త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bigg Boss Thanuja | ఓటీటీలోకి బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్ త‌నూజ ఎంట్రీ – తెలుగు వెబ్‌సిరీస్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

బిగ్‌బాస్ 9 ర‌న్న‌ర‌ప్ త‌నూజ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. తెలుగులో ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది. పార్ట్ టైమ‌ర్స్ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సిరీస్ జియో హాట్‌స్టార్ ద్వారా త్వ‌ర‌లో ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

N

Entertainment | Published On Jul 31, 2026, 7.44 pm IST

Bigg Boss Thanuja | ఓటీటీలోకి బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్ త‌నూజ ఎంట్రీ – తెలుగు వెబ్‌సిరీస్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌
Advertisement

Bigg Boss Thanuja | బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 9లో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది త‌నూజ పుట్ట‌స్వామి. ఈ సీజ‌న్‌తో తెలుగు రాష్ట్రాల్లో పాపుల‌ర్ అయ్యింది. సీజ‌న్ 9 విన్న‌ర్‌గా చివ‌రి వీక్ వ‌ర‌కు టైటిల్ రేసులో త‌నూజ‌నే నిలిచింది. కానీ గ్రాండ్ ఫినాలేలో త‌నూజ‌కు షాకిచ్చిన క‌ళ్యాణ్‌ ప‌డాల‌ టైటిల్ ఎగ‌రేసుకుపోయాడు.

ర‌న్న‌ర‌ప్‌...

ఫ‌స్ట్ ర‌న్న‌ర‌ప్‌తో త‌నూజ స‌రిపెట్టుకుంది. బిగ్‌బాస్ ద్వారా క్రేజ్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఈ బ్యూటీ తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. తెలుగులో ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది. ఈ సిరీస్ టైటిల్‌తో పాటు ప్లాట్‌ఫామ్ క‌న్ఫామ్ అయ్యాయి.

పార్ట్ టైమ‌ర్స్‌...

పార్ట్ టైమ‌ర్స్ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సిరీస్‌లో త‌నూజ పుట్ట‌స్వామితో పాటు జ్ఞానేశ్వ‌రి కాండ్రేగుల కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. జియో హాట్‌స్టార్‌లో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సిరీస్ టైటిల్‌ను రివీల్ చేసిన జియో హాట్‌స్టార్ ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది. ఇందులో 30 ఏళ్ల వ‌య‌సులోపే బిజినెస్‌లో స‌క్సెస్ కావాల‌ని క‌ల‌లు క‌నే యువ‌తులుగా త‌నూజ‌, జ్ఞానేశ్వ‌రి క‌నిపిస్తున్నారు. ఓ యాడ్ బోర్డ్‌లో జ్ఞానేశ్వ‌రి...మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై త‌నూజ ఫొటోలు ఉండ‌టం ఆస‌క్తిని పంచుతోంది.

ఫుల్ టైమ్ డ్రీమ్స్‌...

పార్ట్ టైమ్ జాబ్స్ ఫుల్ టైమ్ డ్రీమ్స్ అంటూ పోస్ట‌ర్‌పై ఉన్న క్యాప్ష‌న్ ఆస‌క్తిని పంచుతోంది. త్వ‌ర‌లోనే ఈ వెబ్‌సిరీస్ జియో హాట్‌స్టార్‌లో రిలీజ్ కాబోతుంది.

సీరియ‌ల్స్‌...

బిగ్‌బాస్ కంటే ముందు ముద్ద మందారం, ఆగ్నిప‌రీక్ష సీరియ‌ల్స్ చేసింది. ముద్ద‌మందారంలో చేసిన పార్వ‌తి పాత్ర‌తో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. దాదాపు 1500 ఎపిసోడ్స్‌కుపైగా ఈ సీరియ‌ల్ టెలికాస్ట్ అయ్యింది. ఈ సీరియ‌ల్ ద్వారానే బిగ్‌బాస్‌లో ఛాన్స్ ద‌క్కించుకుంది. తెలుగుతో పాటు క‌న్న‌డ బిగ్‌బాస్‌లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్న‌ది. తెలుగులో లీగ‌ల్లీ వీర్ అనే సినిమాతో పాటు క‌న్న‌డంలో 6-5 = 2 అనే హార‌ర్ మూవీలో న‌టించింది.

Advertisement
Advertisement