Ranabaali vs Jailer 2 | రజనీకాంత్ వర్సెస్ విజయ్ దేవరకొండ – మూడోసారి బాక్సాఫీస్ క్లాష్
రజనీకాంత్, విజయ్ దేవరకొండ మూడోసారి బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతున్నారు. ఈ దసరాకు జైలర్ 2, రణబాలి సినిమాలు ఒక్క రోజు గ్యాప్‌లో థియేటర్లలోకి రాబోతున్నాయి. గతంలో రెండు సార్లు రజనీకాంత్ క్రేజ్‌ను తట్టుకొని విజయ్ దేవరకొండ విజయాలను అందుకున్నారు. మూడోసారి ఆ సెంటిమెంట్ రిపీట్ చేస్తాడా? జైలర్ 2కు రణబాలి ఏ మాత్రం పోటీ ఇస్తుందన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
Entertainment | Published On Oct 12, 2026, 7.55 pm IST
Ranabaali vs Jailer 2 | ఈ దసరాకు రజనీకాంత్ జైలర్ 2తో పాటు విజయ్ దేవరకొండ రణబాలి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒక్క రోజు గ్యాప్‌లో థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. జైలర్ 2 అక్టోబర్ 15న రిలీజ్ అవుతోండగా...రణబాలి అక్టోబర్ 16న విడుదల కాబోతుంది.
పాన్ ఇండియన్ స్టార్స్...
ఈ రెండు పాన్ ఇండియన్ సినిమాల్లో రణబాలితో పోలిస్తే జైలర్ 2పైనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ తమిళ సినిమాలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, హృతిక్ రోషన్ వంటి స్టార్స్‌తో పాటు పలువురు బాలీవుడ్, దక్షిణాది యాక్టర్లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. పార్ట్ వన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడంతో సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. జైలర్‌కు కొనసాగింపుగానే దర్శకుడు నెల్సన్ ఈ సినిమాను రూపొందిస్తోన్నారు.
బ్రిటీషర్లను ఎదురించి...
రణబాలి మూవీ హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. స్వాతంత్య్రానికి పూర్వం రాయలసీమ ప్రాంతంలో బ్రిటీషర్లు సాగించిన అకృత్యాలను ఎదురించి పోరాడిన రణబాలి అనే యోధుడి కథతో డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. పెళ్లి తర్వాత విజయ్, రష్మిక కాంబినేషన్‌లో వస్తోన్న ఫస్ట్ మూవీ ఇది. తమకున్న పాన్ ఇండియన్ క్రేజ్‌తో ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు ఈ జోడీ.
కబాలి వర్సెస్ పెళ్లిచూపులు...
రజనీకాంత్, విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద పోటీపడనుండటం ఇది మూడోసారి. ఫస్ట్ టైమ్ 2016లో కబాలి...పెళ్లి చూపులు వారం గ్యాప్‌లో థియేటర్లలోకి వచ్చాయి. ఇందులో పెళ్లిచూపులు ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజై బ్లాక్‌బస్టర్ అయ్యింది. కబాలి మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్ కారణంగా కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి.
టాక్సీవాలా...
రెండేళ్ల తర్వాత రజనీకాంత్ 2.0...విజయ్ దేవరకొండ టాక్సీవాలా పది రోజుల గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చాయి. రెండోసారి కూడా విజయ్‌నే లక్ వరించింది. టాక్సీవాలా కమర్షియల్ హిట్‌గా నిలవగా... 2.0 డిజాస్టర్ టాక్‌ను మూటగట్టుకుంది.
మూడోసారి...
మూడోసారి పోరులో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. గత సెంటిమెంట్‌ను విజయ్ దేవరకొండ రిపీట్ చేస్తాడా? జైలర్ 2 క్రేజ్‌ను తట్టుకొని బాక్సాఫీస్ వద్ద విరోష్ జోడీ ఎంత వరకు నిలబడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Nandamuri Tejaswini | చిరంజీవి కాకాలో బాలకృష్ణ కూతురు – మలయాళ హీరోయిన్ ప్లేస్‌లో…
అక్టోబర్ 12, 2026

Keerthy Suresh | పన్నెండేళ్ల తర్వాత ఊటీలో కీర్తి సురేష్ సినిమా షూటింగ్ – వెంకటేష్‌తో రొమాంటిక్ డ్యూయెట్
అక్టోబర్ 12, 2026

Kobali Lyrical Song Release | గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ – ‘కోబలి’ సాంగ్ వచ్చేసింది
అక్టోబర్ 11, 2026
తాజావార్తలు
- ●Harish Rao Father in Law | హరీష్‌రావు మామకు హైకోర్టులో ఊరట: బలవంతంగా ఖాళీ చేయించొద్దు
- ●Terrorists Killed | ఎల్ఓసీ దాటే యత్నం.. ల్యాండ్‌మైన్ పేలి నలుగురు ఉగ్రవాదులు హతం!
- ●Bhagyashri Borse | అల్ట్రా మోడ్రన్ లుక్‌లో భాగ్యశ్రీ బోర్సే
- ●Retail Inflation | కూరగాయల మంట.. ద్రవ్యోల్బణం బాదుడు!
- ●No relief for PepsiCo | పెప్సీకోకు హైకోర్టులో దక్కని ఊరట.. కొత్త ఉత్పత్తులపై ఆంక్షలు యథాతథం
- ●Vijayawada EV Car Fire Accident | డివైడర్‌ను ఢీకొట్టి మంటలు చెలరేగి ఎలక్ట్రిక్ కారు దగ్ధం.. చిన్నారితో సహా నలుగురు సజీవదహనం

Harish Rao Father in Law | హరీష్‌రావు మామకు హైకోర్టులో ఊరట: బలవంతంగా ఖాళీ చేయించొద్దు

Terrorists Killed | ఎల్ఓసీ దాటే యత్నం.. ల్యాండ్‌మైన్ పేలి నలుగురు ఉగ్రవాదులు హతం!

Bhagyashri Borse | అల్ట్రా మోడ్రన్ లుక్‌లో భాగ్యశ్రీ బోర్సే

Retail Inflation | కూరగాయల మంట.. ద్రవ్యోల్బణం బాదుడు!



