Deepika Padukone | అల్లు అర్జున్ రాకా నుంచి దీపికా పదుకొనే ఔట్ – రూమర్లలో నిజమెంత?
అల్లు అర్జున్ రాకా మూవీ నుంచి దీపికా పదుకొనేను మేకర్స్ పక్కనపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. తల్లి కాబోతున్నట్లు దీపిక ప్రకటించడంతో ఆమె స్థానంలో మేకర్స్ మరో హీరోయిన్‌ను తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Entertainment | Published On Apr 23, 2026, 2.54 pm IST
Deepika Padukone | తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లు ఇటీవలే దీపికా పదుకొనే ప్రకటించింది. భర్త రణవీర్‌సింగ్‌తో కలిసి ఈ గుడ్‌న్యూస్‌ను అభిమానులతో పంచుకుంది. దీపికా ప్రెగ్నెంట్ అని ప్రకటించినప్పటి నుంచి అల్లు అర్జున్ రాకా టీమ్‌లో టెన్షన్ మొదలైనట్లు సమాచారం. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియన్ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో యాక్షన్ ఓరియెంటెడ్ రోల్ చేస్తోంది.
దీపికను తప్పించి...
ప్రెగ్నెన్సీ టైమ్‌లో యాక్షన్ సీన్లలో నటించడం అంటే రిస్కేనని భావించిన మేకర్స్ దీపికా రోల్ లెంగ్త్‌ను తగ్గించాలని ఫిక్సయ్యారట. యాక్షన్ సీన్లు మొత్తాన్ని లేపేసి కేవలం టాకీ పార్ట్‌కు మాత్రమే ఆమె రోల్‌ను పరిమితం చేయాలని అనుకున్నారట. కానీ ఆ ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో చివరకు దీపికా పదుకొనేను ఈ సినిమా నుంచి తప్పించి ఆమె ప్లేస్‌లో మరో హీరోయిన్‌ను తీసుకోవాలని అనుకుంటున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీపికా కూడా మేకర్స్ నిర్ణయానికి ఒకే చెప్పినట్లు వార్తలొస్తున్నాయి.
వార్తల్లో నిజం లేదు...
ఈ రూమర్లను మేకర్స్ ఖండించారు. రాకా నుంచి దీపికా పదుకొనే తప్పుకున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని అన్నారు. దీపికానే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె పాత్రను తగ్గించలేదు. దీపికా ప్లేస్‌లో మరొకొరిని తీసుకోవడం లేదు. ప్రెగ్నెన్సీతో ఉండి కూడా దీపికా కొన్ని యాక్షన్ సీన్స్‌లో నటించబోతున్నారు. వాటి కోసం సెట్స్‌లో పలు జాగ్రత్తలు తీసుకోబోతున్నాం. అనుకున్న ప్లాన్ ప్రకారమే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది అని మేకర్స్ వెల్లడించారు. దీపికా పాత్ర విషయంలో నిరాధారమైన రూమర్లను వ్యాప్తి చేయవద్దని కోరారు.
వెరైటీ గెటప్...
దాదాపు 1300 కోట్ల బడ్జెట్‌తో సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా దర్శకుడు అట్లీ రాకా సినిమాను తెరకెక్కిస్తోన్నారు. ఇటీవలే అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. వెరైటీ గెటప్‌లో అల్లు అర్జున్ కనిపించి అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. రాకా సినిమాకు సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొనేతో పాటు జాన్వీకపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్లుగా నటిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ వీరి పాత్రలపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం ఇప్పటివరకు రాలేదు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



