Peddi | పెద్ది ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ – జాన్వీ కపూర్ కొత్త సీన్లు యాడ్ – ఎప్పటినుంచంటే?
పెద్ది మూవీలో జాన్వీకపూర్ పాత్రకు సంబంధించిన కొన్ని కొత్త సీన్లను యాడ్ చేయబోతున్నారు. ఈ సన్నివేశాలు జోడించిన తర్వాత జాన్వీ పాత్రపై ఆడియెన్స్‌లో ఏర్పడిన అభిప్రాయం మారిపోతుందని డైరెక్టర్ బుచ్చిబాబు సానా అన్నారు. బుధవారం నుంచి థియేటర్లలో ఈ కొత్త సీన్లతో సినిమా స్క్రీనింగ్ అవుతుందని చెప్పారు.
Entertainment | Published On Jun 14, 2026, 6.43 pm IST
Peddi | మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు మేకర్స్ గుడ్‌న్యూస్ వినిపించారు. పెద్ది మూవీకి కొన్ని కొత్త సీన్లు యాడ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లో పెద్ది సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్‌లో కొత్త సీన్లపై డైరెక్టర్ బుచ్చిబాబు సానా క్లారిటీ ఇచ్చారు. "మొత్తం మూడు సన్నివేశాలను యాడ్ చేయబోతున్నాం. ఇందులో రెండు జాన్వీ కపూర్‌వి కాగా ఓ సన్నివేశం జగపతిబాబుది. బుధవారం నుంచి థియేటర్లలో పెద్ది న్యూ వెర్షన్ థియేటర్లలో స్క్రీనింగ్ అవుతుంది. ఈ సీన్లు జోడించిన తర్వాత జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించి ప్రేక్షకుల్లో ఏర్పడిన అభిప్రాయం మారిపోతుంది. ఆమె పాత్రతో మరింతగా కనెక్ట్ అవుతారు" అని డైరెక్టర్ బుచ్చిబాబు సానా అన్నారు.
నెక్స్ట్ లెవెల్...
"పెద్ది కంటెంట్ రామ్‌చరణ్ నటన అద్భుతమంటూ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. పెద్ది లాంటి కథలు మరిన్ని రావాలని కోరుకున్నారు. మేము నమ్మిన దానిని ప్రేక్షకులు పెద్ద విజయాన్ని అందించి నిజం చేయడం ఆనందంగా ఉంది. నేను ఊహించిన ‘పెద్ది’ పాత్రకు తన నటనతో రామ్‌చరణ్ ప్రాణం పోశారు. ఆయన వల్లే ఈ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లిపోయింది. బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ విషయంలో నేను ఎలా అనుకుంటున్నానో ఒక స్కెచ్ వేసి చూపించాను. దాన్ని చూసి షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుని అద్భుతంగా ట్రాన్స్‌ఫర్మ్ అయ్యి వచ్చారు చిరంజీవి సినిమా చూసి ఎమోషనల్ అయ్యాడు. “చరణ్ అంత కష్టపడ్డాడు కాబట్టే ఇంత పేరు వస్తోంది అని చిరంజీవి మెచ్చుకున్నారు" అని బుచ్చిబాబు పేర్కొన్నారు.
క్షమాపణలు చెప్పడం నచ్చలేదు.
పెద్ది సక్సెస్ సెలబ్రేషన్స్‌లో లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ పాల్గొన్నారు. జాన్వీ పాత్రపై వచ్చిన విమర్శలపై ఆమెకు దర్శకుడు బుచ్చిబాబు సానా తనకు క్షమాపణలు చెప్పడం నచ్చలేదని అన్నారు. "ఓ సినిమాలోని పాత్ర ఎలా ఉండాలన్నది దర్శకుడి ఇష్టం. తమ ఊహలకు అనుగుణంగా పాత్రలను డైరెక్టర్లకు క్రియేట్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో విమర్శలు చేసిన కొందరు తమ అభిప్రాయాలను ఇతరులపై రుద్దడంతోనే ఈ వివాదం తలెత్తింది. ఇలాంటి విమర్శలు దర్శకుల సృజనాత్మకత తగ్గి డాక్యుమెంటరీలు తప్ప కమర్షియల్ సినిమాలు రావు. హీరోయిన్‌కు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పడం నాకైతే నచ్చలేదు" అని అనంత శ్రీరామ్ అన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tollywood Heroine | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ – ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
జూన్ 15, 2026

Trisha | జననాయగన్ డైరెక్టర్‌తో త్రిష మూవీ – షూటింగ్ పూర్తయిన పన్నెండేళ్ల తర్వాత థియేటర్లలో రిలీజ్
జూన్ 15, 2026

Vijay Deverakonda | క్రికెటర్‌గా మారిన విజయ్ దేవరకొండ – డెబ్యూ మ్యాచ్‌లోనే సెంచరీ – సిక్సర్లు, ఫోర్లతో వీరవిహారం
జూన్ 15, 2026
తాజావార్తలు
- ●Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం
- ●DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్
- ●CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
- ●Tollywood Heroine | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ - ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
- ●Malisetti Dancing Daffodils | ఘట్కేసర్లో ఆకాశహర్మ్యం: 72 అంతస్తులతో హైదరాబాద్‌కే ల్యాండ్‌మార్క్‌గా 'డ్యాన్సింగ్ డాఫోడిల్స్'!

Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం

DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి



