అది ప్రభుత్వం బాధ్యత. ఎన్డీఎస్ఏ చెప్పింది.. ఎట్ ది సేమ్ టైమ్ టెంపరరీ మెజర్స్ కూడా తీసుకోమని చెప్పారు అని వెంకటేశం గుర్తు చేశారు.
మీరు పెంటారెడ్డి సలహా తీసుకొండి.. ఎక్స్‌పర్ట్ కదా..
ఇప్పుడు ఎక్కడా నీళ్లు లేవు.. ఆ ప్రాణం ఉన్న నది ఏందంటే ప్రాణహిత. తుమ్మిడిహెట్టి నుంచి ఇక్కడికి నీళ్లు వస్తున్నాయి.. అందులో డౌట్ లేదు. కానీ మనం అక్కడ కట్టే పరిస్థితి లేదు ఇప్పుడు. పోనీ 145 లెవల్‌లో బ్యారేజీ కోసం ఒక ఫౌండేషన్ వేయొచ్చు కదా.. మనం ఇల్లు కట్టినప్పుడు నాలుగు ఫ్లోర్లు కట్టుకుంటాం.. మనం ఫస్ట్ పునాది వేసుకుంటాం.. అలా పునాది వేయొచ్చు కదా.. మరి అక్కడ వేయలేదు కదా. ఇప్పుడు చెప్పేది ఏందంటే ఉన్నదాన్ని ఉపయోగించుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నీళ్లు కిందకు పోతున్నాయి.. ఇప్పుడు మన ఆంధ్రా సోదరులు పట్టిసీమ వద్ద 24 పంపులు నడుస్తున్నాయి. మీరు పెంటారెడ్డి సలహా తీసుకొండి. ఎక్స్‌పర్ట్ కదా.. నిజంగా రన్ చేయొచ్చా లేదా ఆయనను అక్కడ కూర్చోపెట్టండి. మేం కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఎలాంటి బేషజాలకు పోకుండా రైతులకు నీళ్లు ఇవ్వండి అని వెంకటేశం వేడుకున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

KTR | అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య మనువడికి కేటీఆర్ ప్రత్యేక లాకెట్ బహుకరణ
జులై 13, 2026

CM Revanth Reddy Delhi Tour | రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఆ లిస్ట్ రెడీ అయినట్టేనా?
జులై 13, 2026

Tanneru Venkatesham | రైతు భరోసా ఇచ్చారు.. మరి నీళ్లు ఇవ్వకుంటే ఏం లాభం..? : తన్నీరు వెంకటేశం
జులై 13, 2026
తాజావార్తలు
- ●KTR | అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య మనువడికి కేటీఆర్ ప్రత్యేక లాకెట్ బహుకరణ
- ●CM Revanth Reddy Delhi Tour | రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఆ లిస్ట్ రెడీ అయినట్టేనా?
- ●Bhagyashri Borse | సమంత మా అందరికి ఓ దారి చూపించింది - భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్...
- ●Tanneru Venkatesham | రైతు భరోసా ఇచ్చారు.. మరి నీళ్లు ఇవ్వకుంటే ఏం లాభం..? : తన్నీరు వెంకటేశం
- ●Tanneru Venkatesham | నీళ్లను ఒడిసి పట్టండి.. తాగునీటికే 40 టీఎంసీలు అవసరం : తన్నీరు వెంకటేశం
- ●Revanth Reddy | చంద్రబాబుకు రేవంత్ 'గురుదక్షిణ'.. సుప్రీంకోర్టులో బట్టబయలైన కుట్ర

KTR | అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య మనువడికి కేటీఆర్ ప్రత్యేక లాకెట్ బహుకరణ

CM Revanth Reddy Delhi Tour | రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఆ లిస్ట్ రెడీ అయినట్టేనా?

Bhagyashri Borse | సమంత మా అందరికి ఓ దారి చూపించింది - భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్...

Tanneru Venkatesham | రైతు భరోసా ఇచ్చారు.. మరి నీళ్లు ఇవ్వకుంటే ఏం లాభం..? : తన్నీరు వెంకటేశం



