త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mallu Ravi | జ‌న్వాడ ఫామ్‌హౌస్‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌గాలి: ఎంపీ మ‌ల్లు ర‌వి

Mallu Ravi | అనుమతులు లేకుండానే నాళాపై జ‌న్వాడ‌ ఫామ్‌హౌస్ నిర్మాణం చేశార‌ని ఎంపీ మల్లు రవి ఆరోపించారు.

S

Telangana | Published On Sep 19, 2026, 5.10 pm IST

Mallu Ravi | జ‌న్వాడ ఫామ్‌హౌస్‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌గాలి: ఎంపీ మ‌ల్లు ర‌వి
Advertisement

Mallu Ravi | త్రినేత్ర‌.న్యూస్‌: అనుమతులు లేకుండానే నాళాపై జ‌న్వాడ‌ ఫామ్‌హౌస్ నిర్మాణం చేశార‌ని ఎంపీ మల్లు రవి ఆరోపించారు. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌గాల్సిన అవ‌సరం ఉంద‌న్నారు. శ‌నివారం కాంగ్రెస్ ఎంపీలు, ప్ర‌జాప్రతినిధుల బృందం ఫామ్‌హౌస్ సంద‌ర్శ‌న సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. ఈ నిర్మాణాల‌పై నిజానిజాలు ప్ర‌జ‌ల‌కు వెల్ల‌డించాల‌ని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ శివారులోని జన్వాడ ఫామ్‌హౌస్‌ను స‌హ‌చ‌ర ఎంపీలు, ప్రజాప్రతినిధుల బృందంతో క‌లిసి సంద‌ర్శించాం. అక్కడి భూములు, నిర్మాణాలను పరిశీలించాం. ఫామ్‌హౌస్ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? నాళాపై నిర్మాణం ఎలా చేపట్టారు? అనే అంశాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. 111 జీవో పరిధిలోని భూముల్లో నిర్మాణాలకు నిబంధనలు ఉన్నాయి. గతంలో జన్వాడ ఫామ్‌హౌస్ వద్ద డ్రోన్ ఎగురవేసిన ఘటనకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డిపై కేసు నమోదైంది. ప్రస్తుతం జన్వాడ భూములు, నిర్మాణాలపై నిజానిజాలు ప్రజలకు వెల్లడించాలి అని మ‌ల్లు ర‌వి డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండ‌గా ఫామ్‌హౌస్ యజమానిగా పేర్కొంటున్న ప్రదీప్‌రెడ్డి మాత్రం భూమి తనదేనని, 2019లో కొనుగోలు చేశానని చెప్పారు. కేటీఆర్‌కు ఆస్తిపై యాజమాన్య హక్కులు లేవని, కేవలం లీజుకు ఇచ్చినట్లు మీడియాతో వెల్ల‌డించిన విష‌యం విదిత‌మే.

Advertisement
Advertisement