Sara Arjun | ప్రేమలో పడ్డ ధురంధర్ హీరోయిన్ – బాలీవుడ్ స్టార్ హీరో తమ్ముడితో సీక్రెట్ డేటింగ్?
ధురంధర్ హీరోయిన్ సారా అర్జున్ ప్రేమలో పడ్డట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్‌తో ఈ బ్యూటీ డేటింగ్‌లో ఉన్నట్లు చెబుతోన్నారు. సారా అర్జున్ లీడ్ రోల్‌లో నటిస్తోన్న మధుబాల బయోపిక్‌లో ఇషాన్ కట్టర్ హీరోగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Aug 24, 2026, 3.28 pm IST
Sara Arjun | ధురంధర్ హీరోయిన్ సారా అర్జున్ ప్రేమలో పడినట్లు బాలీవుడ్ వర్గాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో తమ్ముడితో ఈ బ్యూటీ డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. ధురంధర్ సినిమాతో హీరోయిన్‌గా హిందీ ఇండస్ట్రీకి పరిచయమైంది సారా అర్జున్. ధురంధర్ సీక్వెల్‌లోనూ కథానాయికగా కనిపించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడంతో హిందీ సినీ పరిశ్రమలో ఈ అమ్మడి పేరు మారుమోగింది. పలువురు అగ్ర దర్శకులు, హీరోలు సారా అర్జున్‌తో సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో ఓ బయోపిక్‌కు సారా అర్జున్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
షాహిద్ కపూర్ తమ్ముడితో...
కాగా సారా అర్జున్ ప్రేమలో పడినట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగినట్లు రూమర్లు వినిపిస్తోన్నాయి. ఇటీవలే వీరిద్దరు కలిసి ఓ యాడ్ ఫిల్మ్‌లో కలిసి నటించారు. ఆ టైమ్‌లోనే ఇద్దరి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారినట్లు సమాచారం. యాడ్ ఫిల్మ్ షూటింగ్ వర్కింగ్ వీడియోను మేకర్స్ ఇటీవల రిలీజ్ చేశారు. ఇందులో ఇషాన్, సారా అర్జున్ చాలా సన్నిహితంగా కనిపించారు. వారిద్దరి బాండింగ్ చూసిన చాలా మంది డేటింగ్ రూమర్లు నిజమేనని అంటున్నారు.
బ్రేకప్....
సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ చాందిని బైంజ్‌తో ఇషాన్ కట్టర్ గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. మనస్పర్థల కారణంగా ఈ జంట ఇటీవలే విడిపోయినట్లు సమాచారం. వీరి బ్రేకప్‌కు సారా అర్జున్‌తో ఇషాన్ కట్టర్ క్లోజ్‌గా ఉండటమే కారణమని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సారాతో ఇషాన్ సీక్రెట్‌గా పార్టీలకు అటెండ్ అవుతున్నట్లు పుకార్లు వస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా కూడా కన్ఫామ్ అయినట్లు సమాచారం.
మధుబాల బయోపిక్..
బాలీవుడ్ లెజెండరీ నటి మధుబాల బయోపిక్‌లో సారా అర్జున్ టైటిల్ పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాలో హీరోగా ఇషాన్ కట్టర్ ఫైనల్ అయినట్లు సమాచారం. ఇందులో అలనాటి బాలీవుడ్ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ పాత్రలో ఇషాన్ కనిపించనున్నట్లు చెబుతోన్నారు. పర్సనల్‌గా వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఈ సినిమాకు హెల్పవుతుందని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ భావిస్తోన్నట్లు సమాచారం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kriti Sanon | బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌పై ట్రోల్.. ఇదేం విడ్డూరం అంటూ సోషల్ మీడియాలో విసుర్లు..!
ఆగస్టు 24, 2026

Sharvari Wagh | కొన్ని సెకన్లే.. కానీ ఎంతో నేర్పాయి..! శర్వరి వాఘ్ ఆసక్తికర విషయాలు
ఆగస్టు 23, 2026

Alia Bhatt | ఈ ఏడాది బాలీవుడ్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ – ఓటీటీలోకి వచ్చేస్తోన్న అలియాభట్ స్పై థ్రిల్లర్ మూవీ
ఆగస్టు 23, 2026
తాజావార్తలు
- ●Apple | వినియోగదారులకు షాకివ్వనున్న యాపిల్.. ఐఫోన్ల ధరలు పెంపు..?
- ●Feesula Bakai - BJP Ladayi | సౌత్ ఇండియాలో చెన్నై, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఎక్కువ నిరుద్యోగం
- ●ల్యాండ్ పూలింగ్ '60:40' ఆఫర్: భూమి ఇచ్చేముందు ప్రతి రైతు తెలుసుకోవాల్సిన 5 పక్కా నిజాలు!
- ●Heavy Rain | భారీ వర్షానికి స్తంభించిన ఢిల్లీ.. 250 విమానాలు ఆలస్యం
- ●Meheshwar Reddy | ఇక్కడ పాఠశాలల్లో వసతులు లేవంటే.. ఎక్కడో ఉన్న ‘ఆక్స్ఫర్డ్’ను తీసుకొస్తడట
- ●Avinya27 | యువ ఆవిష్కర్తలకు కేంద్రం పిలుపు.. అవిన్యా 27 ఎనర్జీ స్టార్టప్ ఛాలెంజ్..

Apple | వినియోగదారులకు షాకివ్వనున్న యాపిల్.. ఐఫోన్ల ధరలు పెంపు..?

Feesula Bakai - BJP Ladayi | సౌత్ ఇండియాలో చెన్నై, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఎక్కువ నిరుద్యోగం

ల్యాండ్ పూలింగ్ '60:40' ఆఫర్: భూమి ఇచ్చేముందు ప్రతి రైతు తెలుసుకోవాల్సిన 5 పక్కా నిజాలు!

Heavy Rain | భారీ వర్షానికి స్తంభించిన ఢిల్లీ.. 250 విమానాలు ఆలస్యం



