Janhvi Kapoor | టాలీవుడ్‌కు జాన్వీకపూర్ గుడ్‌బై? – స్టార్ హీరో సినిమాను రిజెక్ట్ చేసిన శ్రీదేవి తనయ
జాన్వీకపూర్‌కు టాలీవుడ్ అంతగా కలిసిరావడం లేదు. పెద్ది, దేవర సినిమాల్లో ఆమె పాత్రలపై దారుణంగా విమర్శలొచ్చాయి. ఈ ట్రోల్స్, వివాదాల నేపథ్యంలో టాలీవుడ్‌కు కొన్నాళ్ల పాటు దూరంగా ఉండాలని జాన్వీకపూర్ నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఓ స్టార్ హీరో సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలిసింది.
Entertainment | Published On Oct 9, 2026, 3.32 pm IST
Janhvi Kapoor | జాన్వీకపూర్‌కు టాలీవుడ్ అంతగా అచ్చిరాలేదు. ఇప్పటివరకు తెలుగులో దేవర, పెద్ది సినిమాలు చేసింది. వీటిలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో జోడీకట్టింది. స్టార్ హీరోలతో సినిమాలు చేశానన్న పేరు తప్ప జాన్వీ కెరీర్‌కుఏ విధంగా ఉపయోగపడలేదు. ఈ రెండు సినిమాల్లో జాన్వీకపూర్ పాత్రలపై దారుణంగా విమర్శలొచ్చాయి. కేవలం గ్లామర్ యాంగిల్‌లోనే ఆమెను దర్శకులు ఈ సినిమాలో చూపించారు. పాటలు, అందాల ప్రదర్శనకే ఆమె పాత్రను పరిమితం చేయడంపై నెటిజన్లతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా తప్పుపట్టాయి. పెద్ది వివాదం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ను కుదిపేసింది. ఈ వివాదం కారణంగా పెద్ది ప్రమోషన్స్‌కు దూరమైంది.
తెలుగులో ఆఫర్లు ...
పెద్ది, దేవర సినిమాలపై వచ్చిన విమర్శలు, వివాదాలతో టాలీవుడ్ సినిమాలకు కొన్నేళ్ల పాటు దూరంగా ఉండాలని జాన్వీ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు సినిమాల ఆఫర్లను రిజెక్ట్ చేస్తోన్నట్లు చెబుతోన్నారు.
మైథాలజీ మూవీ...
హీరో నాని సినిమాతో తొలి అడుగులోనే హిట్టు అందుకున్న ఓ డైరెక్టర్ మైథాలజీ మూవీ కథతో జాన్వీకపూర్‌ను ఇటీవలే సంప్రదించినట్లు తెలిసింది. పెద్దికి ముందు ఈ సినిమా చేయడానికి జాన్వీ ఇంట్రెస్ట్ చూపించినట్లు సమాచారం. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇటీవలే టాలీవుడ్ డైరెక్టర్‌కు నో చెప్పిందని అంటున్నారు. ఇందులో యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో నటిస్తున్నారు. ఆ హీరోతో సినిమా చేయాలన్నది తన డ్రీమ్ అని కూడా పలు సినిమాల ప్రమోషన్స్‌లో చెప్పింది. అయినా కూడా టాలీవుడ్‌కు దూరంగా ఉండాలనే నిర్ణయం విషయంలో మాత్రం తగ్గేదేలే అని జాన్వీ చెప్పినట్లు చెబుతున్నారు.
హిందీలో హిట్టు లేదు...
హిందీలో జాన్వీ కెరీర్ ఆశాజనకంగా లేదు. పరమ్ సుందరి, సన్నీ సంస్కారికి తులసి కుమారిసినిమాలు బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచాయి. హిందీలో మంచి కమర్షియల్ హిట్టు కోసం ఎదురుచూస్తోంది. సినిమాల కెరీర్ అంతంత మాత్రంగానే సాగుతుండటంతో సొంతం బిజినెస్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సొంతంగా స్కిన్ కేర్ బ్రాండ్‌ను లాంఛ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఆమె సన్నిహితులు చెబుతోన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!






