త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Janhvi Kapoor | కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న జాన్వీ క‌పూర్ – స్టార్ హీరో త‌న‌యుడికి జోడీగా

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ విక్ర‌మ్ హీరోగా త‌మిళంలో న్యూ ఏజ్ ల‌వ్‌స్టోరీ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో ధృవ్ విక్ర‌మ్‌కు జోడీగా జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Entertainment | Published On May 19, 2026, 2.50 pm IST

Janhvi Kapoor | కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న జాన్వీ క‌పూర్ – స్టార్ హీరో త‌న‌యుడికి జోడీగా
Advertisement

Janhvi Kapoor |  లెజెండ‌రీ న‌టి శ్రీదేవి బాలీవుడ్‌తో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ద‌క్షిణాదిలో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించింది. శ్రీదేవి త‌న‌య జాన్వీక‌పూర్ కూడా త‌ల్లి బాట‌లోనే అడుగులు వేస్తోంది. బాలీవుడ్ సినిమాల‌తో కెరీర్‌ను ప్రారంభించిన జాన్వీక‌పూర్ దేవ‌ర మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. జాన్వీ హీరోయిన్‌గా న‌టించిన పెద్ది జూన్ 4న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

కోలీవుడ్‌లో తొలి అడుగు...

తాజాగా జాన్వీ కోలీవుడ్‌లోకి అరంగేట్రం చేయ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. డెబ్యూ మూవీలో చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ విక్ర‌మ్‌తో రొమాన్స్ చేయ‌బోతున్న‌ద‌ట‌. బైస‌న్‌తో హీరోగా కెరీర్‌లో ఫ‌స్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్నాడు ధృవ్ విక్ర‌మ్‌. కుల వివ‌క్షపై పోరాడే ఓ క్రీడాకారుడి పాత్ర‌లో అస‌మాన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. బైస‌న్ త‌ర్వాత ధృవ్ విక్ర‌మ్ ఓ న్యూ ఏజ్ ల‌వ్‌స్టోరీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ సినిమాకు క‌ర‌ణ్ అర‌వింద్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

జాన్వీ హీరోయిన్‌...

ఈ ల‌వ్‌స్టోరీలో ధృవ్ విక్ర‌మ్‌కు జోడీగా జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. తొలుత రుక్మిణి వ‌సంత్‌తో పాటు మ‌రికొంద‌రు హీరోయిన్ల పేర్ల‌ను మేక‌ర్స్ ప‌రిశీలించార‌ట‌. కానీ క‌థానుగుణంగా ఫ్రెష్ పెయిర్ అయితేనే బాగుంటుంద‌నే ఆలోచ‌న‌తో చివ‌ర‌కు జాన్వీ పేరును ఫైన‌ల్ చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో మోడ్ర‌న్ యువ‌తిగా జాన్వీ క్యారెక్ట‌ర్ చాలా స్టైలిష్‌గా సాగుతుంద‌ని అంటున్నారు.

పెద్ది బ్యాన‌ర్‌లోనే....

జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న పెద్ది మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. అదే బ్యాన‌ర్‌లో ధృవ్ విక్ర‌మ్‌, జాన్వీ క‌పూర్ త‌మిళ సినిమా తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. ఈ ల‌వ్‌స్టోరీకి సాయి అభ్యంక‌ర్ మ్యూజిక్ అందిస్తోన్నారు.
కాగా పెద్ది మూవీలో జాన్వీ క‌పూర్ అచ్చియ‌మ్మ పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. ఎమ్మెల్యే కూతురిగా చాలా మాసీగా ఆమె క్యారెక్ట‌ర్ సాగ‌నున్న‌ట్లు ట్రైల‌ర్‌లో చూపించారు. పెద్ది త‌ర్వాత దేవ‌ర 2 చేయ‌బోతుంది. జాన్వీ.

 

Advertisement
Advertisement