Janwada Farm House | ప్రదీప్‌రెడ్డి ఫామ్‌హౌస్‌పై దాడికి రావడం చట్ట వ్యతిరేకం?
Janwada Farm House | ప్రదీప్‌రెడ్డి ఫామ్‌హౌస్‌పై కాంగ్రెస్ ఎంపీలు, ప్రజాప్రతినిధులు దాడికి రావడం చట్ట వ్యతిరేకమని ప్రదీప్‌రెడ్డి అడ్వకేట్ రాజేశ్వరరావు మండిపడ్డారు.
- నిబంధనలకు విరుద్ధంగా కడితే అధికారులే నోటీసులిస్తారు
- వాటికి సమాధానం ఇచ్చేందుకు లేటైతే తప్పేంటి?
- ప్రాపర్టీని వ్యక్తులకు బదలాయించడంపై రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ ఉండాల్సిన అవసరం లేదు
- జన్వాడ ఫామ్‌హౌస్ ప్రదీప్ రెడ్డి అడ్వకేట్ రాజేశ్వరరావు వ్యాఖ్యలు
Janwada Farm House | త్రినేత్ర.న్యూస్: ప్రదీప్‌రెడ్డి ఫామ్‌హౌస్‌పై కాంగ్రెస్ ఎంపీలు, ప్రజాప్రతినిధులు దాడికి రావడం చట్ట వ్యతిరేకమని ప్రదీప్‌రెడ్డి అడ్వకేట్ రాజేశ్వరరావు మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా కడితే అధికారులే నోటీసులిస్తారని.. వాటికి సమాధానం ఇచ్చేందుకు లేటైతే తప్పేంటన్నారు. ప్రాపర్టీని వ్యక్తులకు బదలాయించడంపై రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈమేరకు శనివారం ఆయన మాట్లాడారు.
ప్రదీప్ రెడ్డి ఫామ్‌హౌస్ పై కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు దాడికి రావడం దుర్మార్గం. మన దేశంలో అనేక చట్టాలు ఉన్నాయి. చట్ట వ్యతిరేకానికి ప్రదీప్ రెడ్డి పాల్పడలేదు. దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ ప్రవేయిట్ వ్యక్తి భూమిపైకి రావడం ఏంటి.! ప్రైవేట్ వ్యక్తి పై దాడికి వచ్చిన కాంగ్రెస్.. రాజ్యాంగంపై దాడి చేయడమే. మూడు, నాలుగు ఎకరాల ఫామ్‌హౌస్ పై కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు దాడికి వచ్చారు.
చట్ట వ్యతిరేకమది..
కాంగ్రెస్ పార్టీకి చట్టాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రైవేట్ భూమిలోకి రావడం చట్ట వ్యతిరేకం. ఇక్కడకి వచ్చి వాళ్ల వీళ్ల పేర్లపై భూములు ఉన్నాయి అంటున్నారు. వ్యక్తుల పేర్ల పై భూములు ఉండడం తప్పా? భూములు అమ్మడం కొనుక్కోవడం మనందరి హక్కు. ప్రదీప్ రెడ్డి ఫామ్‌హౌస్ పై వైలేషన్ ఉంటే.. అధికారులు నోటీసులు ఇస్తారు. ప్రాపర్టీని వ్యక్తులకు బదలాయించడంపై రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ ఉండాల్సిన అవసరం లేదు.
ప్రదీప్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ఫామ్‌హౌస్ ఎక్కడా నిర్మించలేదు. నిబంధనలకు విరుద్ధంగా కట్టి ఉంటే అధికారులు నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇస్తే సమాధానం ఇచ్చేందుకు లేటైతే తప్పేంటి అని అడ్వకేట్ రాజేశ్వరరావు వ్యాఖ్యానించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Harish Rao | సీనియర్ రిటైర్డ్ ఇంజనీర్లను బెల్టుతో కొడతామని రేవంత్ రెడ్డి బెదిరించారు
- ●2BHK Houses | క్యూర్లో 21వేల డబుల్ బెడ్రూంలు పూర్తి : మంత్రి పొంగులేటి
- ●Roja | హీరో వెంకటేష్‌తో గొడవలు - షూటింగ్లో ఇబ్బంది పెట్టారంటూ మాజీ మంత్రి రోజా కామెంట్స్
- ●Mallu Ravi | జన్వాడ ఫామ్‌హౌస్‌పై సమగ్ర విచారణ జరగాలి: ఎంపీ మల్లు రవి
- ●TG Weather | తెలంగాణలో వారం రోజులు అతిభారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..!
- ●Cyber Fraud | బీజేపీ ఎమ్మెల్యే ఖాతా నుంచి రూ.1.50 లక్షలు మాయం

Harish Rao | సీనియర్ రిటైర్డ్ ఇంజనీర్లను బెల్టుతో కొడతామని రేవంత్ రెడ్డి బెదిరించారు

2BHK Houses | క్యూర్లో 21వేల డబుల్ బెడ్రూంలు పూర్తి : మంత్రి పొంగులేటి

Roja | హీరో వెంకటేష్‌తో గొడవలు - షూటింగ్లో ఇబ్బంది పెట్టారంటూ మాజీ మంత్రి రోజా కామెంట్స్

Mallu Ravi | జన్వాడ ఫామ్‌హౌస్‌పై సమగ్ర విచారణ జరగాలి: ఎంపీ మల్లు రవి



