Jana Nayagan | రిలీజ్‌కు ముందే కోటి మంది చూశారట – లీకుల్లో జననాయగన్ రికార్డ్
దళపతి విజయ్ జననాయగన్ మూవీ రిలీజ్‌కు ముందే లీకైంది. ఫుల్ సినిమా పైరసీ సైట్స్‌లో దర్శనమివ్వడం కోలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. కాగా జననాయగన్ లీక్‌డ్ వెర్షన్‌ను కోటి మంది చూశారట. అత్యధిక మంది వీక్షించిన లీక్‌డ్ మూవీగా జననాయగన్ రికార్డ్ క్రియేట్ చేసినట్లు చెబుతోన్నారు.
Entertainment | Published On Jul 2, 2026, 7.17 pm IST
Jana Nayagan | దళపతి విజయ్ జననాయగన్ మూవీ లీక్‌డ్ వెర్షన్ రికార్డ్ క్రియేట్ చేసింది. స్టార్ హీరో సినిమాకు వచ్చే ఫుట్‌ఫాల్ కంటే ఎక్కువగా ఈ లీక్‌డ్ వెర్షన్‌ను పైరసీ సైట్స్‌లో చూశారట. దళపతి విజయ్ చివరి సినిమాగా రూపొందిన జననాయగన్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ సెన్సార్ పరమైన ఇబ్బందుల వల్ల వాయిదాపడింది. ఇందులోని పొలిటికల్ డైలాగ్స్, హింసాత్మక సన్నివేశాలపై సీబీఎఫ్‌సీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. సెన్సార్‌పై నిర్మాత సుప్రీంకోర్టులో కేసు వేశాడు. గత ఆరేడు నెలలుగా సెన్సార్ బోర్డుతో పోరాటం చేస్తూనే ఉన్నారు.
12 మిలియన్ల వ్యూస్...
రిలీజ్‌కు ముందే జననాయగన్ లీక్ కావడం కోలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. ఎడిటింగ్ వెర్షన్ తాలూకు ఫుటేజ్ మొత్తం ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చింది. ఈ లీక్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. కాగా ఈ లీక్‌డ్ వెర్షన్‌ను ఇప్పటివరకు 12 మిలియన్ల మంది చూశారట. దళపతి విజయ్ గత మూవీ గోట్‌ను థియేటర్లలో చూసిన మొత్తం ఆడియెన్స్ సంఖ్య కంటే జననాయగన్ లీక్ వెర్షన్ చూసిన వారే ఎక్కువట. అత్యధిక మంది వీక్షించిన లీక్‌డ్ మూవీగా రిలీజ్‌కు ముందే జననాయగన్ రికార్డ్ క్రియేట్ చేసిందని నెటిజన్లు కామెంట్లు పెడుతోన్నారు.
జూలైలో...
జననాయగన్ రిలీజ్‌కు సంబంధించిన అడ్డంకులు దాదాపు క్లియర్ అయినట్లు సమాచారం. ఈ వారంలోనే సెన్సార్ సర్టిఫికెట్ వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. యాక్షన్, వయలెన్స్ అంశాలు ఎక్కువగా ఉండటంతో ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ నిర్ణయించుకుందట.
భగవతి తర్వాత దాదాపు ఇరవై నాలుగేళ్ల అనంతరం ఏ సర్టిఫికెట్‌తో రిలీజ్ కానున్న మూవీగా జననాయగన్ నిలవనుందని అంటున్నారు. జూలై 16 లేదా 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని అంటున్నారు.
పూజా హెగ్డే....
జననాయగన్‌లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. మమితా బైజు కీలక పాత్ర పోషించింది. హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన భగవంత్ కేసరి జననాయగన్ రూపొందింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Hero Arya | తమిళ హీరో ఆర్యపై హైదరాబాద్‌లో చీటింగ్ కేసు
జులై 12, 2026

Naga Durga | నాగదుర్గ తమిళ డెబ్యూ మూవీకి షాకింగ్ కలెక్షన్స్ – 10 కోట్ల బడ్జెట్‌తో తీస్తే 15 లక్షలు వచ్చాయి!
జులై 11, 2026

Ntr Vs Dhanush | ఎన్టీఆర్‌కు ధనుష్ కౌంటర్ – గాడ్ ఆఫ్ వార్‌కు పోటీగా మైథాలజీ మూవీ అనౌన్స్ – ట్రోల్ చేస్తోన్న ఫ్యాన్స్
జులై 11, 2026
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం



