Movie Review | నా వైఫ్ మిస్సింగ్ మూవీ రివ్యూ – వరుణ్ సందేశ్, శ్వేత బసు ప్రసాద్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
కొత్త బంగారు లోకం జోడీ వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ కాంబినేషన్‌లో రూపొందిన తెలుగు మూవీ నా వైఫ్ మిస్సింగ్ గురువారం ఆహా ఓటీటీలో రిలీజైంది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? అంటే?
Entertainment | Published On Oct 22, 2026, 7.14 pm IST
Movie Review |కొత్త బంగారు లోకం...అప్పట్లో యూత్ సినిమాల్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో బాలు, స్వప్న పాత్రల్లో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ తమ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. యూత్ తమను తాము వారి పాత్రల్లో చూసుకునేలా నటించారు. కొత్త బంగారు లోకం తర్వాత దాదాపు 18 ఏళ్ల లాంగ్ గ్యాప్ అనంతరం వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంటగా నటించిన మూవీ నా వైఫ్ మిస్సింగ్. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహించారు. థియేటర్లను స్కిప్ చేస్తూ నేరుగా ఆహా ఓటీటీలో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?
బాలు, స్వప్న కథ...
బాలసుబ్రహ్మణ్యం అలియాస్ బాలు (వరుణ్ సందేశ్) సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. స్వప్న (శ్వేత బసు ప్రసాద్)అనే అమ్మాయితో అతడి పెళ్లి జరుగుతుంది. పెళ్లి చూపుల్లో తాను వర్జిన్ కాదని స్వప్న చెబుతుంది. అయినా ఆమె మెడలో మూడుముళ్లు వేస్తాడు బాలు. ఫస్ట్ నైట్ రోజే తాను అబాన్ అబ్బాయిని ప్రేమిస్తున్నానంటూ తన లవ్ ఎఫైర్‌ను బయటపెడుతుంది స్వప్న. అబాన్ వేరే మతం వాడు కావడం, వయసులో స్వప్న కంటే చిన్నవాడు కావడంతో కూతురి ప్రేమకు ఆమె తల్లిదండ్రులు అడ్డుచెబుతారు.
బాలుతో పెళ్లి జరిగినా ప్రియుడిని మర్చిపోలేకపోతుంది స్వప్న. అతడితో లేచిపోవాలని నిర్ణయించుకుంటుంది. భార్య ప్రేమ విషయం తెలిసి ఆమెను నచ్చజెప్పాలని చూస్తాడు బాలు. అయినా వినకపోవడంతో పెద్ద మనసుతో స్వప్న, అబాన్‌ల ప్రేమకు సాయం చేయాలని అనుకుంటాడు బాలు. ముగ్గురు కలిసి ఓ ప్లాన్ వేస్తారు. ఈ ప్లాన్‌లో భాగంగా స్వప్న మిస్సయ్యిందంటూ బాలు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇస్తాడు. కానీ నిజంగానే స్వప్న కనిపించకుండా పోతుంది. ఈ కేసులో అనుకోకుండా బాలునే చిక్కుకుంటాడు. పోలీస్ ఆఫీసర్ రవి (ప్రవీణ్)ఇన్వేస్టిగేషన్‌లో ప్రియుడు అబాన్ దగ్గర కూడా స్వప్న లేదనే నిజం బయటపడుతుంది. భర్త, ప్రియుడికి చెప్పకుండా స్వప్న ఏమైపోయింది? క్షుద్రపూజలు చేసే ముఠా బారి నుంచి భార్యను బాలు ఎలా కాపాడుకున్నాడు? బాలు ప్రేమ, మంచితనాన్ని స్వప్న ఎలా అర్థం చేసుకుంది? అనారోగ్యం బారి నుంచి భార్యను కాపాడుకునే ప్రయత్నంలో పోలీస్ ఆఫీసర్ రవి ఎలా తప్పటడుగు వేశాడు అన్నదే ఈ మూవీ మిగిలిన కథ.
ట్విస్ట్‌ల మధ్యలో కథ...
ఇది వరకు డైరెక్టర్లు ఓ కథ రాసుకొని అందులో నాలుగైదు ట్విస్ట్‌లు ఉండేలా చూసుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ముందే ట్విస్ట్‌లు రాసుకొని వాటి చుట్టూ కథను అల్లుకుంటున్నారు. కథ పాతదైనా పర్వాలేదు.. ట్విస్ట్‌లు వర్కవుట్ చేసి ఆడియెన్స్‌ను మెప్పించాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే ఇప్పుడు సక్సెస్ పార్ములా అయిపోయింది.
ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతూ వచ్చిన సినిమానే నా వైఫ్ మిస్సింగ్.
మరో యాంగిల్‌లో...
భర్తను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయిన భార్య అంటూ ఈ మధ్యకాలంలో రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వాటి నుంచి ఇన్‌స్పైర్ అయ్యి ఈ కథను రాసుకున్నారు. నిజమైన ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలుసుకోకుండా వేసే తప్పటడుగు ఎలాంటి బాధను మిగుల్చుతుందన్నది మరో యాంగిల్‌లో చూపించారు. ఆధునిక యుగంలో క్షుద్రపూజల పేరుతో కొందరు తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారన్నది ఆవిష్కరించారు.
తప్పొప్పులు కాకుండా...
భార్యకు తనంటే ఇష్టం లేదని తెలిసి ఆమెను ప్రాణాలతో కాపాడుకోవాలని బ్యాంకు మేనేజర్ సాగించే పోరాటం ఓ వైపు... సర్వస్వంఅనుకున్న భార్య కళ్లముందే జీవచ్ఛవంలా మారిపోతే ...ఆమెను ఎలాగైనా తిరిగి మామూలు మనిషిని చేయడం కోసం అవసరమైతే తప్పు చేయడానికి వెనుకాడని పోలీస్ ఆఫీసర్ కథ మరోవైపు ఈ సినిమాలో చూపించారు. మెసేజ్‌లు, తప్పొప్పులు గురించి డిస్కస్ చేయకుండా కేవలంఆడియెన్స్‌కు మంచి థ్రిల్లర్ మూవీ ఎక్స్‌పీరియన్స్‌ను అందివ్వాలని ప్రయత్నించారు.
ట్విస్ట్‌లు
ట్విస్ట్‌లు బాగున్నాయి. మంచి ఆర్టిస్టులు దొరికారు. ఎటొచ్చి కథను నడిపించడంలోనే దర్శకురాలు తడబడిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. బాలు, స్వప్న మధ్య విభేదాలు, తిరిగి ప్రేమ పుట్టే సీన్లను ఎమోషనల్‌గా చూపించలేకపోయారు. మేకింగ్ వాల్యూస్ సీరియల్‌లా ఉన్నాయి.
బాలు, స్వప్న పాత్రల్లో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ కెమిస్ట్రీ చాలా అసహజంగా అనిపిస్తుంది. ప్రవీణ్ రోల్‌ను మాత్రం బాగా రాసుకున్నారు. సినిమా రన్‌టైమ్ గంట ముప్పై తొమ్మిది నిమిషాలే. ఆ రన్‌టైమ్‌లో రెండు పాటలు బలవంతంగా ఇరికించారు. టెక్నికల్‌గా సాయి కార్తీక్ మ్యూజిక్ ఒక్కటే బాగుంది.
తక్కువ రన్‌టైమ్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. వరుణ్ సందేశ్, శ్వేత బసు ప్రసాద్ జోడీ కోసం ఓ సారి చూడొచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sara Arjun | సారా అర్జున్ వర్సెస్ మమితా బైజు – రామ్‌చరణ్‌తో జోడీ కట్టేది ఎవరంటే?
అక్టోబర్ 22, 2026

