Pooja Hegde | పూజా హెగ్డేకు సారీ చెప్పిన జననాయగన్ డైరెక్టర్ – కారణమిదే!
బుట్టబొమ్మ పూజా హెగ్డేకు జననాయగన్ డైరెక్టర్ హెచ్ వినోథ్ సారీ చెప్పాడు. సినిమాలో పూజా హెగ్డే రోల్ లెంగ్త్‌పై జననాయగన్ ప్రమోషన్స్‌లో హెచ్ వినోథ్ చేసిన కామెంట్లు వైరల్ అవుతోన్నాయి. తమిళనాడు సీఎం దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ జూలై 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Entertainment | Published On Jul 21, 2026, 12.01 pm IST
Pooja Hegde | తమిళనాడు సీఎం దళపతి విజయ్ హీరోగా నటించిన జననాయగన్ జూలై 23న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ సంక్రాంతికే విడుదల కావాల్సింది. కానీ సెన్సార్ సమస్యల కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. విజయ్ సీఎంగా పదవి చేపట్టిన తర్వాత రిలీజ్ అవుతోన్న మొదటి మూవీ కావడంతో జననాయగన్‌పై తమిళంతో పాటు దక్షిణాది భాషల్లో భారీగా క్రేజ్ నెలకొంది. ఓపెనింగ్స్ పరంగా విజయ్ గత సినిమాల రికార్డులను జననాయగన్ తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.
పూజా హెగ్డేకు సారీ...
జననాయగన్ మూవీలో దళపతి విజయ్‌కి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మమితా బైజు కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి హెచ్ వినోథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న హెచ్ వినోథ్ హీరోయిన్ పూజా హెగ్డేకు సారీ చెప్పాడు. కొన్ని పరిమితుల వల్ల సినిమాలో పూజా హెగ్డే రోల్ లెంగ్త్ తగ్గించాల్సివచ్చిందని అన్నాడు.
జర్నలిస్ట్ రోల్....
జననాయగన్‌లో పూజా హెగ్డే జర్నలిస్ట్ రోల్‌లో నటిస్తుంది. కథ రాసేటప్పుడు ఆమెకు సినిమాలో ఎక్కువ సీన్లు ఉన్నాయి. పూజా హెగ్డే యాక్టింగ్ టాలెంట్‌ను దృష్టిలో పెట్టుకొని కొన్ని ఛాలెంజింగ్ పోర్షన్స్ రాశాం. ఆ సన్నివేశాలు విని పూజా హెగ్డే కూడా చాలా ఎగ్జైట్ అయ్యింది. కానీ సినిమా లెంగ్త్‌తో పాటు కొన్ని నిర్మాణ పరమైన పరిమితుల కారణంగా ఆమె రోల్ లెంగ్త్ చాలా వరకు తగ్గించాల్సివచ్చింది. ముందుకు అనుకున్నదాంట్లో సగం కూడా షూట్ చేయలేకపోయాం. షూట్ చేసిన వాటిలో కొన్ని సన్నివేశాలు కట్ చేయాల్సివచ్చింది. అవన్నీ బాధను కలిగించాయి. కానీ సినిమా కోసం తప్పలేదు. ఆ విషయంలో పూజా హెగ్డేకు సారీ చెబుతున్నా. జననాయగన్‌లో చాలా తక్కువ సీన్లలోనే ఆమె కనిపిస్తుంది అని ప్రమోషన్స్‌లో హెచ్ వినోథ్ చెప్పారు. అతడి కామెంట్లు వైరల్ అవుతోన్నాయి.
బీస్ట్ తర్వాత....
దళపతి విజయ్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో వస్తోన్న సెకండ్ మూవీ ఇది. గతంలో వీరిద్దరు కలిసి బీస్ట్ సినిమాలో జంటగా కనిపించారు. కాగా పూజా హెగ్డే కు మంచి కమర్షియల్ హిట్టు పడి చాలా కాలమే అయ్యింది. బుట్టబొమ్మ నిరీక్షణకు జననాయగన్‌తో పుల్‌స్టాప్ పడటం ఖాయమని అంటున్నారు.
జననాయగన్‌తో పాటు తెలుగులో దుల్కర్ సల్మాన్‌తో శ్రీశ్రీ మూవీ చేస్తోంది పూజా హెగ్డే. ఈ సినిమాతో దాదాపు నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకీ రీఎంట్రీ ఇవ్వబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Thalapathy Vijay | అనిరుధ్, కావ్యమారన్ రిసెప్షన్లో సీఎం విజయ్ ధరించిన సూట్ ఖరీదు ఎన్ని లక్షలంటే?
నవంబర్ 23, 2026

Kollywood | హీరోగా ఉదయనిధి స్టాలిన్ కొడుకు – దళపతి విజయ్ తనయుడికి పోటీగా!
నవంబర్ 19, 2026

Sai Pallavi | ధనుష్ పొలిటికల్ ఎంట్రీ – కన్ఫామ్ చేసిన సాయిపల్లవి – కామెంట్లు వైరల్
నవంబర్ 15, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



