త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jabardasth Komarakka | జబర్దస్త్ కమెడియన్ కొమురక్కపై దాడి…అభిమానులమని నమ్మించి…

జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ కొముర‌క్క దండుగుల దాడిలో గాయ‌ప‌డ్డారు. అభిమానుల మంటూ మంగ‌ళ‌వారం రాత్రి కొముర‌క్క ఇంటికి కొంత మంది వ‌చ్చారు. పాత క‌క్ష‌ల‌తో అత‌డిపై దాడికి పాల్ప‌డ్డట్లూ తెలిసింది. మ‌హబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాలలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

N

Entertainment | Published On Apr 2, 2026, 10.19 am IST

Jabardasth Komarakka | జబర్దస్త్ కమెడియన్ కొమురక్కపై దాడి…అభిమానులమని నమ్మించి…
Advertisement

Jabardasth Komarakka | జ‌బ‌ర్ద‌స్థ్ క‌మెడియ‌న్ కొముర‌క్క అలియాస్ కుమార్ దుండ‌గుల దాడిలో గాయ‌ప‌డ్డారు. అభిమానుల‌మ‌ని న‌మ్మించి ఫొటో దిగ‌డానికి వ‌చ్చామ‌ని చెబుతూ కుమార్‌పై అత‌డి ఇంట్లోనే కొంత‌మంది దాడిచేశారు. దుండ‌గుల ఎటాక్‌లో కొముర‌క్క కుడి చేతికి గాయాలు అయిన‌ట్లు తెలిసింది. ఈ ఘ‌ట‌న‌లో కొముర‌క్క సోద‌రుడు యాద‌య్య కూడా గాయ‌ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడి ఘ‌ట‌న‌కు సంబంధించి ఎనిమిది మంది నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్ర‌స్తుతం కొమురక్క హాస్పిట‌ల్‌లో చికిత్స‌ను పొందుతున్నార‌ని, అత‌డి ప్రాణాల‌కు ప్ర‌మాద‌మేమి లేద‌ని డాక్ట‌ర్లు తెలిపారు.

దొంగ‌త‌నమే దాడికి కార‌ణ‌మా...

గ‌తంలో కొముర‌క్క ఇంట్లో బంగారం చోరీ అయ్యింది. కొముర‌క్క వ‌ద్ద అసిస్టెంట్‌గా ప‌నిచేసిన శ్రీనాథ్ బంగారాన్ని దొంగిలించాడ‌ని స‌మాచారం. ఈ బంగారం విష‌యంపై కొముర‌క్క‌తో పాటు అత‌డి కుటుంబ‌స‌భ్యులు శ్రీనాథ్‌ను నిల‌దీశారు. దానిని మ‌న‌సులో పెట్టుకొని క‌క్ష‌తోనే కొముర‌క్క‌పై మ‌హబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాలలోని అత‌డి ఇంట్లోనే త‌న అనుచ‌రుల‌తో క‌లిసి  శ్రీనాథ్‌ దాడిచేయించిన‌ట్లుగా తెలిసింది. మంగ‌ళ‌వారం రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు చెబుతున్నారు.

జ‌బ‌ర్ధ‌స్థ్‌తో ఫేమ‌స్‌...

జ‌బ‌ర్ధ‌స్థ్‌లో కొముర‌క్క క్యారెక్ట‌ర్‌తో ఫేమ‌స్ అయ్యాడు. మాకు ప‌శువులంటే ప్రాణం అంటూ ఓ స్కిట్‌లో అత‌డు చెప్పిన డైలాగ్ పాపుల‌ర్ అయ్యింది. జ‌బ‌ర్ధ‌స్థ్ కంటే ముందు ఓ హోట‌ల్‌లో క్లీన‌ర్‌గా కుమార్ ప‌నిచేశాడు.

 

Advertisement
Advertisement