Sumanth Prabhas | తెలంగాణ ప్రేమకథతో సుమంత్ ప్రభాస్ కొత్త మూవీ – హీరోయిన్గా మిస్ కేరళ
అక్టోబర్ 22, 2026

Rashmika Mandanna | జాన్వీకపూర్ పెద్ది వివాదంపై రష్మిక రియాక్షన్ – “నో” చెప్పడం తప్పుకాదన్న విజయ్ దేవరకొండ
అక్టోబర్ 22, 2026
తాజావార్తలు
- ●Driving License | డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్‌లో కీలక మార్పులు.. ఎప్పటినుంచంటే!
- ●CS Pramesh | క్యాన్సర్ నిపుణులను తీర్చిదిద్దడం అత్యంత అవసరం
- ●Telangana Police | దక్షిణాది రాష్ట్రాల మధ్య పోలీసు సమన్వయం మరింత బలోపేతం
- ●BRS Party | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. బీఆర్ఎస్ కీలక నిర్ణయం
- ●Tenth Exam Fee | పది పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 30 నుంచి ప్రారంభం
- ●MP High Court | పొగాకు మానేయమంటే..పుట్టింటికి పోయింది.. కాపురం వద్దన్నది

Driving License | డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్‌లో కీలక మార్పులు.. ఎప్పటినుంచంటే!

CS Pramesh | క్యాన్సర్ నిపుణులను తీర్చిదిద్దడం అత్యంత అవసరం

Telangana Police | దక్షిణాది రాష్ట్రాల మధ్య పోలీసు సమన్వయం మరింత బలోపేతం

BRS Party | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. బీఆర్ఎస్ కీలక నిర్ణయం



