త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adivi Sesh | కాజ‌ల్ చంద‌మామలో హీరోగా అడివిశేష్ – న‌ట‌న న‌చ్చ‌క సినిమా నుంచి తీసేసిన డైరెక్ట‌ర్‌

కాజ‌ల్ అగ‌ర్వాల్ సూప‌ర్ హిట్ మూవీ చంద‌మామ‌లో అడివిశేష్ హీరోగా న‌టించాల్సింద‌ట‌. కొన్నాళ్లు షూటింగ్‌లో జ‌రిగిన త‌ర్వాత అడివి శేష్ న‌ట‌న బాగాలేద‌ని చెప్పి అత‌డిని సినిమా నుంచి డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ తీసేశార‌ట‌. అడ‌వి శేష్ ప్లేస్‌లో న‌వ‌దీప్‌ను హీరోగా సెలెక్ట్ చేశార‌ట‌.

N

Entertainment | Published On Apr 7, 2026, 7.25 pm IST

Adivi Sesh | కాజ‌ల్ చంద‌మామలో  హీరోగా అడివిశేష్ – న‌ట‌న న‌చ్చ‌క సినిమా నుంచి తీసేసిన డైరెక్ట‌ర్‌
Advertisement

Adivi Sesh | టాలీవుడ్ హీరోల్లో అడివి శేష్ రూటే స‌ఫ‌రేటు. స్టార్‌డ‌మ్‌, ఇమేజ్, నంబ‌ర్ గేమ్స్‌తో ప‌ట్టింపులు లేకుండా కంటెంట్ ఓరియెంటెడ్ క‌థాంశాల‌తో సినిమాలు చేస్తూ విజ‌యాల‌ను ద‌క్కించుకుంటున్నారు. అడివి శేష్ సినిమా అంటేనే కొత్త‌ద‌నానికి, వైవిధ్య‌త‌కు చిరునామాగా చెబుతుంటారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ అత‌డి సినిమాల‌కు స్పెష‌ల్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్ర‌స్తుతం డెకాయిట్‌, గూఢ‌చారితో పాటు మ‌రో నాలుగు సినిమాలు లైన్‌లో పెట్టాడు అడివి శేష్‌.

సినిమా క‌ష్టాలు...

అడివి శేష్ హీరోగా న‌టించిన డెకాయిట్ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న సినిమా క‌ష్టాల‌పై అడివిశేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
హీరోగా ఎంట్రీ ఇవ్వ‌క‌ముందు బాహుబ‌లి, పంజాతో పాటు మ‌రికొన్ని సినిమాల్లో విల‌న్‌గా న‌టించాడు అడివిశేష్‌. అవ‌కాశాల కోసం చాలానే క‌ష్ట‌ప‌డ్డాడ‌ట‌. కొన్ని ఆఫ‌ర్లు వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి చేజారాయ‌ట‌. మ‌రికొన్ని సినిమాల్లో షూటింగ్ మొద‌లైన త‌ర్వాత త‌న‌ను తీసేశార‌ని అన్నాడు. వాటిలో కృష్ణ‌వంశీ చంద‌మామ సినిమా ఒక‌ట‌ని అడివిశేష్ చెప్పాడు.

కాజ‌ల్‌కు జోడీగా...

చంద‌మామ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు జోడీగా హీరోగా అడివిశేష్‌ను తీసుకున్నార‌ట డైరెక్ట‌ర్‌ కృష్ణ‌వంశీ. కొన్నాళ్లు చంద‌మామ షూటింగ్‌లో పాల్గొన్నా. కానీ నా యాక్టింగ్ విష‌యంలో కృష్ణ‌వంశీ అసంతృప్తిగా క‌నిపించారు. నా న‌ట‌న బాగాలేద‌ని చెప్పి న‌న్ను తీసేసి ఆ ప్లేస్‌లో న‌వ‌దీప్‌ను సెలెక్ట్ చేసుకున్నారు అని అడివిశేష్ అన్నారు. ఈ సినిమాకు మొద‌ట అనుకున్న టైటిల్ చంద‌మామ కాద‌ట‌. మ‌ల్లెపువ్వు పేరుతో కృష్ణ‌వంశీ ఈ సినిమాను ప్రారంభించార‌ని, ఆ త‌ర్వాత టైటిల్‌ను ఛేంజ్ చేశార‌ని అడివిశేష్ చెప్పాడు.

ఐదు నంది అవార్డులు...

చిన్న సినిమాగా రిలీజైన చంద్ర‌మామ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. తెలుగులో కాజ‌ల్ కెరీర్‌ను నిల‌బెట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ఈ సినిమాలో కాజ‌ల్‌తో పాటు సింధు మీన‌న్ మ‌రో హీరోయిన్‌గా న‌టించింది. న‌వ‌దీప్‌, శివ‌బాలాజీ హీరోలుగా న‌టించారు. ఈ సినిమా ఐదు నంది అవార్డుల‌ను ద‌క్కించుకుంది.

 

Advertisement
Advertisement