త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vinod Kumar | అమీర్‌పేట‌లో ఎన్టీఆర్ విగ్ర‌హానికి అనుమ‌తి ఉందా..? : మాజీ ఎంపీ వినోద్

Vinod Kumar | ఎలాంటి అనుమ‌తి లేకుండా పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారంటున్న ప్ర‌భుత్వ అధికారులను, కాంగ్రెస్ నేత‌ల‌ను బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ సూటిగా ప్ర‌శ్నించారు. అమీర్‌పేట‌లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్క‌రించిన ఎన్టీఆర్ విగ్ర‌హానికి అనుమ‌తి ఉందా..? అని వినోద్ కుమార్ నిల‌దీశారు.

S

Telangana | Published On Aug 18, 2026, 1.44 pm IST

Vinod Kumar | అమీర్‌పేట‌లో ఎన్టీఆర్ విగ్ర‌హానికి అనుమ‌తి ఉందా..? : మాజీ ఎంపీ వినోద్
Advertisement

Vinod Kumar | ఎలాంటి అనుమ‌తి లేకుండా పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారంటున్న ప్ర‌భుత్వ అధికారులను, కాంగ్రెస్ నేత‌ల‌ను బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ సూటిగా ప్ర‌శ్నించారు. అమీర్‌పేట‌లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్క‌రించిన ఎన్టీఆర్ విగ్ర‌హానికి అనుమ‌తి ఉందా..? అని వినోద్ కుమార్ నిల‌దీశారు. న‌ర్సంపేట‌లో పెద్ది విగ్ర‌హాన్ని కూల్చ‌డాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

తెలంగాణ భ‌వ‌న్‌లో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక విగ్ర‌హాలు రోడ్ల మ‌ధ్య‌లో ఉన్నాయి. మ‌రి వాటిని కూల్చారా..? మెడికల్ కాలేజీకి దగర్లో ప్రైవేటు స్థలంలో పెద్ది విగ్రహం ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి ఇబ్బందేమిటి? దొంతి మాధవ రెడ్డి ప్రోద్భలంతోనే విగ్రహ కూల్చివేత జరిగింది. 1500 మంది పోలీసుల‌తో మా నేత‌ల‌ను అరెస్టు చేసి.. పెద్ది విగ్ర‌హాన్ని కూల్చివేశారు. అసైన్డ్ ల్యాండ్‌లో విగ్రహం ఉందని, అందుకే కూల్చామ‌ని అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ భూమిలో ఉన్న విగ్రహాన్ని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చే అధికారం మీకు ఎవరిచ్చారు? పెద్ది మ‌ర‌ణించి నెల రోజులు కాక‌ముందే విగ్ర‌హాన్ని కూల్చ‌డం దారుణం అని వినోద్ కుమార్ మండిప‌డ్డారు.

నర్సంపేట‌ను మళ్ళీ హింసాత్మక రాజకీయాల వైపు మళ్లించవద్దు

అనవసరంగా కలెక్టర్, సీపీ నర్సంపేట ప్రజలతో గోక్కున్నారు. నర్సంపేట ప్రజలు చైతన్యవంతులు. అన్యాయాన్ని సహించరు. ఒక‌ప్పుడు నర్సంపేట హింసాత్మక ప్రాంతం. పెద్ది వచ్చాకే నియోజకవర్గంలో శాంతి నెలకొంది. నర్సంపేట‌ను మళ్ళీ హింసాత్మక రాజకీయాల వైపు మళ్లించవద్దు. దొంతి మాధవ రెడ్డిపై ఇప్పటికే హత్య కేసులు ఉన్నాయి. సీఎంను కూడా తన నియోజక వర్గానికి రానివ్వలేదు. మాధవ రెడ్డి తన పద్ధతి మార్చుకుని పెద్ది విగ్రహాన్ని మళ్లీ ఏర్పాటు చేసేలా చొరవ చూపితే మంచిది అని వినోద్ కుమార్ అన్నారు.

ఉద్యమకారుల సంక్షేమ కమిటీని ఉత్త కమిటీగానే భావించాల్సి ఉంటుంది

సీపీ కూడా సుమోటోగా విగ్రహ ఏర్పాటుకు అనుమతినిచ్చి 24 గంటల్లో అక్కడే నెలకొల్పాలి. అధికారులు స్పందించకపోతే మా కార్యాచరణ ప్రకటిస్తాం. ఉద్యమకారుల సంక్షేమ కమిటీ కేశవ రావు, కోదండరాంలు స్పందించి పెద్ది విగ్రహం మళ్ళీ ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలి. పెద్ది విగ్రహ ఏర్పాటుకు కృషి చేయకపోతే ఉద్యమకారుల సంక్షేమ కమిటీని ఉత్త కమిటీగానే భావించాల్సి ఉంటుంది అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement