Telugu Serials | ఫిబ్రవరిలో లాంఛ్ కానున్న తెలుగు సీరియల్స్ ఇవే – ఈటీవీలో రెండు..జీ తెలుగులో ఒకటి
ఫిబ్రవరి నెలలో కొన్ని కొత్త తెలుగు సీరియల్స్ బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈటీవీ, జీ తెలుగుతో పాటు జెమినిలో టెలికాస్ట్ కానున్న ఈ సీరియల్స్ ఏవంటే?
Entertainment | Published On Jan 28, 2026, 8.08 pm IST
Telugu Serials | సినిమాల మాదిరిగానే టీవీ సీరియల్స్ మధ్య పోటీ ఎక్కువే ఉంటుంది. సీరియల్స్‌కు టార్గెట్ ఫ్యామిలీ ఆడియెన్స్ కావడంతో వారిని ఆకట్టుకోవడానికి మేకర్స్ రకరకాల ఎత్తులు వేస్తుంటారు. ఓ సీరియల్ టీఆర్‌పీ ఏ మాత్రం డౌన్ అయినా దానికి ఎండ్ కార్డ్ వేసి కొత్త సీరియల్స్‌ను ప్రారంభిస్తుంటారు. ప్రస్తుతం టీఆర్‌పీ తక్కువగా ఉన్న సీరియల్స్ స్థానంలో త్వరలోనే మరికొన్ని కొత్త సీరియల్స్ బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈటీవీ, జీ తెలుగుతో పాటు ఇతర చానెల్స్‌లో టెలికాస్ట్ కానున్న ఆ సీరియల్స్ ఏవంటే?
జానకి పరిణయం
జానకి పరిణయం పేరుతో ఈటీవీ కొత్త సీరియల్‌ను లాంఛ్ చేయబోతుంది. ఇందులో పల్లవి రామిశెట్టి, సిద్ధార్థ్ వర్మ, విష్ణుప్రియ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు సాయంత్రం ఆరు గంటలకు జానకి పరిణయం సీరియల్‌ను చూడొచ్చని మేకర్స్ ప్రకటించారు. కలిసుందారం రాను ముగించి ఈ సీరియల్ ప్లేస్‌లో జానకి పరిణయాన్ని టెలికాస్ట్ చేయబోతున్నారు.
అమ్మోరు...
జానకి పరిణయంతో పాటు అమ్మోరు సీరియల్ కూడా ఈటీవీ ద్వారా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సీరియల్ కూడా ఫిబ్రవరి 2 నుంచే టెలికాస్ట్ కానున్నట్లు సమాచారం. సౌందర్య హీరోయిన్‌గా నటించిన అమ్మోరు మూవీకి సీక్వెల్‌గా ఈ కొత్త సీరియల్ రాబోతున్నట్లు సమాచారం.
మంచి కుటుంబం...
మంచి కుటుంబం పేరుతో సరికొత్త సీరియల్ జెమినీ టీవీలో సందడి చేయబోతుంది. ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఈ సీరియల్ ప్రసారం కానున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ సీరియల్ షూటింగ్ మొదలైంది.
రుణానుబంధం...
రుణానుబంధం పేరుతో జీ తెలుగు ఓ కొత్త సీరియల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఈ సీరియల్ ప్రోమోను ఇటీవల రిలీజ్ చేశారు. ఇందులో రఘు, అనాఘ గౌడ లీడ్ రోల్స్‌లో నటించనున్నారు. ఈ సీరియల్ టెలికాస్ట్ డేట్ మాత్రం రివీల్ కాలేదు.
సంబంధిత వార్తలు

Suma Kanakala | యాంకర్ సుమకు షాక్ – సడెన్‌గా ఆగిపోయిన తెలుగు టాక్ షో
ఏప్రిల్ 11, 2026

Star Maa Serials | స్టార్ మా టాప్ ఫైవ్ సీరియల్స్ ఇవే – కార్తీక దీపం 2కు పోటీ లేదు – బ్రహ్మముడి కమ్‌బ్యాక్
ఫిబ్రవరి 20, 2026

Telugu Serial | జీ తెలుగులో మరో కొత్త సీరియల్ – ఈ వీక్‌లోనే ప్రారంభం – టైటిల్ ఇదే
జనవరి 23, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



