త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Deepika Padukone | ప్రొడ్యూస‌ర్‌గా దీపికా ప‌డుకోణ్ – క‌ల్కి కాంబో రిపీట్

ప్రెగ్నెన్సీ టైమ్‌లో దీపికా ప‌డుకోణ్ సినిమాల‌తో బిజీగా ఉంది. ప్ర‌స్తుతం అల్లు అర్జున్‌తో రాకా సినిమా చేస్తోంది. ఇటీవ‌లే రాకా షూటింగ్‌ను ఈ బాలీవుడ్ హీరోయిన్ పూర్తిచేసింది. తాజాగా మ‌రో హాలీవుడ్ రీమేక్‌కు దీపికా ప‌డుకోణ్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. యాక్ట‌ర్‌గా కాకుండా ప్రొడ్యూస‌ర్‌గా దీపికా ఈ సినిమా చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

N

Entertainment | Published On Sep 18, 2026, 3.47 pm IST

Deepika Padukone | ప్రొడ్యూస‌ర్‌గా దీపికా ప‌డుకోణ్ – క‌ల్కి కాంబో రిపీట్
Advertisement

Deepika Padukone |

బాలీవుడ్ హీరోయిన్ దీపికా ప‌డుకోణ్ రెండోసారి త‌ల్లిగా మార‌బోతుంది. ప్రెగ్నెన్సీ కార‌ణంగా ఆమె సినిమాల‌కు గ్యాప్ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం అల్లు అర్జున్‌తో రాకా సినిమా చేస్తోంది. ఈ పాన్ ఇండియ‌న్ మూవీ షూటింగ్‌ను ఇటీవ‌లే పూర్తిచేసింది. మాతృత్వం కార‌ణంగా ఏడాది పాటు సినిమాల‌కు దూరంగా ఉండాల‌ని దీపికా ప‌డుకోణ్ నిర్ణ‌యించుకుంద‌ని వార్త‌లొస్తున్నాయి. అయితే ఈ రూమ‌ర్ల‌కు తెర‌దించుతూ ప్రెగ్నెన్సీలో ఓ హాలీవుడ్ రీమేక్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. అయితే యాక్ట‌ర్‌గా కాదు. ప్రొడ్యూస‌ర్‌గా ఈ సినిమా చేయ‌బోతుంది.

హాలీవుడ్ మూవీ...

అన్నా హాథ్‌వే, రాబ‌ర్డ్ డీ నీరో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన హాలీవుడ్ మూవీ ది ఇంటెర్న్ క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద విజ‌యాన్ని సాధించింది. కేవ‌లం 35 మిలియ‌న్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ ఎమోష‌న‌ల్ డ్రామా మూవీ రెండు వంద‌ల మిలియ‌న్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ఈ హాలీవుడ్ సినిమాను బాలీవుడ్‌లోకి రీమేక్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

అమితాబ్‌బ‌చ్చ‌న్‌...దీపికా ప‌డుకోణ్‌...

ఈ రీమేక్‌లో అమితాబ్‌బ‌చ్చ‌న్‌, ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌బోతున్నారు. అమిత్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఒరిజిన‌ల్‌తో పోలిస్తే ద‌ర్శ‌కుడు క‌థ‌లో చేసిన మార్పులు, ఎమోష‌న‌ల్‌గా క్యారెక్ట‌ర్ల‌ను తీర్చిదిద్దిన తీరు న‌చ్చ‌డంతో ఈ సినిమాను నిర్మించ‌డానికి దీపికా ప‌డుకోణ్ అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. సినిమాల నిర్మాణం కోసం కా ప్రొడ‌క్ష‌న్స్ పేరుతో బ్యాన‌ర్‌ను నెల‌కొల్పింది. ఈ బ్యాన‌ర్‌పై ఛ‌ఫాక్ అనే సినిమాను నిర్మించింది. భ‌ర్త ర‌ణ‌వీర్‌సింగ్ హీరోగా న‌టించిన 83 మూవీకి కో ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించింది. ఇంటెర్న్ రీమేక్ దీపికా ప‌డుకోణ్‌ బ్యాన‌ర్‌లో వ‌స్తోన్న మూడో మూవీ. త్వ‌ర‌లోనే ఈ సినిమా అఫీషియ‌ల్‌గా ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం.

రిటైర్‌మెంట్ లైఫ్‌...

రిటైర్‌మెంట్ లైఫ్ న‌చ్చ‌ని ఓ వృద్దుడు పెద్ద కంపెనీలో జాబ్‌లో చేరుతాడు. ఆ కార్పొరేట్ కంపెనీకి ఓన‌ర్‌గా ఓ మ‌హిళ ప‌నిచేస్తుంటుంది. ఎంతో క‌ష్ట‌ప‌డి ఆ స్థాయికి చేరుకుంటుంది. ఆమె నుంచి ఆ కంపెనీని చేజిక్కించుకోవాల‌ని కొంద‌రు ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. మ‌రోవైపు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. అలాంటి టైమ్‌లో ఆ మ‌హిళ‌ను వృద్ధుడు ఎలా గైడ్ చేశాడు? ఆమె జీవితాన్ని ఏ విధంగా చ‌క్క‌దిద్దాడ‌నే అంశాల‌తో ఈ మూవీ రూపొందుతోంది. ఈ హాలీవుడ్ రీమేక్‌లో దీపికా ప‌డుకోణ్ గెస్ట్‌గా క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం.

క‌ల్కి త‌ర్వాత‌...

దీపికా ప‌డుకోణ్ , అమితాబ్‌బ‌చ్చ‌న్ కాంబినేష‌న్‌లో తెలుగులో క‌ల్కి 2898 ఏడీ మూవీ రూపొందింది. ప్ర‌భాస్ హీరోగా న‌టించిన ఈ మూవీ పెద్ద హిట్‌గా నిలిచింది. క‌ల్కి త‌ర్వాత వీరిద్ద‌రు క‌లిసి బాలీవుడ్ మూవీ చేయ‌బోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

 

Advertisement
Advertisement