Bigg Boss | హీరోయిన్‌గా బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ – బోల్డ్ రోల్‌లో
బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ఇనయా సుల్తానా హీరోయిన్‌గా యద్భావం తద్భవతి పేరుతో ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేస్తోంది. వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ నవంబర్ 27న థియేటర్లలోకి రాబోతుంది.
Entertainment | Published On Nov 5, 2026, 6.56 pm IST
Bigg Boss | బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ఇనయా సుల్తానా హీరోయిన్‌గా తెలుగులో ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేస్తోంది. యద్భావం తద్భవతి పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ కన్ఫామ్ చేశారు. నవంబర్ 27న యద్భావం తద్భవతి థియేటర్లలోకి రాబోతున్నట్లు ప్రకటించారు.
రగ్గ్‌డ్ రోల్...
యద్భావం తద్భవతి లో ఇనయా సుల్తానాతో పాటు రేణుశ్రీ మరో నాయికగా నటిస్తోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు రమేష్ జక్కల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వరుణ్ సందేశ్ మాస్ రగ్డ్‌డ్ పాత్రలో నటిస్తోండగా... ఇనయా సుల్తానా పాత్ర బోల్డ్‌గా గ్లామర్ హంగులతో సాగుతుందని అంటున్నారు. సుమన్, నాగమహేష్, శ్వేత వర్మ, ధన్‌రాజ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
టీజర్ రిలీజ్...
యద్భావం తద్భవతి మూవీ టీజర్‌ను గురువారం ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్ రిలీజ్ చేశారు. యాక్షన్, క్రైమ్, గ్లామర్ అంశాలతో ఈ టీజర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. మిహిరామ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఇనయా సుల్తానా ఏడో ప్లేస్‌తో హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. బిగ్‌బాస్‌తో వచ్చిన గుర్తింపుతో తెలుగులో కొన్ని సినిమాలతో పాటు సీరియల్స్ చేసింది. ఏవం జగత్, వాలెంటైన్స్ నైట్, నట రత్నాలు, శివంభజేతో పాటు మరికొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించింది. బ్రహ్మముడితో పాటు మరికొన్ని సీరియల్స్ చేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Movie Review | నా వైఫ్ మిస్సింగ్ మూవీ రివ్యూ – వరుణ్ సందేశ్, శ్వేత బసు ప్రసాద్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
అక్టోబర్ 22, 2026

Web Series | నేను వర్జిన్ కాదు – హీరోకు షాకిచ్చిన హీరోయిన్ శ్వేతబసు ప్రసాద్…
అక్టోబర్ 8, 2026

Shweta Basu Prasad | టాలీవుడ్లోకి శ్వేతాబసు ప్రసాద్ రీఎంట్రీ – కొత్త బంగారం లోకం హీరోతో మిస్టరీ థ్రిల్లర్ వెబ్‌సిరీస్
సెప్టెంబర్ 27, 2026
తాజావార్తలు
- ●Pending Election Bills | ఇబ్బంది పడుతున్నాం.. ఎన్నికల పెండింగ్ బిల్లులివ్వండి
- ●Telangana Global Summit | గ్లోబల్ సమ్మిట్‌కు తెలంగాణ గ్రాండ్ ప్లాన్
- ●Komatireddy Venkat Reddy | ఎంత కరువొచ్చినా సాగునీరివ్వొచ్చు
- ●Indian Bank | ఇండియన్ బ్యాంక్‌లో 1500 అప్రెంటిస్‌లు.. తెలంగాణలో ఎన్ని ఖాళీలు అంటే?
- ●Yash | ఇన్‌స్టాగ్రామ్‌లో యశ్‌కు కోటిన్నర ఫాలోవర్స్ - అతడు ఫాలో అయ్యిది మాత్రం ఒక్కరినే - ఆ హీరోయిన్ ఎవరంటే?
- ●Debit Card Insurance | డెబిట్ కార్డుపై రూ.2 లక్షల బీమా.. చాలా మందికి తెలియని విషయం..

Pending Election Bills | ఇబ్బంది పడుతున్నాం.. ఎన్నికల పెండింగ్ బిల్లులివ్వండి

Telangana Global Summit | గ్లోబల్ సమ్మిట్‌కు తెలంగాణ గ్రాండ్ ప్లాన్

Komatireddy Venkat Reddy | ఎంత కరువొచ్చినా సాగునీరివ్వొచ్చు

Indian Bank | ఇండియన్ బ్యాంక్‌లో 1500 అప్రెంటిస్‌లు.. తెలంగాణలో ఎన్ని ఖాళీలు అంటే?



