త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Roja | హీరో వెంక‌టేష్‌తో గొడ‌వ‌లు – షూటింగ్‌లో ఇబ్బంది పెట్టారంటూ మాజీ మంత్రి రోజా కామెంట్స్‌

హీరో వెంక‌టేష్‌తో గొడ‌వ‌ల‌పై మాజీ మంత్రి రోజా ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసింది. భ‌ర్త‌తో సినిమా చేస్తాన‌ని మాటిచ్చిన వెంక‌టేష్ చెప్పాపెట్ట‌కుండా మూవీ నుంచి వైదొలిగార‌ని అన్న‌ది. పోకిరి రాజా సినిమా సాంగ్ రీషూట్ కోసం త‌న‌ను పిలిపించి ఇబ్బంది పెట్టార‌ని చెప్పింది. రోజా కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

N

Entertainment | Published On Sep 19, 2026, 5.11 pm IST

Roja | హీరో వెంక‌టేష్‌తో గొడ‌వ‌లు – షూటింగ్‌లో ఇబ్బంది పెట్టారంటూ మాజీ మంత్రి రోజా కామెంట్స్‌
Advertisement

Roja |  టాలీవుడ్ హీరో వెంక‌టేష్‌తో గొడ‌వ‌ల‌పై సీనియ‌ర్ హీరోయిన్‌, మాజీ మంత్రి రోజా రియాక్ట్ అయ్యారు. ఓ సినిమా షూటింగ్ కోసం త‌న‌ను పిలిచి ఇబ్బంది పెట్టార‌ని అన్న‌ది. రాజ‌కీయాల కార‌ణంగా సినిమాల‌కు ఐదేళ్ల పాటు దూర‌మైన రోజా ఇటీవ‌లే అన్భే డ‌యానా అనే త‌మిళ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో హీరో త‌ల్లిగా ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో క‌నిపించింది. తెలుగులోనూ రోజా ఓ సినిమాను అంగీక‌రించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

సినిమా చేస్తాన‌ని మాటిచ్చి...

ఈ రూమ‌ర్ల న‌డుమ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో హీరో వెంక‌టేష్‌పై రోజా ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసింది. త‌న భ‌ర్త సెల్వ‌మ‌ణితో ఓ సినిమా చేస్తాన‌ని మాటిచ్చిన వెంక‌టేష్ చెప్ప‌పెట్ట‌కుండా ఆ మూవీ నుంచి వైదొలిగాడ‌ని అన్న‌ది."వెంక‌టేష్‌, సెల్వ‌మ‌ణి కాంబినేష‌న్‌లో తెలుగులో ఓ సినిమా ఖ‌రారైంది. పూజా కార్య‌క్ర‌మాలు కూడా జ‌రిగాయి. షూటింగ్ మొద‌లుపెట్టే ప్ర‌య‌త్నాల్లో సెల్వ‌మ‌ణి ఉన్నారు. ఆయ‌న‌కు తెలియ‌కుండా మ‌రో త‌మిళ రీమేక్ కోసం వెంక‌టేష్ త‌న డేట్స్ ఇచ్చేశారు. దాంతో సెల్వ‌మ‌ణి హ‌ర్ట‌య్యారు. అది చూసి నేను ఫీల‌య్యా. ల‌వ్ చేసిన‌ప్పుడు ఆ బాధ ఉంటుంది" అని రోజా అన్న‌ది.

సాంగ్ షూట్ కోసం పిలిచి...

"ఈ గొడ‌వ‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి వెంక‌టేష్‌తో పోకిరి రాజా సినిమా చేశా. అందులోని ఓ సాంగ్ షూట్‌కు సంబంధించిన రీల్ పాడైపోయింది. రీ షూట్ కోసం పిలిచారు. నా భ‌ర్త పుట్టిన‌రోజు వేడుక‌లు ద‌గ్గ‌ర‌లో ఉండ‌టంతో రెండు రోజులు అతి క‌ష్టంగా డేట్స్ కేటాయించా. నాపై సాంగ్ షూట్ చేయ‌కుండా రెండు రోజులు వెయిట్ చేయించారు. బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ ఉన్నాయ‌ని చెప్పిన పంపించ‌లేదు. దాంతో కోపంగా బ్యాగ్ స‌ర్ధుకొని అక్క‌డి నుంచి వ‌చ్చేశా. ఆ విష‌యంలో వెంక‌టేష్ బాధ‌ప‌డ్డాడ‌ని తెలిసింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ మేమిద్ద‌రం క‌లిసి సినిమా చేయ‌లేదు. మా మ‌ధ్య గొడ‌వ‌ల‌కు మ‌ధ్య‌వ‌ర్తులే కార‌ణం. నాపై ఆయ‌న‌కు లేనిపోని చాడీలు చెప్పి ఉంటారు" అని రోజా అన్న‌ది ఆమె కామెంట్లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి.

 

Advertisement
Advertisement