Dhandoraa OTT | ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి శివాజీ దండోరా మూవీ – రిలీజ్ ఎప్పుడు…ఎందులో అంటే?
శివాజీ దండోరా మూవీ థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. జనవరి 14 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది. నందు, నవదీప్, రవికృష్ణ, బిందుమాధవి, మౌనిక రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు.
Entertainment | Published On Jan 10, 2026, 5.35 pm IST
Dhandoraa OTT | శివాజీ ప్రధాన పాత్రలో నటించిన దండోరా మూవీ ఓటీటీలోకి రాబోతుంది. మెసేజ్ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందిన ఈ మూవీలో శివాజీతో పాటు నందు, నవదీప్, రవికృష్ణ, బిందుమాధవి, మౌనిక రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. మురళీకాంత్ దర్శకత్వం వహించాడు.
ఇరవై రోజుల్లొనే...
థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. జనవరి 14 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది.
కుల వివక్ష పాయింట్‌కు ప్రేమకథను జోడించి దర్శకుడు మురళీకాంత్ ఈ సినిమాను రూపొందించారు. కులజాఢ్యం వల్ల కుటుంబాలు ఎలా ఛిన్నాభిన్నం అవుతాయన్నది హృదయాలకు హత్తుకునేలా ఈ సినిమాలో చూపించారు. పరువు హత్యలతో పాటు పలు అంశాలను టచ్ చేశారు. మంచి సినిమాగా పేరొచ్చిన కమర్షియల్‌గా మాత్రం సినిమా యావరేజ్‌గానే నిలిచింది.
దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్‌లపై శివాజీ చేసిన కామెంట్లు కూడా ఈ సినిమాకు మైనస్‌గా మారింది. దండోరా మూవీకి మార్క్ కే రాబిన్ మ్యూజిక్ అందించారు.
దండోరా కథ ఇదే...
తెలంగాణలోని తుళ్లూరు గ్రామంలో కుల వివక్ష ఎక్కువగా ఉంటుంది. శివాజీ (శివాజీ) అగ్ర కులానికి చెందిన పెద్ద మనిషి. ప్రాణం కంటే పరువు, కులమే ముఖ్యమని నమ్ముతుంటాడు. శివాజీ కూతురు సుజాత (మణిక) తమ ఊళ్లోని తక్కువ కులానికి చెందిన రవిని (రవికృష్ణ) ప్రేమిస్తుంది. అతడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. రవి హత్యకు గురవుతాడు. ప్రియుడి మరణం తట్టుకోలేక సుజాత కూడా ఆత్మహత్య చేసుకుంది. చెల్లెలు చావుకు తండ్రి కులపిచ్చి కారణమని శివాజీ కొడుకు విష్ణు (నందు) తండ్రితో మాట్లాడటం మానేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? రవిని హత్య చేసింది ఎవరు? శివాజీలో మార్పు తీసుకొచ్చిన శ్రీలత (బిందుమాధవి) ఎవరు అనే అంశాలతో ఈ మూవీ రూపొందింది.
సంబంధిత వార్తలు

Comedy OTT | ఒకే రోజు రెండు ఓటీటీలలో రిలీజైన తెలుగు కామెడీ మూవీ – పవన్ కళ్యాణ్ హీరో
జులై 24, 2026

Jani Master | జానీ మాస్టర్‌కు మరో షాక్ – సడెన్‌గా ఆగిపోయిన కామెడీ షో
జులై 24, 2026

Naga Durga | ఓటీటీలోకి నాగదుర్గ తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ – ప్రియురాలి కోసం అప్పులపాలైన ప్రేమికుడి కథ
జులై 24, 2026
తాజావార్తలు
- ●SSCTU | సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో యూజీ కోర్సుల్లో ప్రవేశాలు
- ●Health Insurance | పోలియో గురించి చెప్పలేదని.. ముఖ్యమంత్రి మామను ముప్పుతిప్పలు పెట్టిన బీమా సంస్థ
- ●Revanth Reddy | ట్రాఫిక్ నిర్వహణ, పర్యవేక్షణకు ప్రత్యేక బ్యూరో.. విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిరోధానికి కమిటీలు: సీఎం రేవంత్ రెడ్డి
- ●Horoscope | ప్రత్యక్షంలోకి వచ్చిన బుధుడు.. ఈ మూడురాశులవారి జీవితాల్లో అన్నీ సానుకూల మార్పులే..!
- ●Horoscope | జూలై 25 రాశి ఫలాలు.. ఈ రాశివారు విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు!
- ●Uttam Kumar Reddy | కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్రానికి సమగ్ర నివేదిక : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

SSCTU | సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో యూజీ కోర్సుల్లో ప్రవేశాలు

Health Insurance | పోలియో గురించి చెప్పలేదని.. ముఖ్యమంత్రి మామను ముప్పుతిప్పలు పెట్టిన బీమా సంస్థ

Revanth Reddy | ట్రాఫిక్ నిర్వహణ, పర్యవేక్షణకు ప్రత్యేక బ్యూరో.. విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిరోధానికి కమిటీలు: సీఎం రేవంత్ రెడ్డి

Horoscope | ప్రత్యక్షంలోకి వచ్చిన బుధుడు.. ఈ మూడురాశులవారి జీవితాల్లో అన్నీ సానుకూల మార్పులే..!



