Jana Nayagan OTT | అఫీషియల్ – ఓటీటీలోకి సీఎం విజయ్ చివరి మూవీ – తెలుగు ఫ్యాన్స్‌కు నిరాశే!
తమిళనాడు సీఎం దళపతి విజయ్ హీరోగా నటించిన చివరి మూవీ జననాయగన్ ఓటీటీ రిలీజ్ డేట్ అధికారికంగా ఖరారైంది. ఆగస్ట్ 21 నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఓటీటీలో కేవలం తమిళంలోనే ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు వెర్షన్‌పై ఎలాంటి అప్‌డేట్ రాలేదు.
Entertainment | Published On Aug 17, 2026, 5.35 pm IST
Jananayagan OTT | తమిళనాడు సీఎం దళపతి విజయ్ హీరోగా నటించిన చివరి మూవీ జననాయగన్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు హెచ్ వినోథ్ దర్శకత్వం వహించాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మమితా బైజు ఓ కీలక పాత్రను పోషించింది. బాలకృష్ణ హీరోగా తెలుగులో నేషనల్ అవార్డును అందుకున్న భగవంత్ కేసరి మూవీకి రీమేక్‌గా జననాయగన్ రూపొందింది.
సెన్సార్ సమస్యల కారణంగా....
ఈ ఏడాది సంక్రాంతికి జననాయగన్ థియేటర్లలో రిలీజ్ కావాల్సింది. కానీ సెన్సార్ సమస్యల కారణంగా వాయిదాపడిన ఈ మూవీ జూలైలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. దళపతి విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిలీజైన మొదటి మూవీ కావడంతో తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో రిలీజైంది. రీమేక్ కథలో దర్శకుడు చేసిన మార్పులు చేర్పులు వర్కవుట్ కాకపోవడంతో జననాయగన్ యావరేజ్‌గా నిలిచింది. మిక్స్‌డ్ టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్ల పరంగా అదరగొట్టింది. 300 కోట్లకుపైగా కలెక్షన్స్‌ను దక్కించుకుంది.
జీ5 ఓటీటీలో...
తాజాగా జననాయగన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అధికారికంగా కన్ఫామ్ అయ్యింది. జీ 5 ఓటీటీలో ఆగస్ట్ 21 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఓ స్పెషల్ వీడియో ద్వారా జీ5 ఓటీటీ సోమవారం ప్రకటించింది. ఓటీటీలో కేవలం తమిళ వెర్షన్ మాత్రమే రిలీజ్ కానున్నట్లు ప్రకటించింది. తెలుగు వెర్షన్‌పై అప్‌డేట్ ఇవ్వకపోవడంతో టాలీవుడ్ ఫ్యాన్స్ డిసపాయింట్ అవుతున్నారు.
పొలిటికల్ ఎంట్రీ....
విజయ్ అభిమానులను మెప్పించేలా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు హెచ్ వినోథ్ జననాయగన్‌ను తెరకెక్కించారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై సినిమాలో డైలాగ్స్, సీన్స్ పెట్టారు. అవన్నీ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇదే తన చివరి మూవీ అంటూ దళపతి విజయ్ ప్రమోషన్స్‌లో ప్రకటించారు.
దళపతి వెట్రి కొండన్...
దళపతి వెట్రి కొండన్ (దళపతి విజయ్) ఓ పోలీస్ ఆఫీసర్. ఓ తప్పుడు కేసులో జైలుశిక్షను అనుభవిస్తుంటాడు. . దళపతిని జైలు నుంచి విడిపించడానికి సాయం చేసిన జైలర్ (గౌతమ్ మీనన్) చనిపోతాడు. అతడి కూతురు విజ్జీ (మమితా బైజు) బాధ్యతను దళపతి చేపడతాడు. జైలర్ కోరిక మేరకు విజ్జీని ఆర్మీలో జాయిన్ చేయాలని అనుకున్నాడు. కానీ విజ్జీ కొన్ని మానసిక సమస్యలతో బాధపడుతుంది. అదే టైమ్‌లో విజ్జీని చంపేందుకు కొంత మంది ప్రయత్నిస్తారు. వారి వెనుక జాన్ హిమ్మర్ (బాబీ డియోల్) అనే వ్యక్తి ఉన్నాడని దళపతికి తెలుస్తుంది. అసలు హిమ్మర్ ఎవరు? దళపతి చేతిలో చనిపోయిన ఆమ్రిష్ పుజారికి (బాడీ డియోల్)అతడికి ఉన్న సంబంధమేమిటి? పోలీస్‌గా ఉన్న దళపతి రాజకీయ నాయకుడు రోజా రంగస్వామి(ప్రకాష్ రాజ్) అవినీతిని ఎలా ఎదురించాడు? అనే అంశాలతో ఈ మూవీ రూపొందింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Pooja Hegde | న్యూయార్క్‌లో పూజా హెగ్డే సందడి – ఇండియా డే పరేడ్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా బుట్టబొమ్మ
ఆగస్టు 17, 2026

Anil Ravipudi | రామాయణం ఆధారంగా అనిల్ రావిపూడి సినిమా – జననాయగన్ మేకర్స్‌తో డీల్
ఆగస్టు 17, 2026

Trisha | తల్లి చీరలో మెరిసిన త్రిష – చెన్నై క్వీన్ కొత్త ఫొటోలపై ఓ లుక్కేయండి!
ఆగస్టు 16, 2026
తాజావార్తలు
- ●Ram Temple Donations Case | రామ మందిరం విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తు వేగవంతం చేయాలి
- ●Oven | ఇంట్లో ఓవెన్‌ను వాడుతున్నారా.. ఈ తప్పులు చేయొద్దు..
- ●Allu Arjun | అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ మూవీ లాంఛ్ అప్పుడేనా? - పాన్ ఇండియన్ రేంజ్లో ఈవెంట్!
- ●UP Judge | యూపీ జడ్జి సంచలనం.. నాలుగు నెలల్లోనే 22 మందికి మరణశిక్ష
- ●TTD | తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్.. రేపే ఆర్జిత సేవల టికెట్ల రిలీజ్..!
- ●BJP New National Team | బీజేపీ కొత్త కార్యవర్గం: తెలంగాణకు బిగ్ షాక్.. ఏపీకి మూడు కీలక పదవులు!

Ram Temple Donations Case | రామ మందిరం విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తు వేగవంతం చేయాలి

Oven | ఇంట్లో ఓవెన్‌ను వాడుతున్నారా.. ఈ తప్పులు చేయొద్దు..

Allu Arjun | అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ మూవీ లాంఛ్ అప్పుడేనా? - పాన్ ఇండియన్ రేంజ్లో ఈవెంట్!

UP Judge | యూపీ జడ్జి సంచలనం.. నాలుగు నెలల్లోనే 22 మందికి మరణశిక్ష



