Bindu Madhavi | నేను తెలుగమ్మాయినే – అయినా పదేళ్లు ఒక్క అవకాశం రాలేదు – బిగ్‌బాస్ విన్నర్ బిందు మాధవి కామెంట్స్
దండోరా మూవీతో దాదాపు పదేళ్ల తర్వాత తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది బిగ్‌బాస్ విన్నర్ బిందు మాధవి. గత నాలుగైదేళ్లుగా ఓటీటీలో వెబ్ సిరీస్‌లు చేస్తున్నా... సినిమాల్లో మాత్రం ఎవరూ అవకాశాలు ఇవ్వలేదని బిందు మాధవి అన్నది. దండోరాతో మళ్లీ తెలుగు బిగ్‌స్క్రీన్‌పై కనిపించడం ఆనందంగా ఉందని చెప్పింది.
Entertainment | Published On Dec 26, 2025, 6.15 pm IST
బిందు మాధవి
Bindu Madhavi | తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడంపై బిగ్‌బాస్ విన్నర్ బిందు మాధవి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన దండోరా మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో శ్రీలత అనే వేశ్య పాత్రలో బిందు మాధవి కనిపించింది. యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న ఛాలెంజింగ్ రోల్‌లో బిందు మాధవి నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. దండోరా మూవీ సక్సెస్ మీట్‌ను శుక్రవారం మేకర్స్ నిర్వహించారు.
ఇక్కడే పుట్టాను...
ఈ వేడుకలో తాను తెలుగు అమ్మాయినేనని బిందు మాధవి అన్నది. ఆమె మాట్లాడుతూ దండోరా మూవీతో పదేళ్ల తర్వాత తెలుగులో బిగ్‌స్క్రీన్‌పై కనిపించే అవకాశం వచ్చింది. నేను తెలుగు అమ్మాయినే. ఇక్కడే పుట్టాను. ఇక్కడే పెరిగాను. గత నాలుగైదేళ్లుగా ఓటీటీలో చాలా వెబ్‌సిరీస్‌లు చేస్తూనే ఉన్నాను. అయినా సినిమాల్లో ఒక్కరూ కూడా ఆఫర్ ఇవ్వలేదు. అలాంటి టైమ్‌లో దండోరా సినిమాలో అవకాశం వచ్చింది. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో నన్ను నేను చూసుకోవడం ఆనందంగా అనిపించింది. దండోరాలో నటించిన ప్రతి ఒక్కరూ ఆణిముత్యాలే. అందరూ పోటీపడి నటించారు. దండోరా కథ విన్నప్పుడు ఎంతో ఎగ్జైట్ అయ్యాను. చిన్న రోలా, పెద్ద పాత్రనా అన్నది పట్టించుకోకుండా ఈ సినిమాలో భాగం కావాలని ఫిక్సయ్యాను. మంచి సినిమా చేశాననే సంతోషాన్ని దండోరా మిగిల్చింది అని బిందు మాధవి అన్నది. బిందు మాధవి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
శేఖర్ కమ్ముల సినిమాతో...
ఏపీలో పుట్టిపెరిగిన బిందుమాధవి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆవకాయ్ బిర్యానీ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత బంపరాఫర్, రామ రామ కృష్ణ కృష్ణ, ఇంకోసారితో పాటు మరికొన్ని సినిమాలు చేసింది. ఇవేవీ బిందు మాధవికి సక్సెస్‌లను తెచ్చిపెట్టలేకపోయాయి. చివరగా 2011లో రిలీజైన నాని పిల్ల జమీందార్ తర్వాత టాలీవుడ్‌కు దూరమైంది. అదై టైమ్‌లో తమిళంలో బిందు మాధవి చేసిన సినిమాలు కొన్ని సూపర్ హిట్టవ్వడంతో కోలీవుడ్‌లో బిజీగా మారిపోయింది. పదేళ్లు తమిళ సినిమాలకే పరిమితమైంది.
బిగ్‌బాస్ నాన్ స్టాప్‌తో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చిన బిందు మాధవి ఏకంగా విన్నర్‌గా నిలిచింది. బిగ్‌బాస్‌తో వచ్చిన క్రేజ్‌తో తెలుగులో చాలానే వెబ్‌సిరీస్‌లు చేసింది. న్యూసెన్స్ యాంగర్ టేల్స్. మ్యాన్షన్ 24 తో పాటు మరికొన్ని సిరీస్‌లలో డిఫరెంట్ రోల్స్ లో కనిపించింది బిందుమాధవి. తమిళంలో ప్రస్తుతం ఓ రెండు సినిమాలు చేస్తుంది బిందు మాధవి.
సంబంధిత వార్తలు

Jani Master | జానీ మాస్టర్‌కు మరో షాక్ – సడెన్‌గా ఆగిపోయిన కామెడీ షో
జులై 24, 2026

Web Series Review | విక్రమ్ ఆన్ డ్యూటీ రివ్యూ – బిగ్‌బాస్ విన్నర్ నిఖిల్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
మార్చి 7, 2026

Telugu Web Series | ఓటీటీలోకి తెలుగు బిగ్‌బాస్ విన్నర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ – స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ఫిబ్రవరి 27, 2026
తాజావార్తలు
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు



