Web Series | నేను వర్జిన్ కాదు – హీరోకు షాకిచ్చిన హీరోయిన్ శ్వేతబసు ప్రసాద్…
కొత్త బంగారు లోకం జోడీ వరుణ్ సందేశ్, శ్వేత బసు ప్రసాద్ కాంబినేషన్‌లో తెలుగులో ఓ వెబ్‌సిరీస్ రాబోతుంది. నా వైఫ్ మిస్సింగ్ పేరుతో తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ అక్టోబర్ 22 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్‌ను డైరెక్టర్ వీవీ వినాయక్ రిలీజ్ చేశారు.
Entertainment | Published On Oct 8, 2026, 12.44 pm IST
Web Series |కొత్త బంగారు లోకం జోడీ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హీరోహీరోయిన్లు వరుణ్ సందేశ్, శ్వేతబసు ప్రసాద్ కలిసి మళ్లీ స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెలుగులో ఓ వెబ్‌సిరీస్ రాబోతుంది. నా వైఫ్ మిస్సింగ్ పేరుతో మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌కు స్వాతి ప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 22 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.
సస్పెన్స్ విత్ రొమాన్స్...
నా వైఫ్ మిస్సింగ్ టీజర్‌ను డైరెక్టర్ వీవీ వినాయక్ రిలీజ్ చేశారు. రొమాన్స్, మిస్టరీ, సస్పెన్స్ అంశాలతో ఈ టీజర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. వరుణ్ సందేశ్, శ్వేతబసు ప్రసాద్ పెళ్లిచూపుల సీన్‌తో ఈ టీజర్ మొదలైంది. తను వర్జిన్ కాదు అని హీరోయిన్ చెప్పడంతో హీరో షాక్ కు గురైనట్లు చూపించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో తన వైఫ్ మిస్ అయినట్లు వరుణ్ కంప్లైంట్ ఇవ్వడం ఆసక్తిని పంచుతోంది. పెళ్లి చూపుల సమయంలో శ్వేత చెప్పింది నిజమేనా? ఆమె మిస్సింగ్ కు కారణమేంటి?పోలీసుల సహాయంతో తన భార్య అదృశ్యం వెనకున్న మిస్టరీని వరుణ్ తెలుసుకోగలిగాడా అనే అంశాలతో ఈ టీజర్ ఉత్కంఠను పంచుతోంది.
బాలు...స్వప్న....
కొత్త బంగారు లోకం సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ మరోసారి బాలు, స్వప్న పాత్రల్లోనే వరుణ్ సందేశ్, శ్వేతబసు ప్రసాద్ కనిపించబోతున్నారు. ఈ సిరీస్‌లో ప్రవీణ్, సత్యశ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌తో దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత శ్వేతబసు ప్రసాద్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Song Lyrics | సద్ది గట్టి…సెలకల తొవ్వ బట్టి – తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ – ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో…
అక్టోబర్ 9, 2026

Sharwanand | అచ్చ తెలంగాణ మాండలికంతో భోగి పాట – కమ్మరోళ్ల గంగగా శర్వానంద్
అక్టోబర్ 9, 2026

Prabhas Fauzi | ప్రభాస్ బర్త్‌డేకు ‘ఫౌజీ’ డబుల్ ధమాకా – ఇమాన్వీ ఫస్ట్ లుక్‌పై అప్పుడే క్లారిటీ?
అక్టోబర్ 9, 2026
తాజావార్తలు
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!



