త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OU 85th Convocation | స్నాతకోత్సవం ఒక్క‌ వేడుకే కాదు.. విద్యార్థుల‌ విజ‌యాల ఉత్స‌వం కూడా

OU 85th Convocation | ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రస్థానంలో 85వ ఘటికోత్సవం గర్వించదగ్గ‌ మైలురాయని వైస్-ఛాన్సలర్, ప్రొఫెసర్ కుమార్ మొలుగురామ్ పేర్కొన్నారు. ఇది ఉన్నత విద్యలో విద్యా నైపుణ్యం, పరిశోధన, ఆవిష్కరణలు, అందరినీ కలుపుకొని పోవాలనే యూనివర్సిటీ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని చెప్పారు.

S

Hyderabad | Published On Jul 13, 2026, 7.20 pm IST

OU 85th Convocation | స్నాతకోత్సవం ఒక్క‌ వేడుకే కాదు.. విద్యార్థుల‌ విజ‌యాల ఉత్స‌వం కూడా
Advertisement
  • ​సెప్టెంబ‌ర్ రెండో వారంలో ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో 85వ కాన్వొకేష‌న్‌
  • పట్టభద్రులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొనాల‌ని వీసీ కుమార్ మొలుగురామ్ పిలుపు

త్రినేత్ర‌.న్యూస్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రస్థానంలో 85వ ఘటికోత్సవం గర్వించదగ్గ‌ మైలురాయని వైస్-ఛాన్సలర్, ప్రొఫెసర్ కుమార్ మొలుగురామ్ పేర్కొన్నారు. ఇది ఉన్నత విద్యలో విద్యా నైపుణ్యం, పరిశోధన, ఆవిష్కరణలు, అందరినీ కలుపుకొని పోవాలనే యూనివర్సిటీ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని చెప్పారు. సెప్టెంబర్ రెండో వారంలో క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఈ మేర‌కు ఆయ‌న సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

​"విశ్వవిద్యాలయ విద్యా క్యాలెండర్‌లో ఘటికోత్సవం అత్యంత ప్రతిష్టాత్మకమైన వేడుకల్లో ఒకటి. అన్ని విభాగాలకు చెందిన గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డాక్టరల్ (Ph.D) స్కాలర్లకు అధికారికంగా డిగ్రీలు, డిప్లొమాలు, బంగారు పతకాలను అందజేస్తాం. శతాబ్ద కాలానికిపైగా ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఘన చరిత్ర కలిగి ఉంది. 1917లో ఏర్పాటై దేశంలోనే ఉన్నత విద్యలో అగ్రగామిగా ఉంటూ.. ప్రపంచవ్యాప్తంగా విశేష సేవలందిస్తోంది. ఎందరో పండితులను, నిపుణులను, నాయకులను తీర్చిదిద్దింది. ఇది వేడుక మాత్రమే కాదు.. విద్యార్థుల మేధోపరమైన విజయాల ఉత్సవం. విశ్వవిద్యాలయ‌ దార్శనికత అయిన “బోధించడం, సాధికారత కల్పించడం, రాణించడం” (Educate, Empower, and Excel) అనే లక్ష్యాన్ని పునరుద్ఘాటించే సందర్భం అని కుమార్ మొలుగురామ్ పేర్కొన్నారు.

​రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఘటికోత్సవాన్ని సులువుగా, విజయవంతంగా నిర్వహించడానికి అన్ని అనుబంధ, భాగస్వామ్య కళాశాలల పరిధిలో అవసరమైన ఏర్పాట్లను సమన్వయం చేస్తున్నామన్నారు. డిగ్రీలు, పతకాల స్వీకరణకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పూర్తి వివరాలు, మార్గదర్శకాలను త్వరలోనే విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

​పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ బి. సుధాకర్ రెడ్డి ప్ర‌సంగిస్తూ పీహెచ్‌డీ స్కాలర్లు, బంగారు పతక విజేతలతో సహా డిగ్రీల అవార్డుకు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను అధికారిక నోటిఫికేషన్లలో తెలియజేస్తామన్నారు. అర్హులైన గ్రాడ్యుయేట్లు అందరూ కాన్వొకేషన్ తేదీ కంటే ముందే నిర్దేశిత ఫార్మాలిటీలను పూర్తి చేయాలని ఆయన సూచించారు. ​“విజయాలను సంబరపడదాం, భవిష్యత్తుకు స్ఫూర్తినిద్దాం” (“Celebrating Achievement, Inspiring Futures”) అనే కాన్వొకేషన్ థీమ్‌తో జరిగే ఈ వేడుకలో పట్టభద్రులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొనాల‌ని వారు పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డి, వైస్-ఛాన్సలర్ ఓఎస్డీ, సోషల్ సైన్సెస్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ జితేందర్ నాయక్, పరీక్షల నియంత్రణాధికారి, సోషల్ సైన్సెస్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ బి.సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement