త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Janhvi Kapoor | ఆ విషయంలో టాలీవుడ్ తర్వాతే ఎవరైనా.. దీపికాకు గట్టిగా ఇచ్చిప‌డేసిన‌ జాన్వీ కపూర్

శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ టాలీవుడ్‌పై ప్ర‌శంస‌లు కురిపించింది. బాలీవుడ్‌తో పోలిస్తే టాలీవుడ్‌లో డిసిప్లిన్ ఎక్కువ‌ని అన్న‌ది. ప‌ని గంట‌లు కూడా త‌క్కువేన‌ని చెప్పింది. దీపికా ప‌డుకోణ్‌కు కౌంట‌ర్‌గానే జాన్వీ ఈ కామెంట్స్ చేసింద‌ని నెటిజ‌న్లు అంటున్నారు.

N

Entertainment | Published On May 31, 2026, 3.50 pm IST

Janhvi Kapoor | ఆ విషయంలో టాలీవుడ్ తర్వాతే ఎవరైనా.. దీపికాకు గట్టిగా ఇచ్చిప‌డేసిన‌ జాన్వీ కపూర్
Advertisement

Janhvi Kapoor | మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న పెద్ది మూవీ జూన్ 4న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విజ‌యం రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు హీరోయిన్ జాన్వీక‌పూర్ కెరీర్‌కు కీల‌కంగా మారింది. దేవ‌ర త‌ర్వాత తెలుగులో జాన్వీ హీరోయిన్‌గా న‌టిస్తోన్న సెకండ్ మూవీ ఇది. దేవ‌ర స‌క్సెస్ శ్రీదేవి త‌న‌య‌ కెరీర్‌కు ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డ‌లేక‌పోయింది. దాంతో పెద్దిపై బోలెడు ఆశ‌లు పెట్టుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. పెద్దితో హిట్టు కొట్టి ప‌ర్మినెంట్‌గా టాలీవుడ్‌లోనే సెటిల‌వ్వాల‌నే ఆలోచ‌న‌లో జాన్వీక‌పూర్ ఉన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప‌ద్ద‌తి...ప్లానింగ్‌...

పెద్ది ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్న జాన్వీ టాలీవుడ్‌పై తెగ ప్ర‌శంస‌లు కురిపించింది. బాలీవుడ్‌తో పోలిస్తే టాలీవుడ్‌లో ప్ర‌తీదీ ప్లానింగ్ ప్ర‌కారం ప‌ద్ద‌తిగా జ‌రుగుతాయ‌ని అన్న‌ది. డిసిప్లిన్ ఎక్కువేన‌ని అన్న‌ది.

ఎలాంటి ఒత్తిడి ఉండ‌దు...

"టాలీవుడ్‌లో పని గంటల విష‌యంలో ఆర్టిస్టుల‌పై ఎలాంటి ఒత్తిడి ఉండ‌దు. స్టార్స్ నుంచి సాధార‌ణ ఆర్టిస్టుల వ‌ర‌కు ఎవ‌రైనా రోజుకు తొమ్మిది నుండి ప‌ది గంట‌ల కంటే ఎక్కువ‌గా ప‌నిచేయ‌డం నేను చూడ‌లేదు.నైట్ షూట్స్ కూడా తెల్లవారుజామున 2 గంటలకల్లా ముగిసిపోతాయి. షూటింగ్‌లు, రిహార్స‌ల్స్‌, వ‌ర్క‌షాప్స్ నుంచి లంచ్ బ్రేక్స్ వ‌ర‌కు ప్ర‌తీదీ ప్లానింగ్ ప్ర‌కారం జ‌రుగుతుంటాయి. బాలీవుడ్‌లో ఆ డిసిప్లిన్ క‌నిపించ‌దు. షూటింగ్ మొద‌లుపెట్ట‌డ‌మే, ముగించ‌డం ఏది ఆర్టిస్టుల చేతిలో ఉండ‌దు. న‌టీన‌టుల‌ను గౌర‌వించే తీరు విష‌యంలో టాలీవుడ్ బెస్ట్" అంటూ జాన్వీక‌పూర్ అన్న‌ది.

దీపికాకు కౌంట‌ర్‌...

జాన్వీ క‌పూర్ కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి. దీపికా ప‌డుకోణ్‌కు కౌంట‌ర్‌గా జాన్వీ ఈ కామెంట్స్ చేసింద‌ని కొంద‌రు నెటిజ‌న్లు వ్యాఖ్య‌లు చేస్తోన్నారు. టాలీవుడ్‌లో ప‌ని గంట‌ల రూల్ కార‌ణంగానే ప్ర‌భాస్ క‌ల్కి 2 మూవీ నుంచి దీపికా ప‌డుకోణ్ త‌ప్పుకుంది. టాలీవుడ్‌పై దారుణంగా విమ‌ర్శ‌లు గుప్పించింది. ఇక్క‌డ షూటింగ్‌లు ఎక్కువ టైమ్ జ‌రుగ‌తాయ‌న‌ని, ఆర్టిస్టుల‌ను స‌రైన గౌర‌వం ఇవ్వ‌ర‌ని ఆరోప‌ణ‌లు చేసింది. దీపికా కామెంట్ల‌కు కౌంట‌ర్‌గానే జాన్వీ ఆన్స‌ర్ ఇచ్చింద‌ని నెటిజ‌న్లు అంటున్నారు.

బోల్డ్ రోల్‌లో...

పెద్ది మూవీలో ఆచ్చియ‌మ్మ అనే పాత్ర‌లో జాన్వీ క‌పూర్ క‌నిపించ‌బోతున్న‌ది. ఎమ్మెల్యే కూతురిగా బోల్డ్ రోల్‌లో న‌టిస్తోంది. పెద్ది మూవీకి బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

 

Advertisement
Advertisement