త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Katrina Kaif Sister | క‌త్రినాకైఫ్ చెల్లెలు ప్రేమ‌లో ప‌డిందా? – అక్క ఇంటికే తోటి కోడ‌లిగా !

క‌త్రినాకైఫ్ చెల్లెలు ఇసాబెల్లె కైఫ్ ల‌వ్‌స్టోరీ బాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. విక్కీ కౌశ‌ల్ త‌మ్ముడు స‌న్నీ కౌశ‌ల్‌తో ఇసాబెల్లె డైటింగ్ చేస్తోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. స‌న్నీ కౌశ‌ల్ పోస్ట్ చేసిన ట‌ర్కీ ట్రిప్ ఫొటోల‌తో వీరి ప్రేమాయ‌ణం నిజ‌మేన‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతోన్నారు.

N

Entertainment | Published On Sep 19, 2026, 6.39 pm IST

Katrina Kaif Sister | క‌త్రినాకైఫ్ చెల్లెలు ప్రేమ‌లో ప‌డిందా?  – అక్క ఇంటికే తోటి కోడ‌లిగా !
Advertisement

Katrina Kaif Sister |  క‌త్రినా కైఫ్ చెల్లెలు ఇసాబెల్లె కైఫ్, విక్కీ కౌశ‌ల్ త‌మ్ముడు స‌న్నీ కౌశ‌ల్ ల‌వ్‌స్టోరీ బాలీవుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ బావ‌మ‌ర‌ద‌ళ్లు పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న‌ట్లు చెబుతోన్నారు. క‌త్రినా కైఫ్‌, విక్కీ కౌశ‌ల్ పెళ్లిలోనే వీరి మ‌ధ్య ప్రేమ చిగురించిన‌ట్లు స‌మాచారం. క‌త్రినాకైఫ్ ఇంట జ‌రిగిన ప‌లు ఫ్యామిలీ ఫంక్ష‌న్స్‌లో ఇసాబెల్లె క‌నిపించిన ఫొటోలు చాలా సార్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. త‌మ మ‌ధ్య ఎలాంటి రిలేష‌న్ లేద‌ని, కేవ‌లం ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాత్ర‌మేనంటూ ఈ రూమ‌ర్ల‌పై ఇసాబెల్లె కైఫ్ రియాక్ట్ అయ్యింది. అయినా ఈ రూమ‌ర్లు మాత్రం ఆగ‌డం లేదు.

ట‌ర్కీ వెకేష‌న్‌...

తాజాగా ట‌ర్కీకి వెకేష‌న్‌కు వెళ్లిన కొన్ని ఫొటోల‌ను స‌న్నీ కౌశ‌ల్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ బాలీవుడ్ న‌టుడి కంటే కొద్ది వారాల‌కు ముందు ఇసాబెల్లె కైఫ్ కూడా ట‌ర్కీ ట్రిప్ ఫొటోలు అంటూ సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో కొన్ని ఫొటోల‌ను పంచుకుంది. ఈ ఫొటోల్లు ఇసాబెల్లె , స‌న్నీ కౌశ‌ల్ క‌లిసి క‌నిపించ‌ లేదు. కానీ ఇద్ద‌రి ఫొటోల్లో సేమ్‌ లోకేష‌న్స్‌, స్ట్రీట్స్, యాంగిల్స్ , బ్యాక్‌గ్రౌండ్‌లు ఉండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇసాబెల్లెతోనే క‌లిసి స‌న్నీ కౌశ‌ల్ ట‌ర్కీ ట్రిప్‌కు వెళ్లాడ‌ని, ఫొటోల్లో త‌మ ల‌వ్‌స్టోరీ బ‌య‌టప‌డ‌కుండా ఇద్ద‌రు జాగ్ర‌త్త ప‌డ్డాడ‌ని అంటున్నారు.

కంపేరిజ‌న్స్‌...

అంత‌కుముందు ఇసాబెల్లె కైఫ్ ....డంజియ‌న్ క్రాల‌ర్ కార్ల్ అనే బుక్ చ‌దువుతోన్న ఓ ఫొటోను పోస్ట్ చేసింది. త‌న‌కు ఇష్ట‌మైన బుక్ అని అన్న‌ది. ఆ త‌ర్వాత అదే బుక్ చ‌దువుతూ స‌న్నీ కౌశ‌ల్ కూడా సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈ ఫొటోల‌ను కంపేర్ చేస్తూ నెటిజ‌న్లు ఇసాబెల్లె , స‌న్నీ కౌశ‌ల్ ప్రేమాయ‌ణం నిజ‌మేన‌ని అంటున్నారు. సొంత అక్క‌కే తొలి కోడ‌లిగా కౌశ‌ల్ ఫ్యామిలీలోకి ఇసాబెల్లె అడుగుపెట్ట‌డం ఖాయ‌మేన‌ని చెబుతున్నారు.

బాలీవుడ్‌లో...

ఇసాబెల్లె టైమ్ టూ డ్యాన్స్ అనే బాలీవుడ్ మూవీతో హీరోయిన్‌గా మారింది. మ‌రో రెండు మూడు సినిమాల్లో క‌నిపించింది. అక్క స్థాయిలో స‌క్సెస్ కాలేక‌పోయింది. మ‌రోవైపు స‌న్నీకౌశ‌ల్ ఇప్పుడిప్పుడే న‌టుడిగా నిల‌దొక్కుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. గోల్డ్‌, షిద్ధ‌త్‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేశాడు.

 

Advertisement
Advertisement