2BHK Houses | క్యూర్‌లో 21వేల డబుల్ బెడ్రూంలు పూర్తి : మంత్రి పొంగులేటి
2BHK Houses | గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు ప్రభుత్వం మోక్షం కల్పిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు క్యూర్ పరిధిలోని 26 ప్రాంతాల్లో 21వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పూర్తి చేశామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శ
2BHK Houses | గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు ప్రభుత్వం మోక్షం కల్పిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు క్యూర్ పరిధిలోని 26 ప్రాంతాల్లో 21వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పూర్తి చేశామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం సచివాలయం నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, హౌసింగ్, వాటర్‌వర్క్స్, విద్యుత్ శాఖల అధికారులతో హౌసింగ్ సెక్రటరీ వి.పి.గౌతమ్‌తో కలిసి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు ఈ నెల 30లోగా పారదర్శకంగా డ్రా పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపికైన వారి వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు.
2బీహెచ్‌కే ఇళ్లు ఉన్న ప్రాంతానికి 5 నుంచి 7 కిలోమీటర్ల పరిధిలోని అర్హులనే ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. ఇళ్ల కాలనీల్లో తాగునీరు, విద్యుత్, పారిశుధ్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని వచ్చే నెలాఖరులోగా మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలోని అనర్హులను తొలగించాలని మంత్రి సూచించారు. ఇళ్లలో నివసించని వారికి తుది నోటీసులు ఇచ్చి, స్పందించకపోతే కేటాయింపులు రద్దు చేసి అర్హులకు ఇళ్లు కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు. క్యూర్ పరిధిలో ఇంటి స్థలం ఉండి అర్హత కలిగిన దాదాపు 9వేల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు పొంగులేటి వెల్లడించారు. ఇన్‌చార్జి మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని లబ్ధిదారుల ఎంపిక, మంజూరు పత్రాల పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mallu Ravi | జన్వాడ ఫామ్‌హౌస్‌పై సమగ్ర విచారణ జరగాలి: ఎంపీ మల్లు రవి
సెప్టెంబర్ 19, 2026

TG Weather | తెలంగాణలో వారం రోజులు అతిభారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..!
సెప్టెంబర్ 19, 2026

MP Chamala Kirankumar Reddy | ఫిరంగి నాళాను ఆక్రమించి జన్వాడ ఫామ్‌హౌస్ కట్టారు
సెప్టెంబర్ 19, 2026
తాజావార్తలు
- ●Roja | హీరో వెంకటేష్‌తో గొడవలు - షూటింగ్లో ఇబ్బంది పెట్టారంటూ మాజీ మంత్రి రోజా కామెంట్స్
- ●Mallu Ravi | జన్వాడ ఫామ్‌హౌస్‌పై సమగ్ర విచారణ జరగాలి: ఎంపీ మల్లు రవి
- ●TG Weather | తెలంగాణలో వారం రోజులు అతిభారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..!
- ●Cyber Fraud | బీజేపీ ఎమ్మెల్యే ఖాతా నుంచి రూ.1.50 లక్షలు మాయం
- ●MP Chamala Kirankumar Reddy | ఫిరంగి నాళాను ఆక్రమించి జన్వాడ ఫామ్‌హౌస్ కట్టారు
- ●Special Trains | పండుగ వేళ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. చర్లపల్లి–శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు

Roja | హీరో వెంకటేష్‌తో గొడవలు - షూటింగ్లో ఇబ్బంది పెట్టారంటూ మాజీ మంత్రి రోజా కామెంట్స్

Mallu Ravi | జన్వాడ ఫామ్‌హౌస్‌పై సమగ్ర విచారణ జరగాలి: ఎంపీ మల్లు రవి

TG Weather | తెలంగాణలో వారం రోజులు అతిభారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..!

Cyber Fraud | బీజేపీ ఎమ్మెల్యే ఖాతా నుంచి రూ.1.50 లక్షలు మాయం



