Jabardasth Rohini | కష్టపడిన వాల్యూ ఉండదు – బిగ్‌బాస్‌పై మాజీ కంటెస్టెంట్ ఆరోపణలు
Jabardasth Rohini | బిగ్‌బాస్‌పై మాజీ కంటెస్టెంట్ జబర్ధస్థ్ రోహిణి (Jabardasth Rohini,) తీవ్ర ఆరోపణలు చేసింది. బిగ్‌బాస్‌లో కష్టపడిన వాల్యూ ఉండదని, అందుకు తగ్గ రిజల్ట్ రాదని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. రోహిణి పోస్ట్ వైరల్ అవుతోంది
Entertainment | Published On Dec 21, 2025, 7.57 pm IST
Jabardasth Rohini |బిగ్‌బాస్‌పై మాజీ కంటెస్టెంట్ రోహిణి ఫైర్ అయ్యింది. బిగ్‌బాస్‌లో(Bigg Boss) కష్టపడిన వాల్యూ ఉండదంటూ రోహిణి పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిగ్‌బాస్ 9 తెలుగు ఫైనల్ నేడు జరుగుతోంది. ఫైనల్‌లో కళ్యాణ్ పడాల, తనూజతో పాటు జబర్ధస్థ్ ఇమాన్యుయేల్, సంజనా గల్రానీ, డీమోన్ పవన్ పోటీపడుతున్నారు. ఈ ఫైనల్‌లో కళ్యాణ్ పడాల విన్నర్ అయినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. తనూజ రన్నరప్‌గా నిలిచినట్లు చెబుతున్నారు. కాగా ఫోర్త్ రన్నరప్‌గా ఇమాన్యుయేల్ ఎలిమినేట్ కావడం ఖాయమని తేలిసింది.
ఇమాన్యుయేల్‌ను ఉద్దేశించి జబర్ధస్థ్ రోహిణి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. "కష్టపడిన వాల్యూ ఉండదు. దానికి తగ్గ రిజల్ట్ రాదు. బిగ్‌బాస్ సీజన్ 9 విషయంలో చాలా అసంతృప్తికి లోనయ్యానంటూ" రోహిణి తన పోస్ట్‌లో పేర్కొన్నది. సీజన్ 9 అసలైన విన్నర్ నువ్వే ఇమాన్యుయేల్, నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది అని అన్నది. అంతే కాకుండా ఎంటర్‌టైనర్స్ వాటి కోసమే అని మరోసారి ప్రూవ్ అయ్యింది అంటూ రోహిణి అన్నది. ఎందుకోసమన్నది ఆమె మాత్రం వెల్లడించలేదు.
రోహిణి పోస్ట్‌ను బిగ్‌బాస్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఇమాన్యుయేల్ ఎలిమినేషన్‌ను ఉద్దేశించే రోహిణి (Jabardasth Rohini), ఈ పోస్ట్ పెట్టిందని చెబుతున్నారు. ఫైనల్ రోజు రోహిణి ఈ పోస్ట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది.
బిగ్‌బాస్ సీజన్ 9లో ఓ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఇమాన్యుయేల్ 105 రోజుల పాటు హౌజ్‌లో కొనసాగాడు. ఫైనల్ చేరుకున్నాడు. టాస్కుల్లో, ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఒకానొక దశలో ఇమాన్యుయేల్ విన్నర్ అయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది.
ఫైనల్‌లో ఓటింగ్‌లో వెనుకపడ్డ ఇమాన్యుయేల్ ఫోర్త్ రన్నరప్‌గా హౌజ్ నుంచి ఎలిమినేట్ అయినట్లు చెబుతున్నారు. ఎలాంటి ప్రైజ్‌మనీ లేకుండా ఉత్త చేతులతోనే అతడు బిగ్‌బాస్ హౌజ్‌ను వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బిగ్‌బాస్ సీజన్ 8లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నది రోహిణి. వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌజ్‌లోకి అడుగుపెట్టిన రోహిణి ఫైనల్ ముంగిట ఎలిమినేట్ అయ్యింది.
సంబంధిత వార్తలు

Bigg Boss Ayesha | హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ – సుడిగాలి సుధీర్‌తో రొమాన్స్
మే 18, 2026

Divvela Madhuri | సినిమాల్లోకి దువ్వాడ మాధురి ఎంట్రీ – గైరమ్మత్తగా బిగ్ స్క్రీన్‌పై రచ్చ
ఏప్రిల్ 28, 2026

Divvela Madhuri | తిరుమలలో తనూజ బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన దివ్వెల మాధురి – కేసు నమోదు చేసిన పోలీసులు
మార్చి 6, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



