Jani Master | జానీ మాస్టర్‌కు మరో షాక్ – సడెన్‌గా ఆగిపోయిన కామెడీ షో
డ్యాన్సర్స్ అసోసియేషన్ గొడవలు మర్చిపోకముందే జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలినట్లు సమాచారం. జానీ మాస్టర్ జడ్జ్‌గా వ్యవహరిస్తోన్న మాస్ జాతర కామెడీ షో అర్ధాంతరంగా ఆగిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ వారం మాస్ జాతర టెలికాస్ట్ కావడం లేదని జెమిని టీవీ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
Entertainment | Published On Jul 24, 2026, 7.43 pm IST
Jani Master | డ్యాన్సర్ అసోసియేషన్‌లో జరుగుతోన్న గొడవల కారణంగా గత కొద్ది రోజులుగా జానీ మాస్టర్ పేరు వార్తల్లో నిలుస్తోంది. ఈ వివాదం కారణంగా జానీ మాస్టర్‌పై తెలుగు ఫిలిం ఫెడరేషన్ బ్యాన్ విధించింది. అతడు పనిచేస్తోన్న సినిమాలకు మిగిలిన ఇరవై మూడు క్రాఫ్ట్‌లు ఎవరూ సహకరించవద్దని పిలుపునిచ్చింది. చివరకు చిరంజీవి, బాలకృష్ణ జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. జానీ మాస్టర్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది.
మరో షాక్....
డ్యాన్సర్స్ అసోసియేషన్ గొడవలు సద్దుమణగకముందే జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలింది. అతడు జడ్జ్‌గా వ్యవహరిస్తోన్న ఓ టీవీ షోను అర్ధాంతరంగా ఆపేసినట్లు సమాచారం. జానీ మాస్టర్, నవదీప్, బిందుమాధవి జడ్జ్‌లుగా జెమిని టీవీలో మాస్ జాతర పేరుతో ఓ కామెడీ షో ఇటీవల మొదలైంది. జబర్ధస్థ్‌కు పోటీగా ప్రారంభమైన ఈ షోకు అమర్ దీప్ చౌదరి, దీపికా పిల్లి హోస్ట్‌లుగా వ్యవహరించారు.
నాలుగు నెలల్లోనే....
మాస్ జాతర మొదలై నాలుగు నెలలు కూడా కాకముందే ఈ కామెడీ షో ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి శనివారం, ఆదివారం రెండు రోజులు రాత్రి తొమ్మిది గంటలకు జెమిని టీవీలో మాస్ జాతర టెలికాస్ట్ అవుతుంది. ఈ వారం మాస్ జాతర ప్రసారం కాదని జెమిని టీవీ ప్రకటించింది. మాస్ జాతర ప్లేస్‌లో అల్లు అర్జున్ రేసుగుర్రం సినిమా టెలికాస్ట్ కానున్నట్లు వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.
ఫ్యాన్స్ కామెంట్లు...
మాస్ జాతరను ఈ ఒక్కవారమే ఆపేశారా? లేదంటే పర్మినెంట్‌గా ఆపేశారా అన్నది బుల్లితెర ఫ్యాన్స్‌లో ఆసక్తికరంగా మారింది. డ్యాన్సర్ అసోసియేషన్ గొడవల కారణంగా జానీ మాస్టర్ షూటింగ్‌లో పాల్గొనలేదని, అందుకే ఈ వారం ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ డిలే అయ్యిందని ప్రచారం జరుగుతోంది. నెటిజన్లు మాత్రం ఈ షోను పర్మినెంట్‌గా ఆపేస్తే బెటర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మాస్ జాతర ఆగిపోయినా నష్టమేమీ లేదంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ వివాదాలు, గొడవలతో సంబంధం లేకుండా కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్ ఫుల్ బిజీగా ఉన్నాడు. రామ్‌చరణ్ పెద్ది సినిమాకు జానీ మాస్టర్ కంపోజ్ చేసిన డ్యాన్సులకు మంచి పేరొచ్చింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Adivi Sesh | కాజల్ చందమామలో హీరోగా అడివిశేష్ – నటన నచ్చక సినిమా నుంచి తీసేసిన డైరెక్టర్
ఏప్రిల్ 7, 2026

Dhandoraa OTT | ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి శివాజీ దండోరా మూవీ – రిలీజ్ ఎప్పుడు…ఎందులో అంటే?
జనవరి 10, 2026

Bindu Madhavi | నేను తెలుగమ్మాయినే – అయినా పదేళ్లు ఒక్క అవకాశం రాలేదు – బిగ్‌బాస్ విన్నర్ బిందు మాధవి కామెంట్స్
డిసెంబర్ 26, 2025
తాజావార్తలు
- ●KTR | ప్రజాశక్తి ఎప్పుడూ గొప్పదే.. కేటీఆర్ ట్వీట్ వైరల్..!
- ●Indiramma Towers | ఇందిరమ్మ టవర్స్.. హెల్ప్‌లైన్ నంబర్ ఇదే
- ●CJP Protest Withdrawn | ఢిల్లీలో చల్లారిన 'నీట్' మంటలు: డిమాండ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఆందోళన విరమించిన సీజేపీ
- ●Prabhas | ప్రభాస్ సినిమా చేయడం నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు - డైలాగ్ రైటర్ కామెంట్స్
- ●Mahesh Kumar Goud | మోదీ తలవంచక తప్పలేదు
- ●Nitin Nabin BJP | ధర్మేంద్ర ప్రధాన్ నిజాయతీకి నిదర్శనం : నితిన్ నబిన్

KTR | ప్రజాశక్తి ఎప్పుడూ గొప్పదే.. కేటీఆర్ ట్వీట్ వైరల్..!

Indiramma Towers | ఇందిరమ్మ టవర్స్.. హెల్ప్‌లైన్ నంబర్ ఇదే

CJP Protest Withdrawn | ఢిల్లీలో చల్లారిన 'నీట్' మంటలు: డిమాండ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఆందోళన విరమించిన సీజేపీ

Prabhas | ప్రభాస్ సినిమా చేయడం నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు - డైలాగ్ రైటర్ కామెంట్స్



