త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shweta Basu Prasad | టాలీవుడ్‌లోకి శ్వేతాబ‌సు ప్ర‌సాద్ రీఎంట్రీ – కొత్త బంగారం లోకం హీరోతో మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్

వ‌రుణ్ సందేశ్‌, శ్వేతా బ‌సు ప్ర‌సాద్ హీరోహీరోయిన్లుగా న‌టించిన కొత్త బంగారు లోకం మూవీ పెద్ద హిట్ట‌య్యింది. దాదాపు ప‌ద్దెనిమిదేళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఈ జోడీ మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. వ‌రుణ్ సందేశ్‌, శ్వేతా బ‌సు ప్ర‌సాద్ క‌లిసి ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నారు. ఈ సిరీస్ టైటిల్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆదివారం క‌న్ఫామ్ అయ్యాయి.

N

Entertainment | Published On Sep 27, 2026, 6.53 pm IST

Shweta Basu Prasad | టాలీవుడ్‌లోకి శ్వేతాబ‌సు ప్ర‌సాద్ రీఎంట్రీ – కొత్త బంగారం లోకం హీరోతో మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్
Advertisement

వ‌రుణ్ సందేశ్‌, శ్వేతాబ‌సు ప్ర‌సాద్ హీరోహీరోయిన్లుగా న‌టించిన కొత్త బంగారం లోకం క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద హిట్ట‌య్యింది. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ యూత్‌పుల్ ల‌వ్‌స్టోరీని దిల్‌రాజు నిర్మించారు. వ‌రుణ్ సందేశ్‌, శ్వేతా బ‌సు ప్ర‌సాద్ యాక్టింగ్‌, మిక్కీ జే మేయ‌ర్ పాట‌లు అప్ప‌ట్లో యూత్ ఆడియెన్స్‌ను తెగ మెప్పించాయి. ప‌ద్దెనిమిదేళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత వ‌రుణ్ సందేశ్‌, శ్వేతా బ‌సు ప్ర‌సాద్ జోడీ మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. అయితే సినిమాతో కాదు. వీరిద్ద‌రు క‌లిసి ఓ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ చేశారు. ఈ సిరీస్ టైటిల్‌తో పాటు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఖ‌రార‌య్యాయి.

నా వైఫ్ మిస్సింగ్‌...

సైక‌లాజిక‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్‌కు నా వైఫ్ మిస్సింగ్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. త్వ‌ర‌లో ఆహా ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. టైటిల్ గ్లింప్స్ వీడియోను ఆదివారం మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఇందులో పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లిన వ‌రుణ్ సందేశ్ త‌న పేరును బాలుగా ప‌రిచయం చేసుకుంటాడు. గ్రామీణ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తున్నాన‌ని చెబుతాడు. ఆ త‌ర్వాత ఫోన్‌లో నుంచి ఓ అమ్మాయి ఫొటో తీసి చూపించి త‌న వైఫ్ మిస్సింగ్ అని చెప్ప‌డంతో ఈ వీడియో గ్లింప్స్ ఎండ్ అయ్యింది. అత‌డు చూపించిన ఫొటోలో శ్వేతాబ‌సు ప్ర‌సాద్ క‌నిపిస్తోంది.

బాలు...స్వ‌ప్న‌...

కొత్త బంగారు లోకం సినిమాలో బాలు, స్వ‌ప్న అనే పాత్ర‌ల్లో వ‌రుణ్ సందేశ్‌, శ్వేతాబ‌సు ప్ర‌సాద్ క‌నిపించారు. మ‌ళ్లీ అవే పేర్ల‌తో ఈ వెబ్‌సిరీస్‌లో వీరిద్ద‌రు న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. మై వైఫ్ మిస్సింగ్ వెబ్‌సిరీస్‌కు స్వాతి ప్ర‌కాష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సాయికార్తిక్ మ్యూజిక్ అందించారు.

వివాదాల‌తో...

కొత్త బంగారు లోకం సినిమాతోనే తెలుగులో ఫేమ‌స్ అయ్యింది శ్వేతా బ‌సు ప్ర‌సాద్‌. ఈ సినిమా హిట్ట‌వ్వ‌డంతో తెలుగులో ఆమెకు చాలానే ఆఫ‌ర్లు వ‌చ్చాయి. రైడ్‌, కాస్కో, క‌ళావ‌ర్ కింగ్‌, ప్రియుడుతో పాటు చాలానే సినిమాలు చేసింది. ప‌రాజ‌యాల‌తో తోడు వ్య‌క్తిగత జీవితంలోని వివాదాల కార‌ణంగా సినిమాల‌కు దూర‌మైంది. మై వైఫ్ మిస్సింగ్ వెబ్‌సిరీస్‌తో ఎనిమిదేళ్ల త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది.

Advertisement
Advertisement