Janhvi Kapoor | సోషల్ మీడియాతో కనకవర్షం.. జాన్వీ కపూర్ ఒక్కో పోస్ట్‌కి ఎంత ఛార్జ్ చేస్తుందో తెలుసా?
Janhvi Kapoor | గతంలో సినీ స్టార్‌కు ఎక్కువగా సినిమాలు, బ్రాండ్స్ ప్రమోషన్స్ ద్వారానే ఆదాయం వచ్చేది. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆ లెక్కలు తారుమారయ్యాయి. సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ కూడా రూ.కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ తదితర వేదికల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్‌లు ఒక్కో పోస్టుతోనే రూ.లక్షలు, రూ.కోట్లలో ఆదాయాన్ని ఆర్జిస్తోంది.
Entertainment | Published On Jul 22, 2026, 7.00 pm IST
Janhvi Kapoor | గతంలో సినీ స్టార్‌కు ఎక్కువగా సినిమాలు, బ్రాండ్స్ ప్రమోషన్స్ ద్వారానే ఆదాయం వచ్చేది. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆ లెక్కలు తారుమారయ్యాయి. సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ కూడా రూ.కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ తదితర వేదికల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్‌లు ఒక్కో పోస్టుతోనే రూ.లక్షలు, రూ.కోట్లలో ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ముందున్నది. శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్.. తక్కువ కాలంలోనే బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను 2.68 కోట్ల మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్స్‌తో పాటు ఇతర డిజిటల్ ఫ్లాట్‌ఫారమ్స్‌లోనూ అభిమానులున్నారు. ఈ క్రేజ్‌ను కమర్షియల్‌గా మలచుకోవడంలో జాన్వీ సక్సెస్ అయ్యింది.
ఒక్కో పోస్టుకు రూ.10లక్షల వరకు వసూలు..
ప్రముఖ నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తమ ఉత్పత్తుల ప్రచారం కోసం జాన్వీని ఎంపిక చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే ఒక్కో స్పాన్సర్డ్ పోస్టుకు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎక్స్‌లో చేసే ప్రచార పోస్టులకు కూడా లక్షల్లోనే చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా పోస్టులతోనే కాదు.. బ్రాండ్ ఎండోర్స్‌మెంట్ ఒప్పందాల ద్వారానూ జాన్వీ భారీగా ఆర్జిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఒప్పో, లెన్స్‌కార్ట్, తుమి, హావెల్స్ వంటి ప్రముఖ కంపెనీలకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఈ ఒప్పందాల ద్వారా ఏడాదికి కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని మార్కెటింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రతి నెలా బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, గ్యాడ్జెట్లు, టెక్నాలజీ ఉత్పత్తులకు సంబంధించిన పలు బ్రాండ్ క్యాంపెయిన్లలో జాన్వీ కనిపిస్తోంది. ఈ లెక్కన సోషల్ మీడియా ద్వారానే నెలకు రూ.1.5 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతున్నట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. డిజిటల్ మార్కెటింగ్ పరంగా అత్యధిక కమర్షియల్ విలువ కలిగిన బాలీవుడ్ హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరిగా ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
ఒక్కో సినిమాకు రూ.6కోట్ల దాకా..
ఇక సినిమాల పరంగానూ మార్కెట్ బలంగానే ఉంది. బాలీవుడ్‌లో ఒక్కో చిత్రానికి నిర్మాణ సంస్థ, సినిమా బడ్జెట్‌ను బట్టి సుమారు రూ.6 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఆమె క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు కూడా భారీ పారితోషికం చెల్లించేందుకు వెనుకాడడం లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణాదిలోనూ జాన్వీ డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ‘దేవర’ చిత్రానికి దాదాపు రూ.3కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అలాగే, రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రానికి సుమారు రూ.4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. వెండితెరపై స్టార్‌డమ్‌ను, సోషల్ మీడియాలోని ప్రజాదరణను సమర్థంగా ఆదాయ వనరులుగా మలుచుకున్న జాన్వీ కపూర్.. ప్రస్తుతం బాలీవుడ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా అత్యధిక కమర్షియల్ విలువ కలిగిన యువ హీరోయిన్లలో ఒకరిగా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్
- ●Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..
- ●Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం
- ●Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!
- ●Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న - తొలి తెలుగు హీరోయిన్గా అరుదైన ఘనత
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..

Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్

Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..

Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం

Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!






