Jabardasth Faima | ప్రియుడిని రెండు సార్లు పెళ్లాడిన జబర్ధస్థ్ కమెడియన్ – నిన్న అలా…నేడు ఇలా
జబర్ధస్థ్ కమెడియన్ పటాస్ ఫైమా పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు ప్రవీణ్ నాయక్‌తో ఏడడుగులు వేసింది. బుధవారం రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్న ఈ జంట ...గురువారం హిందూ సంప్రదాయ పద్దతిలో మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఫైమా, ప్రవీణ్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
Entertainment | Published On Jun 25, 2026, 5.31 pm IST
Jabardasth Faima | జబర్ధస్థ్ కమెడియన్ పటాస్ ఫైమా పెళ్లి చేసుకుంది. ప్రియుడు ప్రవీణ్ నాయక్‌తో ఏడడుగులు వేసింది. ప్రవీణ్ నాయక్‌తో తొమ్మిదేళ్లుగా ఫైమా ప్రేమలో ఉందట. ఇద్దరి మతాలు వేర్వేరు కావడంతో వీరి పెళ్లికి కుటుంబసభ్యులు అభ్యంతరం చెప్పారట. జూన్ 24న బుధవారం రిజిస్టర్ ఆఫీస్‌లో ఫైమా, ప్రవీణ్ నాయక్ పూల దండలు మార్చుకొని సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. నిరాడంబరంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో ఇద్దరి కుటుంబసభ్యులు కనిపించలేదు. కేవలం కొంతమంది సన్నిహితులు సమక్షంలోనే పెళ్లిపీటలెక్కారు.
ఫైనల్లీ...
గురువారం మరోసారి ఫైమా, ప్రవీణ్ పెళ్లి జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ జంట ఒక్కటయ్యారు. ఫైమా మెడలో ప్రవీణ్ నాయక్ మూడుముళ్లు వేశాడు. ఈ వీడియోను ఫైమా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఫైనల్లీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. హల్దీ తో పాటు పెళ్లి వేడుకల తాలూకు ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు కొత్త జంట. ఫైమాకు జబర్ధస్థ్ కమెడియన్లతో పాటు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
బిగ్‌బాస్ సీజన్ 6
జబర్ధస్థ్ తో ఫైమా కెరీర్ మొదలైంది. ఆ తర్వాత బిగ్‌బాస్ సీజన్ 6లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఫైమా ఫైనల్ వరకు చేరుకుంది. కానీ విన్నర్‌గా నిలవలేకపోయింది. ప్రవీణ్ నాయక్ డైరెక్టర్‌గా అప్సరతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు చేశాడు.
View this post on Instagram
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Inter-State Water Disputes India | తుంగభద్ర వద్ద సీఎంల భేటీ.. కరచాలనాల వెనుక దాగిన 30 జల వివాదాలివే!
- ●Raashii Khanna | పదమూడేళ్ల కల నిజమైన వేళ - రాశీఖన్నాకు ఊహించని ఛాన్స్!
- ●Morocco Vs Haiti | 52 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్‌లో గోల్స్.. మొరాకోకు చుక్కలు చూపించిన హైతీ, కానీ నాకౌట్‌కు ఎవరంటే?
- ●Banganapalle Mango | సింగపూర్‌కు సముద్ర మార్గంలో తొలి బంగినపల్లి మామిడి ఎగుమతి
- ●Brazil vs Scotland | స్కాట్లాండ్పై బ్రెజిల్ పంజా.. వినీసియస్ డబుల్ ధమాకా, 981 రోజుల తర్వాత మళ్లీ మైదానంలోకి నెయ్మర్
- ●OnePlus Nord Buds 4 | వన్‌ప్లస్ నుంచి నార్డ్ బడ్స్ 4 ఇయర్‌బడ్స్.. ఏఐ అసిస్టెంట్‌తో.. ధర తక్కువే..

Inter-State Water Disputes India | తుంగభద్ర వద్ద సీఎంల భేటీ.. కరచాలనాల వెనుక దాగిన 30 జల వివాదాలివే!

Raashii Khanna | పదమూడేళ్ల కల నిజమైన వేళ - రాశీఖన్నాకు ఊహించని ఛాన్స్!

Morocco Vs Haiti | 52 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్‌లో గోల్స్.. మొరాకోకు చుక్కలు చూపించిన హైతీ, కానీ నాకౌట్‌కు ఎవరంటే?

Banganapalle Mango | సింగపూర్‌కు సముద్ర మార్గంలో తొలి బంగినపల్లి మామిడి ఎగుమతి






