త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Janhvi Kapoor | అశ్లీల‌ సైట్ల‌లో నా ఫొటోలు పెట్టారు – ఇప్ప‌టికీ బాధ‌ప‌డుతున్నానంటూ జాన్వీక‌పూర్ కామెంట్స్‌

టీనేజ్‌లో ఉండ‌గా త‌న‌కు ఎదురైన ఓ చేదు అనుభ‌వంపై జాన్వీక‌పూర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. స్కూల్ డేస్‌లో ఉన్న‌ప్పుడు త‌న ఫొటోల‌ను ఎవ‌రో అస‌భ్య‌క‌రంగా మార్ఫింగ్ చేసి అశ్లీల సైట్స్‌లో పోస్ట్ చేశార‌ని అన్న‌ది. ఆ క్ష‌ణం చాలా బాధ‌ను అనుభ‌వించాన‌ని జాన్వీ చెప్పింది.

N

Entertainment | Published On Apr 5, 2026, 4.24 pm IST

Janhvi Kapoor | అశ్లీల‌ సైట్ల‌లో నా ఫొటోలు పెట్టారు – ఇప్ప‌టికీ బాధ‌ప‌డుతున్నానంటూ జాన్వీక‌పూర్ కామెంట్స్‌
Advertisement

Janhvi Kapoor |  శ్రీదేవి త‌న‌య‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీక‌పూర్‌. ఏడాదికి మూడు నాలుగు సినిమాల‌తో త‌క్కువ టైమ్‌లోనే టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా మారిపోయింది. ఎన్టీఆర్ దేవ‌ర‌తో తెలుగులో తొలి అడుగు వేసిన జాన్వీ ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ పెద్దిలో న‌టిస్తోంది. ఈ సినిమాలో అచ్చియ‌మ్మ అనే డేరింగ్ అండ్ డాషింగ్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ది. ఏప్రిల్ 30న పెద్ది రిలీజ్ కాబోతుంది.

ఏఐ వీడియోలు...

ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో డీప్‌ఫేక్ వీడియోలు, ఏఐ మార్ఫింగ్ ఫొటోల కార‌ణంగా టీనేజ్ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్లు చెప్పింది. "స్కూల్ డేస్‌లో త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వంపై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. ప‌దిహేనేళ్ల వ‌య‌సులో స్కూల్‌లో డేస్‌లో మాకు ఐటీ క్లాస్‌లు ఉండేవి. స‌ర‌దా కోసం అబ్బాయిలు కొన్ని అశ్లీల సైట్స్ చూసేవారు. ఆ సైట్స్‌లో నా ఫొటోలు క‌నిపించాయ‌ని వారు చెప్పారు. అస‌భ్య‌క‌ర యాంగిల్స్‌లో నా ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి సైట్స్‌లో పెట్టార‌ని తెలియ‌గానే చాలా బాధ‌గా అనిపించింది. ఆ బాధ‌ నుంచి తేరుకోవ‌డానికి చాలా రోజులు ప‌ట్టింది. సోష‌ల్ మీడియాలో ఇవ‌న్నీ సాధార‌ణ‌మ‌ని నా మ‌న‌సుకు నేను స‌ర్ధిచెప్పుకున్నా. సెలిబ్రిటీగా ఉండ‌టం ఎంత క‌ష్ట‌మో అప్పుడే అర్థ‌మైంది" అని జాన్వీక‌పూర్ అన్న‌ది.

నైతికత లేదు...

ప‌దిహేనేళ్ల నుంచి నేటి వ‌ర‌కు ప్ర‌తిరోజు మార్ఫింగ్ ఫొటోలు, డీప్ ఫేక్ వీడియోల కార‌ణంగా అంతులేని వేద‌న‌ను అనుభ‌విస్తూనే ఉన్నాన‌ని చెప్పింది. ప్ర‌శాంతత లేకుండాపోయింద‌ని అన్న‌ది. ఇలాంటివి చూసిన‌ప్పుడు ఇండ‌స్ట్రీలోకి అన‌వ‌స‌రంగా వ‌చ్చాన‌ని అనిపిస్తుంద‌ని జాన్వీ అన్న‌ది. మార్పింగ్ ఫొటోల‌ను నిజ‌మైన‌వేన‌ని అంద‌రూ అనుకుంటారు. "నిజాలు తెలియ‌కుండా నేనే అశ్లీలంగా ఫొటోల‌ను దిగాన‌ని ట్రోల్ చేస్తుంటారు. వారికి ఏమ‌ని స‌మాధానం చెప్పాలో అర్థం కాదు. మార్ఫింగ్ వీడియోలు ఏం ఆశించి చేస్తారో ఇప్ప‌టికీ అంతుప‌ట్ట‌దు. ఇలాంటివి చూసిన‌ప్పుడే అస‌లు సోష‌ల్ మీడియాలో నైతిక‌త, విశ్వ‌స‌నీయ‌త అన్న‌వే ఉండ‌వ‌ని అనిపిస్తుంది అంటూ జాన్వీక‌పూర్ అన్న‌ది". ఆమె కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

 

 

Advertisement
Advertisement