Oscars | ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ అయిన జాన్వీకపూర్ బాలీవుడ్ మూవీ
Oscars | బాలీవుడ్ (Bollywood)మూవీ హోమ్‌బౌండ్ ఆస్కార్ (Oscars) దిశగా మరో ముందడుగు వేసింది. అకాడమీ కమిటీ షార్ట్ లిస్ట్ చేసిన టాప్ 15 సినిమాల్లో చోటు దక్కించుకుంది. ఈషాన్ కట్టర్, విశాల్ జెత్వా, జాన్వీకపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ బాలీవుడ్ మూవీని కరణ్ జోహార్ నిర్మించారు.
Entertainment | Published On Dec 17, 2025, 4.32 pm IST
janhvi kapoor
Oscars | బాలీవుడ్ మూవీ హోమ్‌బౌండ్ ఆస్కార్‌కు (Oscars) షార్ట్‌లిస్ట్ అయ్యింది. 98వ ఆస్కార్ అవార్డుల కోసం ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా హోమ్‌బౌండ్ ఎంపికైన సంగతి తెలిసింది. మొత్తం 29 సినిమాలు ఆస్కార్ పరిశీలనకు రాగా వీటిలో నుంచి హోమ్ బౌండ్‌ను జ్యూరీ మెంబర్స్ సెలెక్ట్ చేశారు. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఈ బాలీవుడ్ మూవీ ఆస్కార్ బరిలో నిలిచింది. తాజాగా వివిధ దేశాల వచ్చిన ఎంట్రీల నుంచి టాప్ పదిహేను సినిమాలను అకాడమీ కమిటీ షార్ట్ లిస్ట్ చేసింది. ఈ లిస్ట్‌లో హౌమ్ బౌండ్ స్థానం దక్కించుకుంది. ఈ షార్ట్ లిస్ట్‌తో ఆస్కార్ దిశగా హోమ్‌బౌండ్ మరో ముందడుగు వేసింది. ఈ పదిహేను సినిమాలను మరోసారి షార్ట్ లిస్ట్ చేసి ఐదు సినిమాలను తుది నామినేషన్‌కు సెలెక్ట్ చేస్తారు. జనవరి 22న ఫైనల్ షార్ట్ లిస్ట్‌ను అనౌన్స్‌చేయనున్నారు. ఫైనల్ నామినేషన్స్‌లో హోమ్‌బౌండ్‌కు స్థానం దక్కుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
హౌమ్‌బౌండ్ ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ కావడంతో నిర్మాత కరణ్ జోహార్ ఆనందం వ్యక్తం చేశారు. షార్ట్ లిస్ట్ అయిన సినిమాల జాబితాను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌కు గర్వకారణంగా హౌమ్‌బౌండ్ మూవీ నిలిచిందని అన్నారు. "హౌమ్‌బౌండ్ సినిమాకు సంబంధించి మేము కన్న కలలన్నింటిని నీరజ్ గైవాన్ నిజం చేశారు. కేన్స్ నుంచి ఆస్కార్ షార్ట్‌లిస్ట్ వరకు సినిమా చేరుకోవడం ఆనందంగా ఉంది. మా అందరి కెరీర్‌లో ఇదొక స్పెషల్ ఫిల్మ్" అంటూ పేర్కొన్నారు.
హౌమ్‌బౌండ్ మూవీకి నీరజ్ గైవాన్ దర్శకత్వం వహించారు. ఇందులో ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా, జాన్వీకపూర్ (Janhvi Kapoor) కీలక పాత్రలు పోషించారు. కరణ్ జోహార్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. సెప్టెంబర్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ కమర్షియల్‌గా మాత్రం నిర్మాత కరణ్ జోహార్‌కు నష్టాలను తెచ్చిపెట్టింది. కాన్సెప్ట్, హీరోల యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కాయి. కొవిడ్ కష్టాలకు ఓ ఇద్దరి స్నేహితుల జీవితాలు, కుల వివక్ష కారణంగా వారికి ఎదురైన అవమానాల నేపథ్యంలో డైరెక్టర్ నీరజ్ గైవాన్ హోమ్‌బౌండ్ మూవీని రూపొందించారు.
హోమ్‌బౌండ్ కథ ఇదే...
చందన్ కుమార్ (విశాల్ జెత్వా), మహ్మద్ షోయబ్ (ఇషాన్ కట్టర్) ప్రాణ స్నేహితులు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కంటుంటారు. కుటుంబ పరిస్థితుల కారణంగా షోయబ్ ఓ కంపెనీలో ఆఫీస్ బాయ్‌గా చేరుతాడు. డిగ్రీ చదవాలని అనుకున్న చందన్ కూడా షోయబ్ పనిచేసిన కంపెనీలో ఎందుకు పనిచేయాల్సివచ్చింది? కొవిడ్ కారణంగా ఇద్దరు స్నేహితులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? భారతితో చందన్ ప్రేమకథ ఏ విధమైన అడ్డంకులు ఎదురయ్యాయి అన్నది హౌమ్‌బౌండ్‌లో ఎమోషనల్‌గా డైరెక్టర్ ఆవిష్కరించారు.
సంబంధిత వార్తలు

Janhvi Kapoor | పల్లెటూరు అమ్మాయిలంటే చిన్నచూపా? – పెద్దిలో జాన్వీ రోల్‌పై నెటిజన్ల ఫైర్
మే 19, 2026

Janhvi Kapoor | కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్న జాన్వీ కపూర్ – స్టార్ హీరో తనయుడికి జోడీగా
మే 19, 2026

Ananya Panday | అనన్య పాండే రొమాంటిక్ మూవీలో ఘాటు లిప్‌లాక్‌లు – అభ్యంతరం చెప్పిన సెన్సార్
మే 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



