త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jabardasth Comedian | పెళ్లి చేసుకున్న జ‌బ‌ర్ధ‌స్థ్‌ క‌మెడియ‌న్ – వీడియో వైర‌ల్‌

జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ ప‌టాస్ ప్ర‌వీణ్ పెళ్లి చేసుకున్నారు. సింగ‌ర్ వంశిత‌తో ప్ర‌వీణ్ పెళ్లి శ‌నివారం జ‌రిగింది. ప్ర‌వీణ్, వంశిత‌ పెళ్లి వేడుక తాలూకు వీడియోను ఫైమా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

N

Entertainment | Published On May 9, 2026, 6.54 pm IST

Jabardasth Comedian | పెళ్లి చేసుకున్న జ‌బ‌ర్ధ‌స్థ్‌ క‌మెడియ‌న్  – వీడియో వైర‌ల్‌
Advertisement

Jabardasth Comedian | జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ ప‌టాస్ ప్ర‌వీణ్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. సింగ‌ర్ క‌డెం వంశిత‌తో ప‌టాస్ ప్ర‌వీణ్ పెళ్లి శ‌నివారం జ‌రిగింది. ప‌టాస్ ప్ర‌వీణ్, వంశిత పెళ్లి వేడుక‌ల తాలూకు వీడియోను జ‌బ‌ర్ధ‌స్థ్ ఫైమా సోష‌ల్ మీడియా పోస్ట్ చేసింది. గ‌త కొన్నాళ్లుగా వంశిత‌తో ప‌టాస్ ప్ర‌వీణ్ ప్రేమ‌లో ఉన్నాడ‌ట‌. పెద్ద‌ల అంగీకారంతో ఈ జంట పెళ్లిపీట‌లు ఎక్కిన‌ట్లు స‌మాచారం. ఇటీవ‌లే వీరి ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు ప్ర‌వీణ్‌. సింగ‌ర్ అయిన క‌డెం వంశిత ప‌లు ఫోక్ సాంగ్స్ ను ఆల‌పించింది. కొన్నింటిలో న‌టించింది.

ప‌టాస్ షోతో...

ప‌టాస్ షోతో ప్ర‌వీణ్ జ‌ర్నీ మొద‌లైంది. ఈ షోలో త‌న కామెడీ పంచ్‌లు, మ్యాన‌రిజ‌మ్స్‌తో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు. ప‌టాస్‌తో వ‌చ్చిన గుర్తింపుతో జ‌బ‌ర్ధ‌స్థ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్థ్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫైమాతో క‌లిసి ప‌టాస్ ప్ర‌వీణ్ చేసిన కొన్ని స్కిట్స్ పాపుల‌ర్ అయ్యాయి.
ఈ స్కిట్స్‌లో వీరిద్ద‌రి క్లోజ్‌నెస్‌, బాండింగ్ కూడా నెటిజ‌న్ల దృష్టిని ఆక‌ర్షించింది. ఫైమా, ప్ర‌వీణ్ ప్రేమ‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం కూడా జ‌రిగింది. బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 6లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్న‌ది ఫైమా. బిగ్‌బాస్ త‌ర్వాత ఫైమ్ క్రేజ్ పెరిగింది. ఆ త‌ర్వాతే ప్ర‌వీణ్‌ను ఆమె దూరం పెట్టిన‌ట్లు వార్త‌లొచ్చాయి.

 

View this post on Instagram

 

A post shared by FAIMA (@faima_patas)

Advertisement
Advertisement